Asianet News TeluguAsianet News Telugu

కేంద్రం దిద్దుబాటు చర్యలు.. సామాన్యుడికి ఊరట.. దిగొస్తున్న వంట నూనెల ధరలు

దేశంలో వంట నూనెల ధరల పెరుగుదలను అరికట్టడానికి, అన్ని శుద్ధి చేసిన నూనెలపై దిగుమతి సుంకం తగ్గింపు తర్వాత మార్కెట్లలో గత వారం సోయాబీన్ నూనె ధరలు (soybean oil price) క్షీణించాయి. దిగుమతి సుంకాన్ని తగ్గించిన (import duty news on edible oil) తర్వాత దిగుమతి చేసుకున్న సోయాబీన్ ఆయిల్ ధర తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. 

edible oil prices decline last week after reduction in import duty
Author
New Delhi, First Published Dec 26, 2021, 7:11 PM IST

దేశంలో వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ (petrol diesel price) ఇతర నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. వీటికి ఏ మాత్రం తగ్గకుండా వంట నూనెల ధరలు (edible oil prices in india) సైతం దూసుకెళ్లాయి. అయితే వీటిపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నుంచి విమర్శలు రావడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా దేశంలో వంట నూనెల ధరల పెరుగుదలను అరికట్టడానికి, అన్ని శుద్ధి చేసిన నూనెలపై దిగుమతి సుంకం తగ్గింపు తర్వాత మార్కెట్లలో గత వారం సోయాబీన్ నూనె ధరలు (soybean oil price) క్షీణించాయి. దిగుమతి సుంకాన్ని తగ్గించిన (import duty news on edible oil) తర్వాత దిగుమతి చేసుకున్న సోయాబీన్ ఆయిల్ ధర తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇది ఇతర నూనెల ధరలపై కూడా ప్రభావం చూపిందని అంటున్నారు. 

వేరుశెనగ ధరలు పడిపోవడంతో రైతులు పండించిన పంటను తక్కువ ధరకు విక్రయించేందుకు సిద్ధంగా లేరని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో కొరత కారణంగా వేరుశనగ ధరలు ఈ వారంలో మెరుగుపడ్డాయి. శెనగ నూనె ధర గతంతో పోలిస్తే తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. చలికాలంలో సాధారణంగా క్రూడ్ పామాయిల్‌కు డిమాండ్ తక్కువగా ఉంటుందని.. అందుచేత పామాయిల్ ధర కూడా తగ్గిందని మార్కెట్ వర్గాలు వివరించాయి. దిగుమతి సుంకం తగ్గించడం కూడా ధర తగ్గడానికి కారణమంటున్నారు. 

ALso Read:వంట నూనెల ధరల నియంత్రణకు కేంద్రం కసరత్తు.. ‘స్టాక్‌ లిమిట్‌ విధించండి’

కాగా.. వంట నూనెల ధరలు తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా గత సోమవారం 2022 మార్చి వరకు శుద్ధి చేసిన పామాయిల్‌పై (palm oil) ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించింది. దీనికి అదనంగా, ముడి పామాయిల్‌తో సహా అనేక వ్యవసాయ వస్తువుల ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌లలో వాణిజ్యాన్ని ఏడాది పాటు నిలిపివేసింది. అలాగే పామాయిల్ రైతులకు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని నిర్ణయించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios