Asianet News TeluguAsianet News Telugu

క్వీన్ ఎలిజబెత్ ఆస్తులు విలువ ఎంత, ఆమె ఆదాయం ఖర్చుల గురించి తెలుసుకోండి

బ్రిటిష్ రాజకుటుంబానికి అధిపతి, క్వీన్ ఎలిజబెత్ II (96) మరణించారు. సెలబ్రిటీ నెట్ వర్త్ ప్రకారం, ఆమె నికర విలువ, ఆదాయం, ఖర్చుల గురించి సర్వత్రా చర్య జరుగుతుంది. క్వీన్ ఎలిజబెత్ కు ఉన్న ఆస్తులు, అలాగే ప్రతీ ఏటా ఆమెకు వచ్చే గ్రాంట్స్ గురించి తెలుసుకుందాం. 
 

Find out how much Queen Elizabeth assets are worth her income and expenses
Author
First Published Sep 9, 2022, 11:26 AM IST

క్వీన్ ఎలిజబెత్ 96వ ఏట కన్నుమూశారు. బ్రిటన్ సామ్రాజ్య చరిత్రలో ఎలిజిబెత్ శకం ముగిసింది. ఈ సందర్భంగా ఆమె గురించి పలు ఆసక్తికరమైన అంశాలు చర్చలోకి వస్తున్నాయి. ప్రపంచ  ధనవంతుల జాబితాలో ఆమె ఉన్నారు. సెలబ్రిటీ నెట్ వర్త్ ప్రకారం, ఆమె  ఆదాయం, ఖర్చుల గురించి మాట్లాడుకుంటే, క్వీన్ ఎలిజబెత్ నికర విలువ 600 మిలియన్ డాలర్లు ( సుమారు రూ.5000 కోట్లు). బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ రాజకుటుంబానికి సావరిన్ గ్రాంట్ ఇస్తుంది. దీని ప్రకారం, 2020 లో, క్వీన్ ఎలిజబెత్ సంవత్సరానికి 86.3 మిలియన్ పౌండ్లను అందుకున్నారు. 

బ్రిటిష్ రాజకుటుంబం గత సంవత్సరం 2020-21 ఆర్థిక సంవత్సరానికి వారి వార్షిక ఖాతాలను ప్రచురించింది, ఇది బ్రిటీష్ రాజ కుటుంబాల అయితే వారికి డబ్బు ఎక్కడి నుంచి అందుతుంది అనేది ప్రశ్న.

క్వీన్ ఎలిజబెత్ ప్రభుత్వం నుండి సావరిన్ గ్రాంట్ పేరిట ప్రతీ ఏడాది ఆదాయం అందుకుంటుంది. ఇవి ఆమె ప్రయాణం, ఆస్తి నిర్వహణ, క్వీన్స్ గృహ నిర్వహణ ఖర్చుల కోసం కేటాయిస్తారు, మిగిలినది బకింగ్‌హామ్ ప్యాలెస్ పునరుద్ధరణ కోసం కేటాయిస్తారు. 

అలాగే క్రౌన్ ఎస్టేట్ నుండి వచ్చే ఆదాయంతో క్వీన్ తమ అధికారిక ఖర్చుల కోసం వినియోగిస్తారు. క్రౌన్ ఎస్టేట్ లండన్ లో ఉంటుంది. దీని కింద రీజెంట్ స్ట్రీట్, UK బీచ్‌లు ఉన్నాయి. క్రౌన్ ఎస్టేట్స్ UK అంతటా 14.1 బిలియన్ పౌండ్ల రియల్ ఎస్టేట్‌ వ్యాపారాన్ని నిర్వహిస్తాయి. 

2018-19లో ఎస్టేట్ ఆదాయం 343.5 మిలియన్ పౌండ్లుగా ఉంది. అయితే గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి పర్యాటకంపై ప్రభావం చూపడంతో క్రౌన్ ఎస్టేట్ నుండి వచ్చే ఆదాయం తగ్గింది. 

క్వీన్ ఎలిజిబెత్ కు లాంకాస్టర్‌లోని తన ప్రైవేట్ ఆస్తి నుండి కూడా డబ్బు వస్తుంది. ఇది 18,000 హెక్టార్లలో విస్తరించి ఉంది. 2020లో దీని విలువ సుమారు 23 మిలియన్ పౌండ్లు. డచీ ఆఫ్ కార్న్‌వాల్ కూడా వీరి ఆధీనంలోనే ఉంది, ప్రిన్స్ ఆఫ్ వేల్స్  ప్రైవేట్ , పబ్లిక్ కార్యకలాపాలకు ఇవి నిధులు సమకూరుస్తాయి. అవి కాకుండా బ్రిటిష్ రాజకుటుంబాలకు 23 ఇంగ్లీష్ కౌంటీలలో భూములు ఉన్నాయి. ఇది ప్రిన్స్ చార్లెస్, కెమిల్లా పార్కర్ బౌల్స్, ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్‌లకు ప్రధాన ఆదాయ వనరు ఇవే. 

అలాగే క్వీన్ మరో అతిపెద్ద ఆదాయ వనరు ది రాయల్ కలెక్షన్ ట్రస్ట్ నుండి వస్తుంది. దీని నిర్వహణ కింద అనేక మ్యూజియాలు, అలాగే ఎమ్యూజ్ మెంట్ పార్కులు ఉన్నాయి. బకింగ్ హం పాలస్. ఇదిలా ఉటే  క్వీన్ 1992 నుండి ఆమె వ్యక్తిగత ఆదాయంపై స్వచ్ఛందంగా ఆదాయపు పన్ను, మూలధన లాభాల పన్ను చెల్లిస్తున్నారు. అలాగే బాల్మోరల్, సాండ్రింగ్‌హామ్‌లో సైతం క్వీన్ ఆస్తులు కలిగి ఉన్నారు.  అంతేకాదు కోహినూర్ వజ్రం సహా అనేక విస్తృతమైన కళా సేకరణ బ్రిటన్ రాజకుటుంబం సొంతం.

Follow Us:
Download App:
  • android
  • ios