న్యూఢిల్లీ: దిగ్గజ ఐటీ కంపెనీ విప్రో తమపై జాతి వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూ ఐదుగురు మాజీ ఉద్యోగులు ఇండియన్ ఐటి సర్వీసెస్ మేజర్‌ విప్రో పై క్లాస్-యాక్షన్ దావా వేశారు. విప్రో తాజాగా వారు వేసిన క్లాస్ యాక్షన్ దావాను ఎదుర్కొంటుంది. అమెరికాలోని న్యూజెర్సీ జిల్లా కోర్టులో గత నెలలో దాఖలు చేశారు.

దావా ప్రకారం  విప్రో సంస్థలో పనిచేసిన గ్రెగొరీ మాక్లీన్, రిక్ వాలెస్, అర్దేశీర్ పెజెష్కి, జేమ్స్ గిబ్స్, రోనాల్డ్ హేమెన్‌వే అనే  ఐదుగురు మాజీ ఉద్యోగులు దక్షిణాసియా, భారతీయులు కాదని తమపై  "వివక్ష" చూపిస్తున్నారు అంటూ ఆరోపించారు.

వీరిలో నలుగురు ఉద్యోగులు అమెరికన్ సంతతికి చెందినవారు కాగా, మరొకరు ఇరానియన్ జాతీయ సంతతికి చెందినవారు ప్రస్తుతం కాలిఫోర్నియాలో నివసిస్తున్నారు.

 దక్షిణ ఆసియన్లు, భారతీయులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని, విప్రో అనుసరిస్తున్న ఈ వివక్ష కారణంగా తాము ఉద్యోగాలు కోల్పోయామని వాదించారు. అమెరికాలో ఉన్న దక్షిణ ఆసియన్లు, భారతీయులు కానివారికి అప్రైజల్ స్కోర్క్ ఇవ్వడంలేదని, అలాగే వివిధ ప్రాజెక్టులకు కేటాయించిన వీరిలో అధిక సంఖ్యలో ఉద్వాసనకు గురవుతున్నారని ఆరోపించారు.

also read  కరెంట్ పోయిందా... అయితే ఈ నెంబ‌ర్ కు ఫోన్ చెయ్యండి..

దక్షిణ ఆసియన్లు, భారతీయులం కాదనే నెపంతో సంస్థ తమపై 'జాతి వివక్ష' చూపిస్తోందని అమెరికాలోని ఐదుగురు మాజీ ఉద్యోగులు ఆరోపించారు. ఉద్యోగులపై పదోన్నతులు,  జీతం పెంపు, తొలగింపు నిర్ణయాలకు సంబంధించి  తేడాలు చూపిస్తోందన్నారు.

దీని ఫలితంగా తాము ఉద్యోగాల్ని కోల్పోయామని పేర్కొన్నారు. నియామకం, పదోన్నతి ఇతర  నిర్ణయాల్లో వివక్షత లేని పద్ధతిని అవలంబించాలనే ఆదేశాలతో పాటు, ఫెడరల్ రూల్స్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ ప్రకారం , చట్టవిరుద్ధమైన విధానాలలో పాల్గొనకుండా శాశ్వత నిషేధానికి అనుగుణంగా దావాను 'క్లాస్ యాక్షన్' గా వర్గీకరించాలని కోర్టును కోరారు.

మరోవైపు వారు వేసిన దావా పై స్పందించేందుకు విప్రో  తిరస్కరించింది.  కాగా గత సంవత్సరం డిసెంబరులో ఆఫ్రికాకు చెందిన అమెరికా ఉద్యోగి ఇలాంటి దావావేయడంతో, పరిహారం ఇప్పించాల్సిందిగా కోర్టును ఆశ్రయించిన  సంగతి  తెలిసిందే.