Best cars Under 8Lakhs: రూ. 8 లక్షలలోపే వచ్చే బెస్ట్ కార్లు ఇవే, భారీగా అమ్మకాలు
Best cars Under 8Lakhs: కారు కొనాలనుకునాలనుకుంటున్నారా? అయితే తక్కువ బడ్జెట్, మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఉండే కార్లను కొనుక్కోవడం ఉత్తమం. ఇలాంటి లక్షణాతో రూ.8 లక్షల లోపు వచ్చే బెస్ట్ కార్లు ఇవిగో.

తక్కువ ధరకే వచ్చే బెస్ట్ కార్లు
కారు కొనుక్కోవాలన్నది ఎంతో మంది కల. తమ ఆదాయాన్ని బట్టి వారు ఏ కారు కొనాలో నిర్ణయించుకుంటారు. ఎగువ మధ్యతరగతి వారు అధికంగా పదిలక్షల రూపాయల లోపు కార్లను కొనేందుకే ఇష్టపడతారు. మరికొంతమంది ఆ పదిలక్షలు పెట్టేందుకు కూడా ఇష్టపడరు. మరికొంతమంది రూ.8 లక్షలకు మించి పెట్టేందుకు ఇష్టపడరు. తక్కువ బడ్జెట్, మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చుతో వచ్చే మంచి కార్ల గురించి ఇక్కడ మేము ఇచ్చాము. ఈ కార్లు తక్కువ ధరకే వస్తున్నా… చూసేందుకు స్టైలిష్ లుక్స్ తో ఉంటాయి.
టాప్ 5 కార్లు
కార్లలో హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి మైక్రో ఎస్‌యూవీల వరకు ఎన్నో ఉన్నాయి. వీటిలో ప్రతి నెలా ఎన్నో కార్లు వేల సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. వాటిలో ఎనిమిది లక్షల రూపాయల లోపే ఉండి అధికంగా అమ్ముడవుతున్న మోడళ్లు ఉన్నాయి. 8 లక్షల లోపు ధరలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 5 కార్ల గురించి ఇక్కడ ఇచ్చాము. ఇవి చూసేందుకు, కొనేందుకు, వాడేందుకు కూడ ఎంతో వీలైనవి.
వ్యాగనార్
మనదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే కార్లలో వ్యాగనార్ ఒకటి. ఇది మధ్యతరగతి వారి కార్ గా చెప్పుకుంటారు. ప్రాక్టికల్ డిజైన్, మంచి ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రతిరోజూ వాడే వారికి ఇది బెస్ట్ కారు అని చెప్పాలి. ఇది 1.0 లీటర్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌లలో లభిస్తుంది. మారుతి వ్యాగనార్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.54 లక్షల నుంచి రూ.7.42 లక్షల వరకు ఉంది. మన దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా ఇది చాలాసార్లు నిలిచింది. దీని మెయింటేనన్స్ కూడా చాలా తక్కువ.
మారుతి సుజుకి ఆల్టో కె10
ఎంట్రీ లెవల్ కార్ సెగ్మెంట్లలో అద్భుతమైన కారు మారుతి సుజుకి వారి ఆల్టో కె10. బిగినర్స్ కు ఈ కారు మంచి ఆప్షన్ అని చెప్పాలి. దీని కాంపాక్ట్ సైజ్, తక్కువ ధర, నమ్మకమైన పనితీరు వల్ల ఎంతో మంది దీన్ని కొనేందుకు ఇష్టపడుతున్నారు. ధర కూడా చాలా తక్కువ. మారుతి ఆల్టో కె10 ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.99 లక్షల నుంచి రూ. 5.96 లక్షల వరకు ఉంది.
బాలెనో కారు
బాలెనో కారును కొనేవారి సంఖ్య అధికంగానే ఉంది. ఇది బడ్జెట్ కారు. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కోసం మీరు వెతుకుతుంటే బాలెనో బెస్ట్ అని చెప్పవచ్చు. అందమైన డిజైన్, విశాలమైన క్యాబిన్, ఫీచర్లతో నిండిన బాలెనో ధర సుమారు రూ6.66 లక్షల నుంచి మొదలవుతుంది. టాప్ వేరియంట్ ధర సుమారు ₹8 లక్షల వరకు ఉంటుంది. అందుకే దీన్ని ఎక్కువ మంది ఫ్యామిలీలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.
గ్రాండ్ ఐ10 నియోస్
హ్యూండాయ్ వారి అందమైన కారు గ్రాండ్ ఐ10 నియోస్. దీని స్టైల్, సౌకర్యం, స్మూత్ డ్రైవింగ్ బిగినర్స్ కు ఉపయోగపడుతుంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ పెట్రోల్, సీఎన్‌జీ ఆప్షన్‌లు ఈ రెండూ కస్టమర్లలో మంచి పేరు సాధించాయి. నియోస్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.92 లక్షల నుంచి రూ. 7.59 లక్షల వరకు ఉంది.
టాటా పంచ్
టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీ విభాగంలో టాటా పంచ్ మొదటి స్థానంలో నిలిచి ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అన్ని రోడ్లపైన ఇది అనుకూలంగా ఉంటుంది. పంచ్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.13 లక్షల నుంచి రూ.7.99 లక్షల వరకు ఉంది. ఇది ఫ్యామిలీ కార్ గా పేరుతెచ్చుకుంది. భద్రత కూడా ఎక్కువే. ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఒకటిగా ఎన్నోసార్లు మొదటి స్థానంలో నిలిచింది.

