భారత మర్చంటైజ్ ఎక్స్‌పోర్ట్స్ ఏడాది ప్రాతిపదికన ఫిబ్రవరి 2022లో 22.36 శాతం పెరిగి 33.81 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 27.63 బిలియన్ డాలర్లు.

భారత మర్చంటైజ్ ఎక్స్‌పోర్ట్స్ ఏడాది ప్రాతిపదికన ఫిబ్రవరి 2022లో 22.36 శాతం పెరిగి 33.81 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 27.63 బిలియన్ డాలర్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 2021 నుండి ఫిబ్రవరి 2022 వరకు మర్చంటైజ్ ఎగుమతులు 45.80 శాతం పెరిగి 374.05 బిలియన్ డాలర్లుగా నమోదు అయింది. గత ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 2020 ఏప్రిల్ నుండి 2021 ఫిబ్రవరి మధ్య కాలంలో 256.55 బిలియన్ డాలర్లుగా నమోదైంది. భారత పెట్రోలియం, క్రూడాయిల్‌ దిగుమతుల విలువ ఫిబ్రవరిలో భారీగా 67 శాతం పెరిగింది. విలువలో 15 బిలియన్‌ డాలర్లకు చేరింది. రాబోయే కాలంలో భారత్‌లో ధరల పెరుగుదలకు సంకేతంగా దీనిని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

అదే సమయంలో దిగుమతులు 59.21 శాతం పెరిగి 550.12 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీంతో వాణిజ్య లోటు 176.07 బిలియన్ డాలర్లుకు పెరిగింది. 2020.21 ఏప్రిల్-ఫిబ్రవరిలో వాణిజ్య లోటు 88.99 బిలియన్ డాలర్లుగా నమోదయింది. ఇంజినీరింగ్, పెట్రోలియం, కెమికల్ రంగాలు ఆశాజనక పనితీరు కనబరచడం కలిసి వచ్చింది. అలాగే ఇదే నెలలో భారత్ 55 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నది. దీంతో వాణిజ్య లోటు 21.19 బిలియన్ డాలర్లకు చేరుకుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫిబ్రవరి 2021లో నమోదయిన 13.12 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటుతో పోలిస్తే పెరిగింది.

ఇక భారత్‌ ఎగుమతుల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల కాలంలో (2021 ఏప్రిల్‌ నుంచి 2022 ఫిబ్రవరి వరకూ) 374.05 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది 45.80 శాతం అధికం. ఇక దిగుమతుల విలువ ఇదే కాలంలో 59.21 శాతం పెరిగి 550.12 బిలియన్‌ డాలర్లుగా ఉంది. వెరిసి వాణిజ్యలోటు 176.07 బిలియన్‌ డాలర్లుగా ఉంది. తాజా గణాంకాల ప్రకారం.. భారత్‌ 2021–22 ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్‌ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎగుమతుల్లో ఇంజనీరింగ్‌ (31.34 శాతం పెరిగి 9.27 బిలియన్‌ డాలర్లు), పెట్రోలియం (66.29 శాతం పెరిగి 4.1 బిలియన్‌ డాలర్లు), రసాయన రంగాలు (25 శాతం పెరిగి 2.4 బిలియన్‌ డాలర్లు) మంచి పనితీరును ప్రదర్శించాయి. కాగా, ఫార్మా ఎగుమతులు 3.13 శాతం క్షీణించి 1.9 బిలియన్‌ డాలర్లకు ప‌రిమితమయ్యాయి. ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌ దిగుమతులు 29 శాతం పెరిగి 6.24 బిలియన్‌ డాలర్లకు చేరింది.