Asianet News TeluguAsianet News Telugu

ట్విట్టర్ ఉద్యోగులను ఇష్టం వచ్చినట్లు ఏరి పారేస్తున్న మస్క్, భావోద్వేగానికి గురవుతున్న ఎంప్లాయిస్..

ట్విట్టర్ నుంచి సగం మంది సిబ్బందిని తొలగించడంపై,  సంస్థ ఉద్యోగులు మండిపడుతున్నారు.  అంతేకాదు వన్ టీం పేరిట ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ చేస్తున్నారు. ట్విట్టర్ ఖర్చు తగ్గించుకునేందుకే, ఈ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది, అని  మస్క్ కఠినంగానే వ్యవహరించడం ఐటీ రంగంలో కలకలంగా మారుతోంది.

 

Employees took to Twitter to send an emotional farewell using the One Team hashtag
Author
First Published Nov 6, 2022, 11:18 PM IST

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఉద్యోగుల నిరసనల మధ్య 50 శాతం మంది ఉద్యోగులను లేదా 7,500 మందిని తొలగించింది. దీనిపై ట్విట్టర్ కొత్త యజమాని ఎలాన్ మస్క్ ట్వీట్ చేస్తూ, 'సంస్థ రోజుకు 40 లక్షల డాలర్లు నష్టపోతోంది. కాబట్టి ఉద్యోగుల తొలగింపు తప్ప మరో మార్గం లేదు.' కేవలం వారం రోజుల క్రితం, కంపెనీని లాభదాయకంగా మార్చే ప్రయత్నంలో 50% మంది ఉద్యోగులను తొలగించాలని మస్క్ తన ప్రణాళికను ప్రకటించారు. తొలగించబడిన ఉద్యోగులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, 'ఇది ఉద్యోగుల పట్ల అమానవీయంగా ప్రవర్తించే విధంగా ఉందని మండిపడ్డారు. మస్క్ అన్ని వైపుల నుండి లాభం పొందాలని ప్లాన్ చేస్తున్నాడని వారంతా మండిపడుతున్నారు. 

కొందరు ఉద్యోగులకు ఇంట్లోనే ఉండమని ఇ-మెయిల్ పంపడం, మరికొంతమందికి 24 గంటల ముందు పనికి లాగిన్ అయ్యే అవకాశాన్ని నిరాకరించారు. ఇటీవల, టెస్లా కార్ కంపెనీ యజమాని మస్క్ ట్వీటర్‌ను 44 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశాడు. ఈ సొమ్మును రికవరీ చేయడంలో భాగంగానే మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ట్విట్టర్‌లో మిగిలిన వర్క్‌ఫోర్స్‌ను పర్యవేక్షించడానికి టెస్లా ఉద్యోగులను తీసుకువస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.  ఎలాన్ మస్క్ నిర్ణయంతో వెంటనే ఉద్యోగాలు కోల్పోయిన చాలా మంది తమ ఆవేదనను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. వన్‌టీమ్ హ్యాష్‌ట్యాగ్ ద్వారా తమ బాధలను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అందులోని ట్వీట్లను ఇక్కడ చూడండి.

Follow Us:
Download App:
  • android
  • ios