Asianet News TeluguAsianet News Telugu

ఫుడ్ డెలివరీ పార్టనర్లకు స్విగ్గీ గుడ్ న్యూస్.. 2 లక్షలకు పైగా ఉద్యోగులకు లబ్ది..

కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పలు కంపెనీలు వారి సిబ్బందికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ అందించేందుకు  ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో   స్విగ్గీ  కూడా డెలివరీ పార్ట్‌నర్లు అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సినేషన్‌ అందిస్తామని ప్రకటించింది. 

food delivery Swiggy to cover COVID-19 vaccination cost for over 2 lakh delivery partners
Author
Hyderabad, First Published Mar 25, 2021, 11:51 AM IST

దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల దృశ్య ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది.  కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పలు కంపెనీలు వారి సిబ్బందికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ అందించేందుకు  ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో   స్విగ్గీ  కూడా డెలివరీ పార్ట్‌నర్లు అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సినేషన్‌ అందిస్తామని ప్రకటించింది. 

దేశవ్యాప్తంగా ఉన్న 2 లక్షలకు పైగా డెలివరీ పార్ట్‌నర్లకు మొత్తం వాక్సిన్ ఖర్చును భరిస్తామని  స్విగ్గి బుధవారం తెలిపింది. "కరోనా మహమ్మారిపై పోరాడటానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. అలాగే తమ ఉద్యోగులకు కరోనా వాక్సిన్ ఖర్చులను కూడా భరిస్తామని వెల్లడించారు.

దీనితో పాటు టీకా స్వీకరణ నిమిత్తం సెలవు తీసుకుంటే జీతం కూడా చెల్లిస్తామని తెలిపారు. వీరికి టీకా కోసం తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామని స్విగ్జీ సీఓఓ వివేక్ సుందర్ పేర్కొన్నారు.

also read కుప్పకూలిన స్టాక్ మార్కెట్: పెరుగుతున్న కరోనా కేసులపై పెట్టుబడిదారుల ఆందోళన, సెన్సెక్స్-నిఫ్టీ డౌన్ ...

టీకాలు తీసుకోవడానికి ముందు తమ డెలివరీ పార్ట్‌నర్లకు వర్క్‌షాప్‌, కౌన్సెలింగ్ సెషన్‌ల ద్వారా అవగాహన కల్పించనున్నాట్లు తెలిపారు. ఇందుకు తగిన జాగ్రత్తలను తెలియచెప్పేలా ఒక ఆరోగ్య భాగస్వామితో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. 

ఏప్రిల్ 1 నుండి 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు కరోనా వైరస్  టీకాలు తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.  అయితే మొదటి దశలో 45 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల 5,500 మంది స్విగ్గి డెలివరీ పార్ట్‌నర్లకు టీకాలు తీసుకోవడానికి అర్హులు అవుతారని స్విగ్గి ఒక ప్రకటనలో తెలిపింది.

"లైఫ్ ఇన్సూరెన్స్, మెడికల్ అండ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాటు కోవిడ్-19 నుండి కోలుకుంటున్న వారి ఖర్చులను కంపెనీ అందిస్తోంది" అని స్విగ్గి వెల్లడించింది.

పూనేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా  కోవిషీల్డ్ ఇంకా హైదరాబాద్ కి చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ యొక్క కోవాక్సిన్ అనే రెండు కోవిడ్-19 వ్యాక్సిన్లకు భారత ప్రభుత్వం  అత్యవసర వినియోగం కోసం మంజూరు చేసింది, వీటిని ప్రస్తుతం ప్రభుత్వ టీకా డ్రైవ్‌లో ఉపయోగిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios