ప్రభుత్వ  బ్యాంకింగ్‌ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఉద్యోగుల కోసం 'సెకండ్ ఇన్నింగ్స్ ట్యాప్'ను ప్రవేశపెట్టింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ -విఆర్ఎస్)అమలు చేయాలని భావిస్తోంది.  

వీఆర్‌ఎస్‌ ముసాయిదా ఇప్పటికే సిద్ధమయినట్లు, బోర్డు ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ నుండి జనవరి వరకు అంటే మూడు నెలలు ఈ పథకం అందుబాటులో ఉంటుంది,

25 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి 55 సంవత్సరాలు నిండిన ఉద్యోగులు విఆర్ఎస్ చేసుకోవడానికి అర్హులు అని నివేదికలో పేర్కొంది.కొత్త వీఆర్‌ఎస్ ప్రణాళికకు మొత్తం 11,565 మంది అధికారులు, ఎస్‌బీఐకి చెందిన 18,625 మంది సిబ్బంది అర్హులుగా ఉన్నారు.

also read వాహనాలపై తగ్గనున్న జి‌ఎస్‌టి.. త్వరలో ఆటోమొబైల్‌ పరిశ్రమకు మంచిరోజులు..: కేంద్ర మంత్రి ...

ఈ స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్) ను ఎంచుకున్న వారికి వారి జీతంలో 50 శాతం మిగిలిన సేవా కాలానికి చెల్లించబడుతుంది.అర్హతగల ఉద్యోగులలో 30 శాతం మంది కొత్త పథకాన్ని ఎంచుకుంటే, బ్యాంక్ నికర పొదుపు సుమారు రూ.2,170.85 కోట్లు.

మార్చి 2020 నాటికి, దేశంలో అతిపెద్ద రుణదాత దాదాపు 2.5 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది. మరో వైపు వీఆర్‌ఎస్‌ స్కీముపై బ్యాంకు యూనియన్లు అసంతృప్తి వ్యక్తం చేశాయి.

కరోనా వైరస్‌ మహమ్మారి వల్ల ఆర్ధిక రంగం కుదేలవుతున్న తరుణంలో ఇలాంటి ప్రతిపాదనలు చేయడం ఉద్యోగులపై యాజమాన్యానికి ఉన్న వ్యతిరేక ధోరనీ సూచిస్తోందని నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ బ్యాంక్‌ వర్కర్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అశ్వని రాణా వ్యాఖ్యానించారు.