ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫారం ట్విట్టర్ భారత్ లోని తమ రెండు కార్యాలయాలను శాశ్వతంగా మూసివేసింది. వీటిల్లో పనిచేసే ఉద్యోగులను ఇకపై ఇంటి వద్ద నుంచే పని చేయమని ఆర్డర్ చేసింది. దీంతో ఎలాన్ మస్క్ తీసుకుంటున్న ఖర్చు తగ్గింపు నిర్ణయాల కారణంగా ఉద్యోగుల భవితవ్యం ఇప్పటికే ప్రశ్నార్థకంగా మారింది.
ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఎలాంటి మాస్క్ ఊహకందని నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నాడు అయితే అతను తీసుకున్న కొన్ని నిర్ణయాలు. ట్విట్టర్ ఉద్యోగుల పాలిట శాపాలుగా మారుతున్నాయి తాజాగా అతడు తీసుకున్న ఓ నిర్ణయము భారత్లోని ట్విట్టర్ ఉద్యోగులకు శాతంగా మారింది. ట్విట్టర్ ఇండియా కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ఎలాన్ మస్క్ తాజాగా ప్రకటించారు. భారతదేశంలోని తమ ట్విట్టర్ కార్యాలయాలకు తాళం వేసి, ఉద్యోగులను ఇంటికి పంపేశాడనే వార్త నెట్టింట వైరల్ గా మారింది.
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ భారతదేశంలోని తన కార్యాలయాలను మూసివేసింది. భారతదేశంలోని ట్విట్టర్ మూడు కార్యాలయాలలో రెండింటిని మూసివేసింది.అలాగే ఉద్యోగులను ఇళ్లకు వెళ్లాలని కోరింది. అందుతున్న వార్తల ప్రకారం, ఎలాన్ మస్క్ భారతదేశంలోని మూడు ట్విట్టర్ కార్యాలయాలలో రెండింటిని మూసివేసి. కంపెనీ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయాలని కోరారు. ఖర్చులను తగ్గించడం ఎలాన్ మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీ, ముంబైలోని ట్విట్టర్ కార్యాలయాలు మూతపడ్డాయి.
గత ఏడాది చివర్లో భారతదేశంలోని 200-ప్లస్ ఉద్యోగులలో 90% కంటే ఎక్కువ మందిని తొలగించిన ట్విట్టర్, ఇప్పుడు రాజకీయ కేంద్రమైన న్యూఢిల్లీ , ఆర్థిక కేంద్రమైన ముంబైలోని తన కార్యాలయాలను మూసివేసింది. బెంగళూరులోని దక్షిణ టెక్ హబ్‌లో ఎక్కువగా ఇంజనీర్లు ఉండే కార్యాలయాన్ని ట్విట్టర్ కొనసాగిస్తోందని అందుతున్న వార్తలను బట్టి తెలుస్తోంది. సమాచారం ప్రైవేట్‌గా ఉన్నందున పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఆర్థిక స్థితిని పటిష్టం చేసేందుకు ఉద్యోగుల తొలగింపు!
బిలియనీర్ CEO మస్క్ 2023 చివరి నాటికి ట్విట్టర్‌ను ఆర్థికంగా స్థిరీకరించే ప్రయత్నంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులను తొలగించారు. కార్యాలయాలను మూసివేశారు. అయినప్పటికీ, ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంటర్నెట్ రంగంపై దీర్ఘకాలిక పందెం వేస్తున్న Meta Platforms Inc నుండి Alphabet Inc యొక్క Google వరకు US టెక్నాలజీ దిగ్గజాలకు భారతదేశం ఇప్పటికీ కీలక వృద్ధి మార్కెట్‌గా పరిగణించడం గమనార్హం.
ట్విట్టర్ హెడ్డాఫీసులో 80 మంది ఉద్యోగులు మాత్రమే మిగిలారు..
మస్క్ సంచలన నిర్ణయాలతో ఇప్పటికే ట్విట్టర్ కంపెనీ అస్తవ్యస్తంగా మారింది. తాజాగా అమెరికాలోని ట్విట్టర్ హెడ్ క్వార్టర్ లో తొలగింపుల తర్వాత కేవలం 80 మంది మాత్రమే ఉద్యోగులకు ట్విట్టర్ ఆఫీసులో మిగిలినట్లు తేలింది. అయితే ఈ విషయం నెట్టింట వైరల్ అవుతోంది. మస్క్ ఖర్చుల తగ్గింపు పేరుతో ట్విట్టర్ ను చంపేస్తున్నారని, ఇదే అదనుగా భవిష్యత్తులో మరో సోషల్ మీడియా ప్లాట్ ఫాం పుంజుకుంటే, ట్విట్టర్ పని అయిపోతుందని నిపుణులు భావిస్తున్నారు.
