Asianet News TeluguAsianet News Telugu

Explainer: ఒకే వారంలో 3 బ్యాంకులు దివాళా, అమెరికా బ్యాంకింగ్ సంక్షోభానికి కారణాలేంటి, అగ్రరాజ్యం వణుకుతోందా..?

గత పదిహేను రోజుల్లో అమెరికాకు చెందిన మూడు బ్యాంకులు దివాళా తీసాయి. దీంతో ప్రపంచం మరోసారి మాంద్యం వైపుకు అడుగులు వేస్తోందా అనే అనుమానాలకు తావు ఇస్తోంది. అయితే అమెరికాలో తలెత్తిన బ్యాంకింగ్ సంక్షోభానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం..

Explainer 3 bank bankruptcies in a single week, leading to US banking crisis MKA
Author
First Published Mar 17, 2023, 2:51 AM IST

2008 ఆర్థిక మాంద్యం ముందు కూడా లేమన్ బ్రదర్స్ బ్యాంకు దివాళా తీయడంతో మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు సృష్టించింది. సరిగ్గా 15 ఏళ్ల తర్వాత మళ్లీ అలాంటి సంఘటనలే అమెరికాలో పునరావృతం అవుతున్నాయి. తొలుత సిలికాన్ వ్యాలీ బ్యాంకు దివాళా తీయగా, తర్వాత సిగ్నేచర్ బ్యాంకు దివాళా తీసింది. రెండు రోజుల తర్వాత సిల్వర్‌గేట్ బ్యాంకు కూడా దివాళా తీసింది. అయితే మరో అరడజను బ్యాంకులు కూడా పతనం అంచుల్లో ఉన్నాయని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే ఆర్థిక మాంద్యం దెబ్బ మామూలుగా తగలదని నిపుణులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నారు. 

మరోవైపు అమెరికా ప్రభుత్వం బ్యాంకింగ్ వ్యవస్థను కాపాడేందుకు ముందుకు వచ్చినప్పటికీ వారి భవిష్యత్తుపై ఇంకా అనిశ్చితి నెలకొంది. ఇప్పటికే సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను లాక్ చేయాలని రెగ్యులేటర్లు నిర్ణయించారు. గత ఆదివారం US ట్రెజరీ డిపార్ట్‌మెంట్, ఫెడరల్ రిజర్వ్, ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సమస్యాత్మక బ్యాంకుల్లో డిపాజిట్‌లకు హామీ ఇస్తున్నామని ప్రకటించింది. అయితే ఇక్కడ ఓ కిటుకు ఉంది..డిపాజిటిర్ల సొమ్ము పన్ను చెల్లింపుదారుల డబ్బుతో చెల్లించలేము అని తెలిపింది. అంటే ప్రభుత్వం పాక్షికంగానే డిపాజిటర్ల సొమ్ముకు భద్రత కల్పిస్తామని చెప్పకనే చెప్పింది. 

అమెరికాలో 2001 నుండి 563 బ్యాంకులు దివాళా తీశాయి..

FDIC ప్రకారం, 2001 నుండి 563 బ్యాంకు వైఫల్యాలను ఎదుర్కొన్నాయి. అక్టోబర్ 2020లో కాన్సాస్‌కు చెందిన అలమెనా స్టేట్ బ్యాంక్ పతనం తర్వాత, SVB, సిగ్నేచర్ బ్యాంక్ కూడా ఈ జాబితాలో చేరాయి. SVB, సిగ్నేచర్ బ్యాంక్ పతనం అమెరికా బ్యాంకింగ్ చరిత్రలో రెండవ అతిపెద్ద బ్యాంక్ పతనం కావడంతో అందరి దృష్టి పడింది. 2008 మాంద్యం సమయంలో కూడా ఇలాగే బ్యాంకులు దివాళా తీశాయి. 

SVB, సిగ్నేచర్ బ్యాంకులు ఎలా కుప్పకూలాయి..

US బ్యాంకింగ్ వ్యవస్థ బలమైన పునాదిని కలిగి ఉందని, అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ఎప్పటికప్పుడు పేర్కొంటుంది. కానీ దాని పునాదులు బలహీనంగా ఉన్నాయని చరిత్ర చెబుతోంది. 2008 ఆర్థిక మాంద్యం తర్వాత, భవిష్యత్తులో అలాంటి పరిస్థితిని నివారించడానికి తీసుకున్న చర్యలు బ్యాంకింగ్ రంగానికి కొంత ఉపయోగ పడ్డాయి. అయితే, కొన్ని నిర్ణయాలు నష్టాలను కలిగించాయి. 2018లో, డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో, డాడ్-ఫ్రాంక్ చట్టం (Dodd-Frank Act) నుండి 250 బిలియన్ డాలర్ల  కంటే తక్కువ ఆస్తులున్న ప్రాంతీయ బ్యాంకులను అమెరికన్ సెనేట్ కాంగ్రెస్ మినహాయించింది. 

FDIC ప్రకారం SVB పతనం సమయంలో 209 బిలియన్ డాలర్ల ఆస్తులను కలిగి ఉంది. సెనేట్ బ్యాంకింగ్ కమిటీ అధ్యక్షుడైన ఎలిజబెత్ వారెన్ డి-మాస్ ప్రకారం, SVB పతనానికి ఒక కారణం డాడ్-ఫ్రాంక్ చట్టాన్ని (Dodd-Frank Act) పరిమితిని పెంచడం అని విమర్శించారు. ఈ నిర్ణయం వల్ల బ్యాంకులపై ప్రభుత్వ పర్యవేక్షణ తగ్గిందని ఆయన అన్నారు. ఇది చివరకు బ్యాంకు పతనానికి దారితీసింది. 

సిలికాన్ వ్యాలీ బ్యాంకు యాజమాన్యం చేసిన మిస్టేక్ ఇదే..

అమెరికాలోని మూడు పెద్ద బ్యాంకులు ఎలా ఇబ్బందుల్లో పడ్డాయి? దీనికి అత్యంత ఖచ్చితమైన సమాధానం 'బ్యాంక్ రన్'. అంటే డిపాజిటర్లు బ్యాంకు దివాలా తీస్తుందని ఆలోచించకుండా డబ్బు విత్‌డ్రా చేయడం ప్రారంభించినప్పుడు బ్యాంకుకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఎస్వీబీ బ్యాంక్‌లో లాకౌట్‌కు ఇదే కారణం. గత బుధవారం బ్యాంకు CEO గ్రెగ్ బ్యాక్ US ట్రెజరీ బాండ్ ద్వారా వచ్చే 1.8 బిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోయామని  బ్యాంక్ తన వాటాదారులకు లిఖిత పూర్వకంగా తెలిపింది. బ్యాంక్ తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మార్కెట్ నుంచి 2.25 బిలియన్లను సమీకరించాలని ఆలోచిస్తున్నట్లు బేకర్ సూచించాడు.

డిపాజిటర్లు ఏకంగా రూ.3.48 లక్షల కోట్లు వెనక్కి తీసుకున్నారు

SVB బ్యాంక్ చేసిన ఈ ప్రకటన దాని కస్టమర్లలో భయాందోళన వాతావరణాన్ని సృష్టించింది. గురువారం (మార్చి 9) కస్టమర్లు ఏకకాలంలో బ్యాంక్ నుండి 42 బిలియన్ డాలర్లు (రూ. 3.48 లక్షల కోట్లు) ఉపసంహరించుకున్నారు. శుక్రవారం ఉదయం నాటికి, SVB బ్యాంకు బ్యాలెన్స్ మైనస్ 958 మిలియన్ డాలర్లు  అంటే మైనస్ రూ. 7929 కోట్లతో దివాళా తీసింది. ఈ ఘోరం జరిగిన కాసేపటికే FDIC బ్యాంకుని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది, దాని స్థానంలో కొత్త డిపాజిట్ ఇన్సూరెన్స్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ శాంటా క్లారాతో భర్తీ చేయగా. డిపాజిటర్ల బీమా మొత్తం దీని ద్వారా చెల్లిస్తామని ప్రకటించింది. 

సిగ్నేచర్ బ్యాంక్‌ చేసిన తప్పు ఏంటి ?

సిగ్నేచర్ బ్యాంకు రియల్ ఎస్టేట్, న్యాయ సంస్థలకు చాలా కాలంగా తన సేవలను అందిస్తోంది. ఇటీవలి కాలంలో, బ్యాంకు యాజమాన్యం క్రిప్టో ట్రేడింగ్‌లో చేతులు పెట్టింది. అయితే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దివాళా వార్తలు వ్యాప్తి చెందడంతో, సిగ్నేచర్ బ్యాంకు కస్టమర్లు తమ డిపాజిట్లు సురక్షితంగా ఉన్నాయా యాజమాన్యాన్ని అడిగారు.అందుకు యాజమాన్యం ఇచ్చిన వివరణ సంతృప్తి ఇవ్వలేదు. వెంటనే సిలికాన్ వ్యాలీ కస్టమర్ల మాదిరిగానే చాలా మంది సిగ్నేచర్ బ్యాంక్ కస్టమర్లు తమ డిపాజిట్లు ప్రమాదంలో పడవచ్చని ఆందోళన చెంది డబ్బు విత్ డ్రా చేయడం ప్రారంభించారు. నిజానికి. FDIC బీమా కింద 250,000 డాలర్ల మొత్తానికి మాత్రమే హామీ లభిస్తుంది. అంతకంటే ఎక్కువ మొత్తం డబ్బు దాచుకున్న కస్టమర్లంతా డబ్బులు విత్ డ్రా చేయడంతో  బ్యాంక్ రన్ వంటి పరిస్థితి ఏర్పడింది. దెబ్బకు బ్యాంకు దివాళా తీయగానే FDIC బ్యాంకును స్వాధీనం చేసుకుంది.

ప్రజల్లో పెరుగుతున్న భయమే బ్యాంకులను ముంచుతోందా..?.

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం వార్తలు అమెరికాలోని బ్యాంక్ డిపాజిటర్ల భయాందోళనలను రెట్టింపు చేశాయి.అందుకు తగ్గట్లే రెగ్యులేటర్లు 3 బ్యాంకులను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. సిగ్నేచర్ బ్యాంక్ పతనం భవిష్యత్తులో అమెరికాలో మరిన్ని చిన్న, మధ్య తరహా బ్యాంకులు సైతం త్వరలోనే  ఎదుర్కొబోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికాలో టాప్ బ్యాంకులు అయిన JP మోర్గాన్ చేజ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి పెద్ద బ్యాంకులు సైతం  డిపాజిటర్లలో ఆందోళన మొదలై బ్యాంకు రన్ పరిస్థితి వస్తే మాత్రం వాటి ఆర్థిక మూలాలు బలహీనపడటం ఖాయంగా కనిపిస్తున్నాయి. 

క్రిప్టో మార్కెట్ పతనం సిల్వర్‌గేట్ బ్యాంక్ కొంప ముంచిందా..?

నిజానికి క్రిప్టో ట్రేడింగ్ లో పెట్టుబడుల కారణంగా 2021లో సిగ్నేచర్ బ్యాంక్ డిపాజిట్లు 67% పెరిగాయి. కానీ గత సంవత్సరం, క్రిప్టో ఎక్స్ఛేంజ్ FTX క్రాష్, దివాలా ప్రకటించినప్పుడు, సిగ్నేచర్ బ్యాంక్ భారీ నష్టాలను చవిచూసింది. ఒక సంవత్సరంలో కంపెనీ డిపాజిట్లు 17 బిలియన్ డాలర్లు (రూ. 1.40 లక్షల కోట్లు), అంటే దాదాపు 17 శాతం తగ్గాయి.  క్రిప్టో-ఫ్రెండ్లీ అమెరికన్ బ్యాంక్ గా పేరున్న సిల్వర్‌గేట్ క్యాపిటల్ కార్ప్ కూడా క్రిప్టో మార్కెట్ దెబ్బతినడంతో భారీ నష్టాలను ఎదుర్కొంది. సిల్వర్‌గేట్ నాల్గవ త్రైమాసికంలో దాదాపు 1 బిలియన్ డాలర్ల నష్టాన్ని చూసింది.

Follow Us:
Download App:
  • android
  • ios