Asianet News TeluguAsianet News Telugu

Elon Musk: మాంచెస్టర్ యునైటెడ్ టీం కొనుగోలు చేస్తున్నట్లు ఎలాన్ మస్క్ ట్వీట్..

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తాజాగా స్పోర్ట్స్ క్లబ్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. సంచలన ట్వీట్ ద్వారాఅత్యంత ఖరీదైన మాంచెస్టర్ యునైటెడ్ టీమ్ ను కొనుగోలు చేస్తున్నట్లు రాసుకొచ్చారు. 

Elon Musk tweets that he is buying Manchester United team
Author
Hyderabad, First Published Aug 17, 2022, 10:33 AM IST

నిత్యం సంచలనాలతో వార్తల్లో నిలిచే టెస్లా అధినేత ఎలాన్ మస్క్, తాజాగా మరోసారి సంచనానికి తెరలేపాడు. ఇప్పటికే ట్విట్టర్ డీల్ ను మధ్యలోనే వదిలేసిన ఈ ప్రపంచ కుబేరుడు ఇప్పుడు అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ క్లబ్ అయిన ఇంగ్లీష్ ఫుట్‌బాల్ క్లబ్‌ మాంచెస్టర్ యునైటెడ్ ను కొనుగోలు చేస్తున్నట్లు ట్వీట్ చేశాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ డీల్ పై చర్చ మొదలైంది. చాలా మంది నెటిజన్లు మస్క్ చేసిన ట్వీట్ నమ్మదగిందిగా లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే ఎలాన్ మస్క్ మంగళవారం ట్విట్టర్ వేదికగా తాను త్వరలోనే ఇంగ్లండ్ ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ట్వీట్‌ చేశాడు. అయితే ఈ క్లబ్ నుంచే ప్రముఖ పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో ​​రొనాల్డో సైతం ఆడటం విశేషం. అయితే ఈ క్లబ్ కొనుగోలుపై పూర్తి వివరాలను మాత్రం మస్క్ పంచుకోలేదు. అయితే మస్క్ ప్రకటనను చాలా మంది లైట్ తీసుకుంటున్నారు.

ఎందుకంటే గతంలో కూడా మస్క్ ఇలాగే ట్వీట్ లు చేశారు. సరిగ్గా రెండేళ్ల క్రితం మస్క్ తమ టెస్లా కంపెనీ బ్యాంక్ రప్ట్ అయిపోయిందని, దివాళా తీశామంటూ ట్వీట్ చేశాడు. దీంతో కంపెనీ షేర్లు ఒక్క సారిగా పతనం అయ్యాయి. ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ చేయడంలో మస్క్ పెట్టింది పేరు. అలాగే క్రిప్టో కరెన్సీ విషయంలో కూడా మస్క్ ఇలాగే వివాదాస్పద ట్వీట్లు చేయడం, గమనించవచ్చు.

అయితే మాంచెస్టర్ యునైటెడ్ టీం కొనుగోలు ఆ టీం యాజమాన్యం కూడా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అంతేకాదు ఎలాన్ మస్క్ సైతం తన ట్వీట్ లో క్లబ్ కొనుగోలుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇవ్వలేదు. ఇదిలా ఉంటే మస్క్ ముందుగా 'నేను రిపబ్లికన్ పార్టీకి, డెమోక్రటిక్ పార్టీకి సమానంగా మద్దతిస్తానని స్పష్టం చేస్తున్నాను' అని ట్వీట్ చేశారు. ఆ తర్వాత, ట్వీట్‌లో మస్క్ - ' నేను మాంచెస్టర్ యునైటెడ్‌ని కొనుగోలు చేయబోతున్నాను. అని సింగిల్ లైన్ రాశాడు' అయితే మస్క్ చేసిన ఈ ట్వీట్ తర్వాత సోషల్ మీడియాలో చాలా రకాల రియాక్షన్స్ రావడం మొదలయ్యాయి.

 

 

ఫుట్‌బాల్ క్లబ్ ప్రస్తుత యజమాని ఎలాంటి ప్రకటన చేయలేదు నిజానికి, ఇంగ్లీష్ ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ ప్రస్తుతం అమెరికన్ గ్లేజర్ కుటుంబం నియంత్రణలో ఉంది. మస్క్ చేసిన ఈ ట్వీట్ తర్వాత, గ్లేజర్ కుటుంబం నుండి ఇప్పటివరకు ఎలాంటి స్పందన తెరపైకి రాలేదు. అదే సమయంలో, ఈ ఒక్క ట్వీట్ తర్వాత, మస్క్ దాని గురించి ఎటువంటి ప్రకటన లేదా ట్వీట్ చేయలేదు.

ఎలన్ మస్క్ వివాదాస్పద ట్వీట్లకు పెట్టింది పేరు. ఈ సారి కూడా అలాంటి కొన్ని ట్వీట్లు చేయడం ట్రెండ్‌లో వచ్చింది. మస్క్ తన ట్వీట్‌లో, అతను మాంచెస్టర్ యునైటెడ్‌ను  కొనుగోలు చేస్తున్నాడా లేదా అనేది తేలాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios