Asianet News TeluguAsianet News Telugu

కరోనా కట్టడే లక్ష్యం.. రెమ్‌డెసివిర్ ఉత్పత్తికి డా రెడ్డీస్‌ కీలక ఒప్పందం

దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ లాబ్స్‌ అమెరికా ఫార్మా దిగ్గజం గిలాడ్ సైన్సెస్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకున్నది. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు భావిస్తున్న యాంటీ వైరల్ డ్రగ్‌ రెమ్‌డెసివిర్ తయారీ, మార్కెటింగ్‌ భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది.

Dr Reddy Inks Pact With Gilead Sciences To Manufacture COVID 19 Drug
Author
New Delhi, First Published Jun 14, 2020, 12:49 PM IST

హైదరాబాద్‌: దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ లాబ్స్‌ అమెరికా ఫార్మా దిగ్గజం గిలాడ్ సైన్సెస్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకున్నది. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు భావిస్తున్న యాంటీ వైరల్ డ్రగ్‌ రెమ్‌డెసివిర్ తయారీ, మార్కెటింగ్‌ భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది.

ఈ మేరకు గిలియడ్‌తో నాన్-ఎక్స్‌క్లూజివ్ లైసెన్సింగ్ ఒప్పందంపై డాక్టర్స్ రెడ్డీస్‌ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం భారత్‌ సహా 127 దేశాల్లో రెమ్‌డెసివిర్‌ రిజిస్ట్రేషన్‌, తయారీ, మార్కెటింగ్‌ చేసే వీలు కలుగుతుంది. దీని ఉత్పత్తికి అవసరమైన టెక్నాలజీ సహకారం సైన్సెస్‌ డా. రెడ్డీస్‌కు గిలాడ్ సంస్థఖు అందిస్తుంది. 

దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్, బయోకాన్ ఆర్మ్ సింజీన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, జైడస్ కాడిలా లిమిటెడ్, ఈజిప్టుకు చెందిన ఇవా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ వంటి మరో నాలుగు సంస్థలతో తయారీ లైసెన్సు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు గిలాడ్ సైన్సెస్ తెలిపింది. పాకిస్తాన్‌కు చెందిన ఫిరోజాన్స్‌ లాబొరేటరీస్‌తో సహా మొత్తం మొత్తం తొమ్మిది కంపెనీలతో  ఈ డ్రగ్‌ తయారీ ఒప్పందాలను చేసుకుంది.  

అమెరికా, ఇండియా సహా మరికొన్ని దేశాల్లో కొవిడ్ -19 చికిత్సలో ప్రయోగత్మక ఔషధంగా భావిస్తున్న రెమ్‌డిసివిర్ అత్యవసర వినియోగ అధికారాన్ని పొందిన నేపథ్యంలో ఈ  నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

దీని కట్టడికి వ్యాక్సిన్‌తో పాటు ఔషధంపై కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రయోగాలు జరుగుతున్నాయి. అమెరికాకు చెందిన గిలాడ్‌ సైన్సెస్‌ సంస్థ అభివృద్ధి చేసిన ‘రెమ్డెసివిర్‌’ ఔషధం ఇప్పుడు నేరుగా కరోనా బాధితులపై ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నారు. 

కరోనా బాధితులకు చికిత్స అందించే విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ సవరించిన ‘క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోటోకాల్స్‌ ఫర్‌ కోవిడ్‌–19’ను శనివారం విడుదల చేసింది. యాంటీ వైరల్‌ డ్రగ్‌ రెమ్‌డెసివిర్‌ను అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.

అలాగే కరోనా ప్రాథమిక దశలోనే ఉంటే యాంటీ మలేరియల్‌ డ్రగ్‌ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రలు వాడుకోవచ్చని తెలియజేసింది. ఈ విషయంలో గతంలో జారీ చేసిన ప్రోటోకాల్‌లోని అంశాలను కేంద్ర ఆరోగ్యశాఖ తొలగించింది.

also read:తెలంగాణ సచివాలయంలో మహిళా ఉద్యోగికి కరోనా: ఆసుపత్రిలో చికిత్స

ఈ ఒప్పందం  ప్రకారం 127 దేశాలలో పంపిణీ కోసం రెమ్‌డెసివిర్‌ను తయారు చేయడానికి కంపెనీలను అనుమతిస్తుంది. ఉత్పత్తిని మరింత త్వరగా పెంచడానికి , వారి ఉత్పత్తులకు వారి సొంత ధరలను నిర్ణయించడానికి వీలు కల్పిస్తుంది.

రెమ్‌డెసివిర్‌తోపాటు టోసిలిజుమాబ్‌, ఇమ్యునోమోడ్యులేటర్‌ వంటి యాంటీ వైరల్‌ ఔషధాల వినియోగాన్ని తీవ్ర అనారోగ్యంతో ఉన్న కరోనా రోగులకు మాత్రమే పరిమితం చేసే అవకాశం ఉంది. కరోనా చికిత్సకు గతంలో విడుదల చేసిన మార్గదర్శకాలను సమీక్షించడానికి ఏర్పాటైన జాతీయ స్థాయి టాస్క్‌ఫోర్స్‌ ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios