ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఏం చేసినా సంచలనంగా మారుతోంది. ఇటీవల మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను భారీ ధరకు కొనుగోలు చేసి ప్రపంచ వ్యాప్తంగా చర్చలకు తావిచ్చారు. విచిత్రమైన పోస్టులు చేస్తూ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాడు.
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విట్టర్‌లో హల్‌చల్ చేస్తున్నాడు. 44 బిలియన్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి సిద్ధమైన మస్క్.. అప్పటి నుంచి ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటున్నాడు. అదే స్థాయిలో విచిత్రమైన పోస్టులు చేస్తూ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాడు. తాజాగా టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ చేసిన ఓ ట్వీట్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ‘నేను అనుమానాస్పద స్థితిలో చనిపోతే.. మీ అందరితో పరిచయం అయినందుకు సంతోషం’ అంటూ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశాడు.
"నేను అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతే.. మీ అందరితో పరిచయం అయినందుకు సంతోషం" అంటూ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అనటం ఇప్పుడు ప్రపంచంలో అందరినీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తోంది. ఈ పోస్టుకు ఒక గంట ముందు.. 'ఉక్రెయిన్‌లోకి ఫాసిస్ట్ దళాలతో పాటు కమ్యూనికేషన్ సామగ్రిని పంపించటంలో మీ భాగస్వామ్యం ఉంది. దీనికి మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంటూ రష్యన్ అధికారి పంపిన సందేశాన్ని కూడా ఎలాన్ మస్క్ షేర్ చేశారు. ఉక్రెయిన్‌కు పెంటగాన్ సాయం వెనుక మస్క్ సహకారం కూడా ఉందంటూ రష్యన్ స్పేస్ చీఫ్ రోగోజిన్ అన్నారు. ఉక్రెయిన్ మిలిటరీ సేనలకు స్పేస్ఎక్స్ స్టార్టిలింక్ శాటిలైట్ బ్రాడ్ బాండ్ సేవలు అందించటాన్ని ఆయన తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ తరుణంలో రష్యా అధికారి చేసిన ట్వీట్ కు ఎలాన్ మస్క్ రిప్లై ఇచ్చారా.. మస్క్ కు రష్యా నుంచి బెదిరింపులు మొదలయ్యాయా అనే ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.
అంతకుముందు మస్క్ ఓ ట్వీట్ చేశాడు. రష్యన్ అధికారి మస్క్‌కు పంపిన సందేశాన్ని ఇంగ్లీష్‌లో తర్జమా చేసి ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ పెట్టిన కొద్దిసేపటికే నేను అనుమానాస్పద స్థితిలో చనిపోతే.. అనే ట్వీట్ చేశాడు. రష్యన్ అధికారి మస్క్‌కు పంపించిన సందేశంలో.. ‘ఉక్రెయిన్‌లోకి ఫాసిస్ట్ దళాలతో పాటు కమ్యూనికేషన్ సామగ్రిని పంపించటంలో మీ భాగస్వామ్యం ఉంది.. దీనికి మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటూ రష్యన్ అధికారి పంపిన సందేశంలో ఉంది. ఈ నేపథ్యంలో తాను అనుమాస్పదంగా చనిపోతే అని ట్వీట్ చేయడంతో ఇది పరోక్షంగా రష్యాను ఉద్దేశించే మస్క్ వ్యాఖ్యానించారా అన్నచర్చ నడుస్తున్నది.
అయితే మస్క్ ట్వీట్‌కు పలువురు నెటిజన్లు జోకులు వేస్తుండగా, మరికొందరు నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. కొందరు నెటిజన్లు.. మిస్టర్ మస్క్ మత్తులో ఉన్నారా..? అంటూ ప్రశ్నించారు. మరికొందరు నెటిజన్లు విపరీతమైన పనులు మస్క్‌ను ఇబ్బంది కలిగిస్తున్నాయని పేర్కొనగా, మరికొందరు ట్విట్టర్‌లో నూతన సంస్కరణలు తీసుకురావడానికి మస్క్ బతికే ఉండాలంటూ రీట్వీట్లు చేశారు.
