Business Ideas: కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముద్ర రుణాల పథకం ప్రారంభం అయ్యింది. ఈ పథకం ద్వారా ఎంతో మంది యువత తమ స్వయం ఉపాధి కోసం రుణాలను పొందుతున్నారు. ఈ రుణాలతో ఫ్లై యాష్ ఇటుకల తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తే ఎంత లాభం వస్తుందో తెలుసుకుందాం.

కరోనా కారణంగా పలు కుటుంబాల ఆర్థిక పరిస్థితి దిగజారింది. చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఈ సంక్షోభ సమయంలో ప్రతి వ్యక్తి ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నారు. అయితే పట్టణ ప్రాంతాల్లో ఇఫ్పుడిప్పుడే ఉపాధి అవకాశాలు మెరుగుఅవుతున్నప్పటికీ, గ్రామాల్లోనే ఉండి వ్యాపారం చేసుకునేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనేక ఆర్థిక సహాయ కార్యక్రమాలను ప్రారంభించింది. 

ఉన్న ఊరిలోనే సరికొత్త బిజినెస్ ఐడియాతో మీరు ఉపాధి పొందడమే కాదు. మరో నలుగురికి కూడా ఉపాధి కల్పించే అవకాశం ఉంది. మీకు స్వంత భూమి ఉండి, తక్కువ పెట్టుబడితో సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే, మీరు ఫ్లై యాష్ ఇటుకల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

ఇందుకోసం 200 నుంచి 500 గజాల స్థలంతోపాటు కనీసం 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దీనితో మీరు ప్రతి నెలా 1 లక్ష రూపాయల వరకూ సంపాదించవచ్చు. ప్రస్తుతం పట్టణాల్లో బిల్డర్లు ఫ్లై యాష్‌తో చేసిన నిర్మాణాలకు ఇటుకలను మాత్రమే ఉపయోగిస్తున్నారు.

ప్రతి నెలా 3 వేల ఇటుకలు తయారు చేసుకోవచ్చు
ఈ ఇటుకలను విద్యుత్ ప్లాంట్ల నుండి విడుదలయ్యే బూడిద, సిమెంట్ మరియు రాతి ధూళి మిశ్రమంతో తయారు చేస్తారు. ఈ వ్యాపారం కోసం, మీ పెట్టుబడిని ఎక్కువగా యంత్రాలపై ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందుకు వినియోగించే మాన్యువల్ యంత్రాన్ని సుమారు 100 గజాల స్థలంలో ఇన్ స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఈ యంత్రం ద్వారా, మీరు ఇటుక ఉత్పత్తి కోసం 5 నుండి 6 మంది కార్మికులు అవసరం. దీంతో రోజుకు దాదాపు 3 వేల ఇటుకలు తయారు చేయవచ్చు.

ఆటోమేటిక్ మెషీన్లతో ఉత్పత్తి మరింత పెరుగుతుది...
ఈ వ్యాపారంలో ఆటోమేటిక్ మెషీన్ల ఉపయోగం సంపాదించే అవకాశాలను పెంచుతుంది. అయితే ఈ ఆటోమేటిక్ మిషన్ ధర రూ.10 నుంచి 12 లక్షల వరకు ఉంటుంది. ముడిసరుకు కలపడం నుంచి ఇటుకల తయారీ వరకు యంత్రం ద్వారానే పనులు జరుగుతున్నాయి. ఆటోమేటిక్ మెషీన్ ద్వారా గంటలో వెయ్యి ఇటుకలను తయారు చేయవచ్చు, అంటే ఈ యంత్రం సహాయంతో మీరు నెలలో మూడు నుండి నాలుగు లక్షల ఇటుకలను తయారు చేయవచ్చు.

ప్రభుత్వం నుంచి రుణం ఇవ్వవచ్చు
బ్యాంకు నుంచి రుణం తీసుకుని కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ముద్ర రుణాలతో పాటు దళిత బంధు లాంటి స్కీంలతో కూడా యువత ఈ స్వయం ఉపాధి వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. 

థర్మల్ కేంద్రాల్లో ఈ ఫ్లై యాష్ ధూళి సులభంగా లభ్యం కావడం వల్ల ముడిసరుకు ధర కూడా తక్కువకే లభిస్తుంది. ఈ ఇటుకలు సాధారణ ఇటుకల కన్నా కూడా మంచి నాణ్యతతో ఉంటాయి.

ఈ ఇటుకలను డిమాండ్ ను బట్టి ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో వీటి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది.జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే నిరంతరం ఆదాయం సంపాదన మీకు సొంతం అవుతుంది.