Asianet News TeluguAsianet News Telugu

ఫాక్స్‌కాన్-వేదాంత ఒప్పందం: గుజరాత్‌లో రూ.1.50 లక్షల కోట్ల పెట్టుబడులు, లక్ష ఉద్యోగాల కల్పన.. 

దేశంలోని ఆయిల్-టు-మెటల్స్ సమ్మేళనం వేదాంత లిమిటెడ్ తన సెమీకండక్టర్ ప్రాజెక్ట్ కోసం గుజరాత్‌ను ఎంచుకుంది. ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్‌కాన్‌తో కలిసి గుజరాత్‌లో సెమీకండక్టర్ మరియు డిస్‌ప్లే FAB తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వేదాంత ప్రకటించింది. రాష్ట్రంలో యూనిట్‌ను నెలకొల్పేందుకు రెండు కంపెనీలు రూ.1,54,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి.

Foxconn Vedanta deal Rs 1 lakh crore investments in Gujarat creation of one lakh jobs
Author
First Published Sep 13, 2022, 2:31 PM IST

వేదాంత గ్రూప్, తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఫాక్స్‌కాన్ సంయుక్తంగా గుజరాత్‌లో సెమీకండక్టర్, డిస్‌ప్లే FAB తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వేదాంత ప్రకటించాయి. గుజరాత్‌లో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడం ద్వారా సుమారు 1 లక్ష ఉద్యోగాలను సృష్టించనుంది. 

భారతదేశానికి చెందిన వేదాంత గ్రూప్, తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఫాక్స్‌కాన్ గుజరాత్‌లో 2 బిలియన్ డాలర్ల సెమీకండక్టర్ మరియు డిస్ ప్లే FAP ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాయి. గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో వేదాంత గ్రూప్, ఫాక్స్‌కాన్ మధ్య ఎంఓయూ కుదిరింది. కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

గుజరాత్‌లో రెండు కంపెనీలు సంయుక్తంగా రూ.1 లక్షా 54 వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నాయి. ఈ ఫ్యాక్టరీ ద్వారా లక్ష మందికి ఉపాధి లభిస్తుందని గుజరాత్ ప్రభుత్వం భావిస్తోంది. వేదాంత గ్రూప్  ఫాక్స్‌కాన్‌ల జాయింట్ వెంచర్ అహ్మదాబాద్‌లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. పెట్టుబడి రాయితీ, విద్యుత్ సబ్సిడీ, పెట్టుబడి ఖర్చు సబ్సిడీ, ఆర్థికేతర ప్రోత్సాహకాలతో సహా ఫ్యాక్టరీని స్థాపించడానికి గుజరాత్ ప్రభుత్వం వేదాంత గ్రూప్‌కు ఆర్థిక, ఆర్థికేతర ప్రోత్సాహకాలను అందిస్తోంది.

ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు వేదాంత గ్రూప్ గుజరాత్ ప్రభుత్వం నుంచి 1000 ఎకరాల భూమిని సేకరించనుంది. ఈ భూమిని 99 ఏళ్ల పాటు ఉచితంగా వినియోగించుకుంటామని వేదాంత గ్రూప్ కోరినట్లు సమాచారం. వేదాంత గ్రూప్ కూడా 20 ఏళ్లుగా నిర్ణీత ధరలకు నీరు, విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తోంది.

మహారాష్ట్ర, తెలంగాణ, కర్నాటకలో కూడా ఇదే తరహాలో సెమీకండక్టర్ ఫ్యాక్టరీలను నెలకొల్పేందుకు వేదాంత గ్రూప్ చర్చలు జరుపుతోంది.  భారతదేశ సెమీకండక్టర్ మార్కెట్ 2020లో 1,500 కోట్ల డాలర్లుగా ఉంటుందని, 2026 నాటికి 6,300 కోట్ల డాలర్లకు పెరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. భారతదేశంలో చిప్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసిన 3వ కంపెనీ వేదాంత గ్రూప్. దీనికి ముందు, సింగపూర్‌కు చెందిన ఐజిఎస్‌ఎస్ వెంచర్స్ కర్ణాటకలోనూ, ఐఎస్‌ఎంసి తమిళనాడులో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. 

ఇదిలా ఉంటే, ప్రపంచంలోని చిప్ ఉత్పత్తిలో ఎక్కువ భాగం తైవాన్ వంటి కొన్ని దేశాలకే పరిమితమైంది. ఎలక్ట్రానిక్స్‌ తయారీపై భారత్‌ చాలా దృష్టి సారిస్తోంది. అందువల్ల, దేశం ఇతర కంపెనీలను స్వాగతించడానికి సిద్ధంగా ఉంది. ఆయిల్-టు-మెటల్స్ వ్యాపారంలో విస్తరించిన వేదాంత ఫిబ్రవరిలో చిప్ తయారీలోకి అడుగుపెట్టినట్లు ప్రకటించింది. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్‌కాన్‌తో కలిసి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios