వాట్సాప్ ద్వారా ఫ్లయిట్ టికెట్స్ బుకింగ్; కొత్త ఫీచర్‌ని ప్రవేశపెట్టిన ఇండిగో...
ఈ ఫీచర్ గాలిలో ప్రయాణించేందుకు మొదటి స్టెప్స్ ని ఈజీ చేయడం కోసం టార్గెట్ గా పెట్టుకున్నట్లు ఎయిర్‌లైన్ తెలిపింది. కస్టమర్‌లు లాంజ్‌కి చేరుకోకుండానే విమాన సంబంధిత అవసరాలన్నింటినీ నిర్వహించగలరు. తమిళం, హిందీ ఇంకా ఇంగ్లీష్ లో కూడా ఈ సర్వీస్ ఉంటుంది.
ముంబై : భారతదేశంలోని ప్రముఖ క్యారియర్ ఇండిగో ఫ్లయిట్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఒక ఈజీ మార్గాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు వాట్సాప్ ద్వారా ఇండిగో విమానాలను బుక్ చేసుకోవచ్చని ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఈ ఫీచర్ Google ReaFi టెక్నాలజీ సహకారంతో అభివృద్ధి చేసింది. ఇది ఒక పోర్టబుల్ డిజిటల్ ట్రావెల్ ఏజెన్సీగా పని చేస్తుంది. విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవడం, చెక్-ఇన్‌కు సహాయం చేయడం, బోర్డింగ్ పాస్‌ల గురించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం, ట్రావెల్ లేదా విమానాల గురించి తరచుగా వచ్చే ఎంక్వయిరీలకు స్పందించడం వంటి ఎన్నో రకాల సేవలను ఈ ఫీచర్ అందజేస్తుందని ఇండిగో పేర్కొంది.
ఈ ఫీచర్ గాలిలో ప్రయాణించేందుకు మొదటి స్టెప్స్ ని ఈజీ చేయడం కోసం టార్గెట్ గా పెట్టుకున్నట్లు ఎయిర్‌లైన్ తెలిపింది. కస్టమర్‌లు లాంజ్‌కి చేరుకోకుండానే విమాన సంబంధిత అవసరాలన్నింటినీ నిర్వహించగలరు. తమిళం, హిందీ ఇంకా ఇంగ్లీష్ లో కూడా ఈ సర్వీస్ ఉంటుంది.
టిక్కెట్లు ఎలా బుక్ చేసుకోవాలంటే ?
- ముందు కస్టమర్లు +91 7065145858కి "హాయ్" అనే WhatsApp మెసేజ్ పంపాలి.
- దీనికి రిప్లయ్ గా మీరు కొన్ని అప్షన్స్ చూస్తారు.
- ఫ్లైట్ టికెట్ బుకింగ్, వెబ్ చెక్-ఇన్, బోర్డింగ్ పాసెస్, ఫ్లైట్ స్టేటస్‌తో సహా రకరకాల అప్షన్స్ చూపిస్తుంది.
- ఇప్పుడు 'బుక్ ఫ్లైట్ టిక్కెట్స్' అప్షన్ సెలెక్ట్ చేసుకొని, రిప్లయ్ ఇవ్వండి.
- బయలుదేరే ప్రదేశం, చేరుకునే ప్రదేశం, డేట్, టైం సెర్చ్ చేస్తుంది.
- అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చిన తర్వాత, ఫ్లయిట్స్ చూపిస్తుంది. .
- మీకు నచ్చిన ఫ్లయిట్ సెలక్ట్ చేసుకొని కంటిన్యూ చేయండి.
- ఆన్‌లైన్ పేమెంట్ పూర్తయిన తర్వాత టికెట్ లభిస్తుంది.