Asianet News TeluguAsianet News Telugu

నిఫ్టీ 50లోకి అదానీ ఎంటర్ ప్రైజెస్ ప్రవేశం, ఇక అదానీ స్టాక్స్ లో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసి తీరాల్సిందే..

గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ పేరెంట్ అదానీ ఎంటర్‌ప్రైజెస్ నిఫ్టీ 50 ఇండెక్స్‌లోకి ప్రవేశిస్తోంది. కానీ ఈ కంపెనీపై విశ్లేషకులు, ఫండ్ మేనేజర్లు మాత్రం పెద్దగా సంతృప్తిగా లేరు. చాలా మంది ఇన్వెస్టర్లు ఈ కంపెనీకి దూరంగా ఉన్నారు. మార్కెట్ భాషలో చెప్పాలంటే, ఈ కంపెనీని రేటింగ్ ఏజెన్సీలు కూడా పెద్దగా  ట్రాక్ చేయడం లేదు. అంతేకాదు చాలా మ్యూచువల్ ఫండ్ సంస్థలు అదానీ  కంపెనీల్లో పెట్టుబడి పెట్టవు. ఒకరకంగా చెప్పాలంటే అదానీ కంపెనీలు అస్పృశ్యతకు గురవుతున్నాయి. 

Entry of Adani Enterprises into Nifty 50 now mutual funds have to invest in Adani stocks
Author
First Published Sep 7, 2022, 5:32 PM IST

ప్రస్తుతం నిఫ్టీ 50లోకి అదానీ ఎంటర్ ప్రైజెస్ అడుగుపెడ్తున్న నేపథ్యంలో ఇవన్ని లెక్కలు మారతాయా అన్నదే అసలు ప్రశ్న. భారతదేశంలోనే నెంబర్ వన్ సంపన్నుడు, ప్రపంచంలోని మూడవ అత్యంత సంపన్నుడు అయిన గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ ఎంటర్‌ప్రైజెస్ సెప్టెంబర్ 30 నుండి బెంచ్‌మార్క్ సూచీ నిఫ్టీ 50 ఇండెక్స్‌లో చేరుతుందని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) గురువారం ప్రకటించింది. 

శ్రీ సిమెంట్ ( 0.36% విలువ) స్థానంలో అదానీ ఎంటర్ ప్రైజెస్ నిఫ్టీ 50 ఇండెక్స్‌లోకి ప్రవేశిస్తుంది.అయితే దాని పరిమాణం కారణంగా, అదానీ ఎంటర్‌ప్రైజెస్ అధిక వెయిటేజీని కలిగి ఉంది. శ్రీ సిమెంట్ బకాయిలు 27,364 కోట్లు ఉండగా, మార్కెట్ విలువ ప్రకారం అదానీ ఎంటర్‌ప్రైజెస్ విలువ రూ.88,461 కోట్లు. ప్రస్తుతం టాటా స్టీల్ విలువ రూ.87,000 కోట్లుగా ఉంది, అంటే అదానీ ఎంటర్‌ప్రైజెస్ మార్కెట్ విలువకు చాలా దగ్గరగా ఉంది. 

ఇండెక్స్ లాభాలు
అదానీ ఎంటర్‌ప్రైజెస్ నిఫ్టీ 50లోకి అడుగుపెట్టింది. అందువల్ల ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్‌లు, ఇటిఎఫ్‌లు డిఫాల్ట్‌గా అదానీ స్టాక్‌లను కొనుగోలు చేయక తప్పని పరిస్థితి ఉంది. చాలా ఫండ్ హౌస్‌లు నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్‌లను మెయిన్ టెయిన్ చేస్తాయి. కాబట్టి అదానీ స్టాక్ ధర పెరగడానికి సహాయపడుతుంది. కానీ ఇండెక్స్ లో దీని వెయిటేజీ తక్కువగా ఉంది" అని ఒక ప్రైవేట్ ఫండ్ హౌస్ CEO అన్నారు.

తాజా AMFI డేటా ప్రకారం, జూలై చివరి నాటికి ఇండెక్స్ ఫండ్ల నికర AUM రూ.94,590 కోట్లుగా ఉంది. మేము ఇంతవరకూ అదానీకి చెందిన ఎలాంటి షేర్లలో పెట్టుబడి పెట్టలేదని, అయితే అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఇండెక్స్‌లోకి ప్రవేశించినందున ఇండెక్స్ ఫండ్‌లు డిఫాల్ట్‌గా అదానీ షేర్లను పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అని ఓ పెద్ద ఫండ్ హౌస్‌లోని చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ చెప్పారు. 

నిఫ్టీ 50 లేదా అన్ని సూచీలు 'మొమెంటం ఇండెక్స్ లు' అని గమనించాలి. మార్కెట్ క్యాప్ పెరిగే కొద్ది ఇవి ఇండెక్స్‌కి జోడించబడతాయి. మార్కెట్ క్యాప్ తగ్గే కొద్దీ సూచీల నుంచి మాయం అవుతుంటాయి. 

అదానీ కథ ఇదే..
అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ ధర 2022 ఇప్పటివరకు 88% పెరిగింది. మార్కెట్ క్యాప్ భారీగా ఉంది. అందువల్ల స్టాక్ ఇండెక్స్‌లో చేరడం సులభం అయ్యింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ, మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం భారతదేశంలో 17వ అతిపెద్ద లిస్టెడ్ కంపెనీ. ఇది ఏషియన్ పెయింట్స్, అవెన్యూ సూపర్‌మార్ట్‌లు, బజాజ్ ఫిన్‌సర్వ్, మారుతి సుజుకి కంటే పెద్దది. అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్ తర్వాత నిఫ్టీలో చేరిన రెండవ అదానీ స్టాక్ ఇది. 

గ్లోబల్ క్రెడిట్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ క్రెడిట్‌సైట్ ప్రకారం, "అదానీ గ్రూప్ మోడరేట్ గవర్నెన్స్, ESG రిస్క్‌లకు కూడా గురవుతుంది. దేశీయ, అంతర్జాతీయ బ్యాంకులతో మంచి బ్యాంకింగ్ సంబంధాలు కంపెనీకి ప్లస్ పాయింట్. అందువల్ల, బ్యాంకులు పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios