Asianet News TeluguAsianet News Telugu

అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుంది.. కానీ 2021 నాటికి..

కరోనాతో కుదేలైన అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ ‘ఫెడ్ రిజర్వు’ ఆశాభావం వ్యక్తం చేసింది. వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి స్థాయిలో దేశీయ ఆర్థిక వ్యవస్థ కోలుకోవచ్చని తెలిపింది. సంక్షోభం తీవ్రతను తగ్గించే ప్రణాళికలు ప్రభుత్వం వద్ద ఉండటం మంచి విషయమని, నిరుద్యోగం తగ్గి.. ప్రజలు పనుల్లోకి వెళతారని విశ్లేషించింది.

federal reserve says america recovery may stretch through end of 2021
Author
Hyderabad, First Published May 19, 2020, 12:30 PM IST

కరోనా మహమ్మారి కారణంగా సంక్షోభంలో కూరుకుపోయిన అమెరికా ఆర్థిక వ్యవస్థ త్వరలోనే పుంజుకుంటుందని అమెరికా కేంద్రీయ బ్యాంకు 'ఫెడరల్​ రిజర్వ్'​ ఛైర్మన్​ జెరోమ్​ పావెల్​ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే.. అది వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి స్థాయిలో కోలుకోవచ్చన్నారు. 

వైరస్​ వ్యాప్తిని అడ్డుకునేందుకు వ్యక్తిగతంగా కానీ, బృందంగా కానీ ప్రజతు తగిన జాగ్రత్తలు పాటించాలని అమెరికా కేంద్రీయ 'ఫెడరల్​ రిజర్వ్'​ ఛైర్మన్​ జెరోమ్​ పావెల్​ సూచించారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని, ప్రజలు పనుల్లోకి తిరిగి వెళతారని తెలిపారు. దేశంలో నిరుద్యోగం తగ్గడంతో ప్రయోజనం పొందుతామని, కానీ అది జరగడానికి కాస్త సమయం పడుతుందన్నారు. 

‘దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం వచ్చే ఏడాది చివరి వరకు సాధ్యం అవుతుందనుకుంటున్నా. అనుకున్న సమయం కంటే ముందే జరుగుతుందనే నమ్మకం ఉంది’ అని జెరోమ్ పావెల్ పేర్కొన్నారు.

also read  స్టాక్ మార్కెట్లకు ‘వ్యాక్సిన్ జోష్’ .. అవసరమైతే మరో ప్యాకేజీకి ఇచ్చేందుకు ఫెడ్ రెడీ

‘మనం చేయగలిగిన దాంట్లో ప్రధానమైంది వైరస్​ వ్యాప్తిని కట్టడి చేయడమే. పనుల్లోకి వెళ్లిన సమయంలో జగ్రత్తలు పాటించాలి. ప్రజలు ఎక్కువ కాలం పనిలో లేనట్లయితే.. వారి నైపుణ్యాలు, శ్రామిక శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది’ అపి ఫెడరల్​ రిజర్వ్​ ఛైర్మన్​ జెరోమ్​ పావెల్ వెల్లడించారు.

‘దీర్ఘకాలిక సంక్షోభంతో ప్రజల భవిష్యత్తుకు తీరని నష్టం వాటిల్లుతుంది. అయితే.. సంక్షోభ ప్రభావాలను తగ్గించే విధానాలు ఉండటం మంచి విషయం​. వైరస్​ను కట్టడి చేయటం ద్వారా వచ్చే 3-6 నెలల్లో ప్రజలు, వ్యాపారాలు దివాలా నుంచి కోలుకుంటాయి’ అని ఫెడరల్​ రిజర్వ్​ ఛైర్మన్​ జెరోమ్​ పావెల్ చెప్పారు. 


దేశంలో నిరుద్యోగం ఎంత మేర ఉంటుందో చెప్పలేమని జెరోమ్ పావెల్ స్పష్టం చేశారు. ఈనెల, వచ్చే నెలలో ఎక్కువగా ఉద్యోగాల తొలగింపులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నట్లు చెప్పారు.

రెండు నెలల వ్యవధిలోనే సుమారు 20 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని జెరోమ్ పావెల్ తెలిపారు. రెండు నెలల క్రితం నిరుద్యోగం రేటు 50 ఏళ్ల కనిష్ఠ స్థాయిలో ఉన్నా 60 రోజుల్లో భారీగా పెరగటం విచారకరమన్నారు. ఆర్థిక వ్యవస్థ త్వరితగతిన పుంజుకుని ప్రజలు పనుల్లోకి వెళతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios