Asianet News TeluguAsianet News Telugu

అమెజాన్‌తో ఫ్లిప్‌కార్ట్ ‘సై’: ఇలా బిగ్ బీ, కోహ్లీ, పదుకునేలతో సవాల్

డిజిటల్ రిటైల్ దిగ్గజం ‘అమెజాన్’తో తలపడేందుకు దేశీయ ఆన్ లైన్ రిటైల్ మేజర్ ‘ఫ్లిప్‌కార్ట్’ సర్వ సన్నద్ధమవుతోంది. వచ్చే పండుగల సీజన్ సందర్భంగా ప్రకటించిన బిగ్ బిలియన్ డేస్ సేల్స్ స్కీమ్ ఆఫర్ వైపు వినియోగదారులను ఆకట్టుకునేందుకు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, సినీ నటి దీపికా పదుకునే, టీమిండియా సారథి విరాట్ కోహ్లీల సేవలను ప్రచారకర్తలుగా వినియోగించనున్నది ఫ్లిప్‌కార్ట్.

Flipkart ropes in Amitabh Bachchan, Virat Kohli to promote Big Billion Days sale
Author
Mumbai, First Published Sep 27, 2018, 10:32 AM IST

ముంబై: ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ తాజాగా ప్రకటించిన బిగ్ బిలియన్ డేస్ సేల్స్‌లో ఒక తీపి కబురు ఇమిడి ఉంది. బాలీవుడ్ సూపర్ స్టార్ ‘బిగ్ బీ’ అమితాబ్ బచ్చన్, ప్రముఖ సినీ కథా నాయిక దీపికా పదుకునే, టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఈ బిలియన్ డే సేల్స్‌లో భాగస్వాములు అయ్యారు. బిగ్ బీతోపాటు విరాట్ కోహ్లీ, దీపికా పదుకునేలతోనూ ప్రచార ప్రకటనలు రూపొందిస్తోంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆధ్వర్యంలో ‘సిర్ఫ్ సేల్ నహీ..యేహ్ హై సేల్ కా బిగ్ బీ’ అనే పేరుతో ప్రకటన జారీ చేస్తున్న ఫ్లిప్ కార్ట్... కోహ్లీ, పదుకునేలతోనూ వేర్వేరు యాడ్స్ రూపొందిస్తోంది. 

ఇంటర్నేషనల్ ఆన్ లైన్ ఈ- కామర్స్ అమెజాన్ విసిరిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్‌ను ఎదుర్కొనేందుకు స్టార్ పవర్‌ను ఉపయోగించుకోవాలని నిశ్చయించుకుంది. అందుకోసం తన ‘బిగ్ బిలియన్ డే సేల్స్’ ప్రచారం కోసం సినిమా, క్రికెట్ రంగాల్లో ప్రముఖులైన అమితాబ్ బచ్చన్, విరాట్ కోహ్లీ, దీపికా పదుకునేలను రంగంలోకి దించుతోంది. అక్టోబర్ 10వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు సాగే బిగ్ బిలియన్ డే సేల్స్ ప్రచారంలో అమితాబ్, దీపికా పదుకునే, కోహ్లీలు భాగస్వాములయ్యారు. 

ఫ్లిప్ కార్ట్ ప్రత్యర్థి అమెజాన్ కూడా ఇదే టైంలో నవరాత్రి, దుర్గా పూజ, దీపావళి పండుగల సందర్భంగా తన ఫెస్టివల్ సేల్స్‌ను ప్రారంభించనున్నది. 16 బిలియన్ల డాలర్లకు వాల్ మార్ట్ స్వాధీనం చేసుకున్న తర్వాత ఫ్లిప్ కార్ట్ ముందుకు వచ్చిన బిలియన్ డేస్ సేల్ ఇదే తొలిసారి. తాజాగా మంచి ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు ‘అబ్ ఇండియా హోగా బడ్జెట్ సే ముక్త్’ ట్యాగ్ లైన్ తో ప్రచారంలోకి దిగుతున్నది. 

స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్, ఫ్యాషన్ తదితర ఉత్పత్తులను మార్కెట్ లోకి తీసుకు రానున్నది. అక్టోబర్ 12 నుంచి 14వ తేదీ వరకు బిగ్ బిలియన్ డేస్ సేల్స్ దేశమంతటా అందుబాటులో ఉంటాయి. హెచ్ డీఎఫ్ సీ డెబిట్, క్రెడిట్ కార్డులపై ఎక్స్ క్లూజివ్ ఆఫర్లు, ‘ఫోన్ పే’ యూజర్లకు క్యాష్ బ్యాక్ ఆఫర్ అందుబాటులోకి తెస్తున్నది. 

Follow Us:
Download App:
  • android
  • ios