లాక్ డౌన్  మొదటి రెండు దశలలో అంటే 25 మార్చి 2020 నుండి  3 మే 2020 మధ్య  దేశీయ, అంతర్జాతీయ క్యారియర్‌లలో విమాన ప్రయాణాల కోసం టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణీకులు  డబ్బులు పూర్తిగా తిరిగి ఇవ్వబడుతుంది  అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఆదివారం సుప్రీంకోర్టుకు తెలిపింది.

అలాగే అదనంగా సేకరించిన మొత్తాన్ని కూడా 15 రోజుల్లోపు ప్రయాణీకులకు తిరిగి చెల్లించడానికి విమానయాన సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి అని తెలిపింది. లాక్ డౌన్ సమయంలో విమానాలను రద్దు చేసిన తరువాత ప్రయాణీకులకు విమాన ఛార్జీలను తిరిగి చెల్లించాలని కోరుతూ ఒక అఫిడవిట్ దాఖలైంది.

ప్రయాణీకుల విమాన ఛార్జీలను తిరిగి చెల్లించడానికి ఒక మార్గాన్ని ఎంచుకోవాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో పాటు ప్రైవేట్ విమానయాన సంస్థలను గతంలో ఉన్నత కోర్టును కోరింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా విమానయాన సంస్థలు  డబ్బు చెల్లించకపోతే వారు వసూలు చేసిన ఛార్జీల మొత్తానికి సమానమైన క్రెడిట్ షెల్‌ను రూపొందిస్తారు.

also read ఎస్‌బీఐలో ఉద్యోగుల కోసం కొత్త స్కీము.. డిసెంబర్‌ 1 నుంచి అమలు.. ...

ఈ క్రెడిట్ షెల్ లో టికెట్ బుక్ చేసిన ప్రయాణీకుల పేరిట జాబితా జారీ చేయబడుతుంది. ప్రయాణీకులు వారికి నచ్చిన మార్గంలో 2021 మార్చి 31 వరకు క్రెడిట్ షెల్‌ను వినియోగించుకోవచ్చు. ప్రయాణీకుల క్రెడిట్ షెల్ కంటే ఎక్కువ విలువైన టికెట్ కొనాలనుకుంటే, వారు అదనంగా నగదును చెల్లించి కొనుగోలు చేయవచ్చు.

డి‌జి‌సిఏ కూడా క్రెడిట్ షెల్ ను  బదిలీ చేసుకోవచ్చు అని చెప్పింది, ప్రయాణీకులు క్రెడిట్ షెల్ ను ఏ వ్యక్తికైనా బదిలీ చేయవచ్చు. విమానయాన సంస్థలు అలాంటి బదిలీలను అంగీకరిస్థాయి అని తెలిపింది. ఇలాంటి బదిలీని సులభతరం చేయడానికి విమానయాన సంస్థలు ఒక యంత్రాంగాన్ని రూపొందిస్తాయి.

లాక్ డౌన్ సమయంలో ట్రావెల్ ఏజెంట్ ద్వారా టికెట్లు బుక్ చేస్తే వాటికి పూర్తిగా డబ్బులు వాపసు వెంటనే విమానయాన సంస్థలు ఇస్తాయని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. ఈ మొత్తాన్ని ఏజెంట్ వెంటనే ప్రయాణీకులకు పంపించాలి అని కూడా పేర్కొంది. దేశీయ, విదేశీ, అంతర్జాతీయ ప్రయాణాలకి ఇలాంటి రీఫండ్ షరతులు వర్తిస్తాయి.