Asianet News TeluguAsianet News Telugu

దేశ జీడీపీపై ఫిచ్‌ కుండబద్ధలు..లాక్‌డౌన్‌తో ఆర్థికవ్యవస్థపై ప్రభావం..

దేశ సావరిన్‌ ఔట్‌లుక్ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ‘ఫిచ్’ కుండబద్ధలు కొట్టింది. ఎస్‌అండ్‌పీ, మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సంస్థల బాటలో స్టేబుల్ నుంచి నెగెటివ్‌కు పడిపోయిందని అని పేర్కొంది. భారతదేశంలో జీడీపీ మైనస్ 5 శాతం అని వెల్లడించింది.  
 

fitch ratings downgrades indias gdp from stable to negative
Author
Hyderabad, First Published Jun 19, 2020, 1:53 PM IST

న్యూఢిల్లీ: దేశ సావరిన్‌ రేటింగ్‌ ఔట్‌లుక్‌ను విదేశీ దిగ్గజం ఫిచ్‌ తాజాగా డౌన్‌గ్రేడ్‌ చేసింది. గతంలో ఇచ్చిన స్టేబుల్ ‌(స్థిరత్వం) రేటింగ్‌ను నెగిటివ్‌ (ప్రతికూలం)కు సవరించింది. ఇదివరకు ప్రకటించిన లోయస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌ రేటింగ్‌ను కొనసాగించేందుకు నిర్ణయించినట్లు ఫిచ్‌ రేటింగ్స్‌ తెలియజేసింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21)లో దేశ జీడీపీ 5 శాతం ప్రతికూల (మైనస్‌) వృద్ధిని నమోదు చేయనున్నట్లు అంచనా వేసింది. కరోనా కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది. అయితే వచ్చే ఏడాది జీడీపీ 9.5 శాతం పురోభివృద్ధిని సాధించవచ్చని అభిప్రాయ పడింది. 

ఇందుకు ఈ ఏడాది మైనస్‌ వృద్ధి నమోదు కానుండటం (లోబేస్‌) సహకరించే వీలు ఉన్నట్లు తెలిపింది. లాక్‌డౌన్‌ నెమ్మదిగా సరళీకరిస్తున్న నేపథ్యంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉండటం రిస్కులను పెంచుతున్నట్లు ఫిచ్‌ పేర్కొంది.

also read నెరవేరిన ముకేశ్ అంబానీ కల.. 8 నెలల ముందే టార్గెట్ సక్సెస్..

దీంతో ఇండియా గతంలో వేసిన 6-7 శాతం ఆర్థిక వృద్ధిని అందుకునేదీ లేనిదీ వేచిచూడవలసి ఉన్నట్లు తెలియజేసింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశ వృద్ధి అవకాశాలు బలహీనపడ్డాయని, ప్రభుత్వ రుణ భారం పెరగడంతో సవాళ్లు ఎదురుకానున్నట్లు వివరించింది.  

కాగా.. ప్రస్తుతం దేశ సావరిన్‌ రేటింగ్స్‌కు విదేశీ రేటింగ్‌ దిగ్గజాలన్నీ లోయస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌ను ప్రకటించినట్లయ్యిందని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ఫిచ్‌, మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ నెగిటివ్‌ ఔట్‌లుక్‌ను ప్రకటించగా.. స్టాండర్డ్‌ అండ్‌ పూర్స్‌(ఎస్‌అండ్‌పీ) స్టేబుల్‌ రేటింగ్‌ను ఇచ్చింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios