బీ రెడీ! ఇటు ఫ్లిప్ కార్ట్.. అటు బిగ్ సీ మొబైల్ బోనంజా
మొబైల్ ఫోన్ల పట్ల వినియోగదారుల ఆసక్తిని సొమ్ము చేసుకోవడానికి రిటైలర్లు చేయని ప్రయత్నమూ లేదు. నూతన సంవత్సరం సందర్భంగా వాల్ మార్ట్ అనుబంధ సంస్థ ఫ్లిప్ కార్ట్.. 16వ వార్షికోత్సవం సందర్భంగా బిగ్ సీ ఇబ్బడిముబ్బడిగా మొబైల్ ఫోన్ల కొనుగోళ్లపై రాయితీలు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించాయి.
గతవారం ‘ఇయర్ ఎండ్ కార్నివాల్’తో వినియోగదారుల ముందుకు వచ్చిన ఫ్లిప్‌కార్ట్ బుధవారం నుంచి మరో సేల్‌కు సిద్ధం అవుతోంది. ఈ నెల 26 నుంచి 29 వరకు నాలుగు రోజులు ‘మొబైల్ బొనాంజా’ను నిర్వహించనున్నది. వివిధ రకాల స్మార్ట్‌ఫోన్లపై భారీ రాయితీలు ప్రకటించింది. రియల్‌మీ 2 ప్రొ, ఆసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1, ఆనర్ 9ఎన్, నోకియా 5.1 ప్లస్ వంటి స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు ప్రకటించింది.
రియల్‌మీ 2 ప్రొ 4జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజీ వేరియంట్‌పై వెయ్యి రూపాయలు తగ్గించి రూ.12,990కే అందుబాటులో ఉంచింది. 6జీబీ ర్యామ్/64 స్టోరేజీ వేరియంట్ అసలు ధర రూ.15,990 కాగా, 8 జీబీ ర్యామ్/128 జీబీ వేరియంట్ ధర రూ.17,990. ఇప్పుడీ రెండింటి ధరలు తగ్గిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.
ఆనర్ 9ఎన్ 3జీబీ ర్యామ్/32 జీబీ వేరియంట్ అసలు ధర రూ. 11,999 కాగా, ఇప్పుడు దీని ధరను భారీగా తగ్గించి రూ. 8,999కే ఆఫర్ చేస్తోంది. 4జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజీ వేరియంట్‌ను రూ.13,999కి, రూ. 4జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజీ వేరియంట్‌ను రూ.17,999కి అందుబాటులోకి తెచ్చింది.
వీటితోపాటు నోకియా 5.1 ప్లస్, ఆనర్ 7ఎ, ఆసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1, ఆసుస్ జెన్‌ఫోన్ లైట్ ఎల్1, నోకియా 6.1 ప్లస్, ఆనర్ 7ఎస్, మోటోరోలా వన్ పవర్, వైయు ఏస్ స్మార్ట్‌ఫోన్లపై ధరలను భారీగా తగ్గించింది. అలాగే, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, బై బ్యాక్ గ్యారెంటీ, ఫ్లిప్‌కార్ట్ కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్యాకేజీ వంటివి అందుబాటులో ఉన్నాయి.
బిగ్ సిలో ప్రతి మొబైల్‌పై 10% క్యాష్ బ్యాక్‌తోపాటు..
ప్రముఖ మొబైల్ ఫోన్ల రిటైల్ విక్రయ సంస్థ బిగ్ సి.. 16వ వార్షికోత్సవ ఆఫర్లను ప్రకటించింది. బజాజ్ ఫైనాన్స్ ద్వారా తమ షోరూంలలో కొనుగోలు చేసిన ప్రతీ మొబైల్‌పై 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేసింది. ప్రతీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.2,200 వరకు జియో క్యాష్‌బ్యాక్, 30 జీబీ జియో డేటా ఉచితమని చెప్పింది.
హెచ్‌డీఎఫ్‌సీ, పేటీఎంలపైనా ఇలా క్యాష్ బ్యాక్ ఆఫర్లు
హెచ్‌డీఎఫ్‌సీ, పేటీఎం క్యాష్‌బ్యాక్ ఆఫర్లూ ఉన్నాయన్న సంస్థ.. పలు ఐఫోన్, శామ్‌సంగ్, షియామీ, వివో, ఒప్పో మొబైల్స్ కొనుగోలుపై వడ్డీ లేకుండా 0% డౌన్ పేమెంట్ సౌకర్యం ఉందన్నది. శామ్‌సంగ్ ఏ9 మొబైల్ కొనుగోలుపై రూ.3,000 క్యాష్‌బ్యాక్, రూ.4,999 విలువ కలిగిన లావా జెడ్60 మొబైల్ కొనుగోలుపై రూ.3,000 రైస్ కుక్కర్‌ను ఉచితంగా ప్రకటించింది.
రాజమండ్రిలో బిగ్ సీ షోరూం ప్రారంభం
రాజమండ్రిలో నూతన షోరూంను బిగ్ సి ప్రారంభించింది. సంస్థ బ్రాండ్ అంబాసిడర్ రాశీఖన్నా చేతులమీదుగా ప్రారంభమైంది. ఈ 2,500 చదరపు అడుగుల షోరూం.. కోస్తాంధ్రలోనే అతి పెద్దదని, 2 వేలకుపైగా మొబైల్స్ అందుబాటులో ఉంటాయని బిగ్ సి వ్యవస్థాపక సీఎండీ ఎం బాలు చౌదరి మీడియాకు తెలిపారు.