Asianet News TeluguAsianet News Telugu

కరెంట్ పోయిందా... అయితే ఈ నెంబ‌ర్ కు ఫోన్ చెయ్యండి..

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ గుప్పెట్లో ఉంది. ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇలాంటి  సమయంలో విద్యుత్ కోతలపై అధికారులు దృష్టి పెట్టారు. కొన్ని చోట్ల ప‌దే, ప‌దే ప‌వ‌ర్ క‌ట్ అవుతుంద‌ని కంప్లైంట్స్ రావ‌డంతో సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ప్ర‌ణాళిక‌లు రూపొందించారు.

electricity department of andhrapradesh starts special call center for power cut complaints
Author
Hyderabad, First Published Apr 27, 2020, 1:48 PM IST

వేసవి కాలం వచ్చేసింది. వేసవి కాలంలో సాధారణగా అందరికీ ఎదురయ్యే ఇబ్బంది క‌రెంట్ కోత‌లు. విద్యుత్ వినియోగించే ఇంట్లో ఉండే వారి నుంచి దుకాణాల వరకు విద్యుత్ అవసరం అవసరం ఉంటుంది. అయితే వేసవి కాలంలో విద్యుత్ కోతలు మరింతగా ఉండటం వల్ల ప్రజలు ఆవస్థలు పడుతుంటారు.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ గుప్పెట్లో ఉంది. ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇలాంటి  సమయంలో విద్యుత్ కోతలపై అధికారులు దృష్టి పెట్టారు. కొన్ని చోట్ల ప‌దే, ప‌దే ప‌వ‌ర్ క‌ట్ అవుతుంద‌ని కంప్లైంట్స్ రావ‌డంతో సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ప్ర‌ణాళిక‌లు రూపొందించారు.

విద్యుత్‌ అంతరాయాలపై ఫిర్యాదు వ‌చ్చిన వెంటనే సిబ్బంది వెళ్లి ఆ సమస్యలను పరిష్కరించేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో విద్యుత్‌ శాఖకు సంబంధించి అందుతున్న కంప్లైంట్స్ పై రివ్యూ చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నామని ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

also read  ఇంటి రుణంపై ప్రత్యేక లోన్స్ : తక్కువ వడ్డీకే బ్యాంకుల ఆఫర్...

విద్యుత్‌ అంతరాయాలు లేకుండా చూసేందుకు ప్రతి జిల్లాలో స్పెష‌ల్ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. విద్యుత్ విషయంలో ఎక్కడైనా సమస్యలు ఎదురైతే ప్ర‌జ‌లు 1912 నంబర్‌కు కాల్‌ చేయొచ్చు.

స్థానికంగా కేటాయించిన నంబర్లను జిల్లా యంత్రాంగం ఎప్ప‌టిక‌ప్పుడు పర్య‌వేక్షిస్తుంది. ఒకవేళ సమస్య వస్తే ఎన్ని గంటల్లో సాల్వ్ చేశార‌నే విషయం కూడా నమోదవుతుంది. ప్రజలు ఫోన్, విద్యుత్‌ శాఖ వెబ్‌ సైట్‌ ద్వారా కూడా కంప్లైంట్స్ ఇవ్వ‌వ‌చ్చు.

ఇక మ‌రోవైపు కరోనా క్వారంటైన్‌ సెంటర్లు, ఆస్పత్రుల దగ్గర స్పెషల్ టీమ్‌లను అందుబాటులో ఉంచింది ఏపీ విద్యుత్ శాఖ‌. విద్యుత్ అంతరాయం కలిగితే వెంటనే స్పందించి పరిష్కరించేందుకు స్పెషల్ టీమ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios