Asianet News TeluguAsianet News Telugu

‘ఫెయిర్ & లవ్లీ’లో ‘ఫెయిర్’ ఔట్.. ఇక ‘గ్లో అండ్ లవ్లీ’ ఇన్

ముఖ సౌందర్యాన్ని పెంపొందించేందుకు హిందూస్థాన్ యునీ లివర్ (హెచ్‌యూఎల్) సంస్థకు చెందిన ఫెయిర్ అండ్ లవ్లీ బ్రాండ్ పేరు మార్చు కునేలా చేసింది అమెరికాలో బ్లాక్ లైవ్ మ్యాటర్స్. ఫెయిర్ అనే పదం నలుపును తెలుపుగా మారుస్తుందని భావించామని, అందుకే ఫెయిర్ అనే పదాన్ని మార్చేస్తున్నట్లు హెచ్‌యూఎల్ ప్రకటించింది. 

Fair & Lovely renamed as 'Glow & Lovely'  announced by Hindustan Unilever Limited today
Author
Hyderabad, First Published Jul 3, 2020, 11:03 AM IST

న్యూఢిల్లీ: అమెరికాలో జాతి వివక్ష ఓ ప్రముఖ సౌందర్య సాధన వస్తువు బ్రాండ్ పేరు మార్పు కారణమైంది. శ్వేతజాతి పోలీస్ కర్కశ వైఖరితో ఆఫ్రికా అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 

దీనికి వ్యతిరేకంగా ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ పేరిట నిరసనోద్యమం వెల్లువెత్తింది. ఈ క్రమంలో ‘హిందుస్థాన్‌ యూనిలివర్‌’ కంపెనీ నుంచి వెలువడుతున్న ‘ఫేర్‌ అండ్‌ లవ్లీ’ అనే ఉత్పత్తి బ్రాండ్‌ తన పేరు మార్చుకున్నది. 

ఫెయిర్ అండ్ లవ్లీ బ్రాండ్ ఉత్పత్తి ప్రజల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. అంతే కాదు.. ఈ బ్రాండ్‌ ప్రచారం కోసం కంపెనీ మొదటి నుంచి ఎన్నో కోట్ల రూపాయలను ఖర్చు పెడుతూ వస్తోంది. తాజాగా ‘ఫేర్‌ అండ్‌ లవ్లీ’ పేరును మారుస్తూ హిందూస్థాన్‌ యూనిలివర్‌ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. 

‘ఫేర్‌ అండ్‌ లవ్లీ’ పేరు స్థానంలో ‘గ్లో అండ్ లవ్లీ’తో ఫేర్‌నెస్‌ క్రీమ్‌ను మార్కెట్‌ చేయనున్నట్లు హిందూస్థాన్ యూనీ లివర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక ‘ఫేర్‌ అండ్‌ లవ్లీ’ బ్రాండ్‌ పేరు నుంచి ఫేర్‌ అనే పదం మాయం కానుంది. ఫేర్‌ అనే పదం మనిషి చర్మం తెలుపు రంగును సూచిస్తున్న విషయం తెల్సిందే.

హిందుస్థాన్‌ యూనిలివర్‌ కంపెనీ తమ ఉత్పత్తుల బ్రాండ్‌ పేర్ల నుంచి, వాణిజ్య ప్రకటనల నుంచి ఫేర్, ఫేర్‌నెస్‌ పదాలతోపాటు ‘వైటెనింగ్, లైటనింగ్‌’ అనే పదాలను కూడా తొలగించాలని నిర్ణయించింది. ’ఫేర్‌ అండ్‌ లవ్లీ’ బ్రాండ్‌ పేరు నుంచి ఫేర్‌ పదాన్ని తొలగిస్తానని చెప్పిన కంపెనీ ఆ ఉత్పత్తిని విత్ డ్రా చేసుకున్నట్లు ఎక్కడా పేర్కొనలేదు.

also read  ఇండిగో ఎయిర్ లైన్స్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్.. కేవలం వారికి మాత్రమే.. ...

చర్మ రంగును తెలుపు చేస్తుందన్న ప్రచారంతో హిందూస్థాన్ యూనీ లివర్ సంస్థ ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ ఉత్పత్తిని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఆ ఉత్పత్తి అలాగే కొనసాగించాలనుకుంటే ‘చర్మ సౌందర్యం కోసం’అని మార్చుకోవచ్చు. 

అదే విధంగా ‘స్కిన్‌ వైటెనింగ్‌’ ఉత్పత్తులను ఉపసంహరించుకొంటున్నామని ప్రముఖ కాస్మోటిక్‌ కంపెనీ ‘జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌’ కూడా ప్రకటించింది. వాటి ఉత్పత్తులకు మరిన్ని మిశ్రమాలను జోడించి, మరింత మెరుగ్గా మరో పేరుతో మార్కెట్లోకి తీసుకొస్తామని ఆ కంపెనీ తెలిపింది. ఆ కంపెనీ ‘చర్మ సౌందర్యం కోసం’ అంటుందా, మరో పేరు పెడుతుందా ? చూడాలి. ఫెయిర్ అండ్ లవ్లీకి భారతదేశంలో 40 శాతం వాటా లభిస్తుంది.

ఈ రెండు కంపెనీల తరహాలోనే ‘వైటెనింగ్‌’ పేరిట లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న ఇతర కొస్మోటెక్‌ కంపెనీలు కూడా చర్మం రంగును తెలియజేసే పదాలన్నీ తామూ ఉపసంహరించుకుంటామని, వాటికి ‘స్కిన్‌ కేర్‌’ అని పేర్లు పెడతామని చెబుతున్నాయి. వాస్తవంగా ఆ ఉత్పత్తులేవీ కూడా స్కిన్‌ కేర్‌ కిందకు రావు. 

‘బ్లాక్‌ ఈజ్‌ బ్యూటీ (నలుపే అందం)’ అన్న ప్రచారం భారత్‌లో ఎప్పటి నుంచో ఉన్నా ఎన్నడూ స్పందించని ఈ కంపెనీలు ఇప్పుడు స్పందించడానికి అమెరికాలో కొనసాగుతున్న ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ అనే ఉద్యమమే కారణం. జార్జి ఫ్లాయిడ్‌ అనే నల్లజాతీయుడిని ఓ శ్వేత జాతీయుడైన అమెరికా పోలీసు అన్యాయంగా చంపేయడంతో ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ఉద్యమం ఉధృతమైంది.

పుట్టుకతో వచ్చే మనుషుల చర్మం రంగు మధ్యలో మారదని, మనిషి ఒక చోటు నుంచి మరో చోటుకు మరినప్పుడు అక్కడి ఉష్ణ, శీతల పరిస్థితుల్లో చర్మం రంగులో కొంత మార్పు వస్తుందిగానీ, మందులతో మార్పు రాదని వైద్య విజ్ఞానం మొదటి నుంచి చెబుతున్నా నలుపును తెలుపు చేస్తామంటున్న వ్యాపారం మాత్రం జోరుగా కొనసాగుతూ వచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios