Asianet News TeluguAsianet News Telugu

కుప్పకూలిన స్టాక్ మార్కెట్: పెరుగుతున్న కరోనా కేసులపై పెట్టుబడిదారుల ఆందోళన, సెన్సెక్స్-నిఫ్టీ డౌన్

బలహీనమైన ప్రపంచ సూచనల కారణంగా స్టాక్ మార్కెట్ నష్టాల మీద ప్రారంభమైంది. దేశంలో పెరుగుతున్న  కరోనా కేసుల కారణంగా పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో సెన్సెక్స్, నిఫ్టీలు కింది స్థాయికి పడిపోతుంది. 

Stock market Sensex, Nifty Today  collapses: Investors worries over Corona rising cases Sensex-Nifty falls sharply
Author
Hyderabad, First Published Mar 24, 2021, 4:17 PM IST

 ఈ వారంలోని మూడవ ట్రేడింగ్ రోజున  అంటే బుధవారం బలహీనమైన ప్రపంచ సూచనల కారణంగా స్టాక్ మార్కెట్ నష్టాల మీద ప్రారంభమైంది. దేశంలో పెరుగుతున్న  కరోనా కేసుల కారణంగా పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో సెన్సెక్స్, నిఫ్టీలు కింది స్థాయికి పడిపోతుంది.

మధ్యాహ్నం 2.32 గంటలకు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్   ఇండెక్స్ సెన్సెక్స్ 574.29 పాయింట్లు (1.15 శాతం) తగ్గి 49,477.15 వద్దకు చేరుకుంది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 16,6 పాయింట్లు లేదా 1.12 శాతం తగ్గి 14,648.75 స్థాయిలో ట్రేడవుతోంది.  

ఉదయం సెన్సెక్స్ 302.03 పాయింట్లు (0.60 శాతం) తగ్గి 49,749.41 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 87.30 పాయింట్లు లేదా 0.59 శాతం పడిపోయి 14,727.50 వద్ద ప్రారంభమైంది. అలాగే నేడు 494 షేర్లు లాభపడ్డాయి, 668 షేర్లు క్షీణించాయి, 66 స్టాక్స్ మారలేదు.

 మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి మళ్ళీ మొదలైంది ఉంది. తాజాగా దేశంలో 47 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదైయ్యాయి. వీరిలో 77.44 శాతం మంది దేశంలోని ఈ 5 రాష్ట్రాలకు చెందినవారు. మహారాష్ట్రలో బుధవారం అత్యధికంగా 28,699 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 50 రోజుల తరువాత, నేడు ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ 49200 స్థాయిని తాకింది. 

also read ఏప్రిల్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఆర్‌బి‌ఐ హాలీ డేస్ లిస్ట్ కోసం ఇక్కడ చూడండి.. ...

 గ్లోబల్ మార్కెట్ల గురించి మాట్లాడుతూ, హాంకాంగ్ హాంగ్సెంగ్ సూచీ 595 పాయింట్లు లేదా 2.09 శాతం పడిపోయి 27,902 వద్దకు చేరుకుంది. షాంఘై కాంపోజిట్ ఆఫ్ చైనా 38 పాయింట్లు తగ్గి 3,373 వద్ద ట్రేడవుతోంది. జపాన్‌కు చెందిన నిక్కీ ఇండెక్స్ 543 పాయింట్లు పడిపోయి 28,452 వద్ద ట్రేడవుతోంది.

కొరియాకు చెందిన కోస్పి ఇండెక్స్ 18 పాయింట్లు క్షీణించగా, ఆస్ట్రేలియాకు చెందిన ఆల్ ఆర్డినరీస్ 25 పాయింట్లు పెరిగింది. నాస్‌డాక్ సూచీ 1.12 శాతం పెరిగి 13,277 పాయింట్ల వద్ద ఉంది. డౌ జోన్స్ 308 పాయింట్లు పడిపోయి 32,423 వద్ద ముగిసింది. 

 పెద్ద స్టాక్స్ గురించి మాట్లాడితే ఏషియన్ పెయింట్స్, ఎన్‌టిపిసి, పవర్ గ్రిడ్, నెస్లే ఇండియా, టైటాన్, బజాజ్ ఆటో షేర్లు నేడు  లాభాలతో ప్రారంభమయ్యాయి. మరోవైపు డాక్టర్ రెడ్డి, ఎం అండ్ ఎం, సన్ ఫార్మా, హెచ్‌డిఎఫ్‌సి, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాలతో  మీద ప్రారంభమయ్యాయి.

 సెన్సెక్స్ ఉదయం 9.06 గంటలకు ప్రీ-ఓపెన్ సమయంలో 174.81 పాయింట్లు (0.35 శాతం) 49876.63 వద్ద పడిపోయింది. నిఫ్టీ 90.10 పాయింట్లు (0.61 శాతం) తగ్గి 14724.70 వద్ద ఉంది.

 స్టాక్ మార్కెట్ మంగళవారం గ్రీన్ మార్క్ మీద ముగిసింది. సెన్సెక్స్ 280.15 పాయింట్లు లేదా 0.56 శాతం పెరిగి 50051.44 స్థాయిలో ఉండగా,  నిఫ్టీ 78.35 పాయింట్లు లేదా 0.53 శాతం లాభంతో 14814.75 వద్ద ముగిసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios