ఆరు పదుల వయస్సు దగ్గర పడుతున్నా.. తరగని నీతా అంబానీ అందానికి కారణం ఎవరో తెలుసా..?
ఆరు పదుల వయసు దగ్గర పడుతున్న ఆకట్టుకునే అందం రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్స నీతా అంబానీ సొంతం. సహజంగానే ఆమె అందగత్తె అయినప్పటికీ, ఆమె అందాన్ని మెరుగులు దిద్దడం వెనుక ఒకరి కృషి స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె ఇంత అందంగా కనిపించడానికి కారణమైన సెలబ్రిటీ మేకప్ ఉమెన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ఇటీవల మెగా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. పలువురు బాలీవుడ్ తారలు తరలి వచ్చారు. ఈ నటీమణులందరి కంటే నీతా అంబానీ అందరి దృష్టిని ఆకర్షించింది. 59 ఏళ్ల నీతా అంబానీ కూడా ఇటీవలే అమ్మమ్మ అయింది. అయినా సరే నీతా కొత్త పెళ్లికూతురులా ముస్తాబై కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నీతా అంబానీ ఎన్నో ప్రత్యేక కార్యక్రమాల్లో మెరుస్తూ ఇలాగే కనిపిస్తారు. నీతా సహజమైన అందగత్తె అయినప్పటికీ, ఆమెను అందంగా తీర్చిదిద్దిడం వెనుక ఓ మహిళ కృషి మనకి కనిపిస్తుంది. నీతా ఇంత అందంగా కనిపించినందుకు పూర్తి క్రెడిట్ ఆమె మేకప్ ఉమెన్ నిషి సింగ్‌కి చెందుతుంది.
కొన్ని దశాబ్దాలుగా బాలివుడ్ పరిశ్రమలో పనిచేస్తున్ననిషి సింగ్ ఇప్పటికే సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్టుగా పెద్ద పేరు తెచ్చుకున్నారు. ప్రముఖ తారల మేకప్ ఆర్టిస్ట్ అయిన నిషీ ప్రస్తుతం నీతా అంబానీకి మేకప్ ఉమెన్. ఆమె సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు బ్యూటీషియన్ కూడా. 2017లో భారతదేశానికి చెందిన మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ అయినప్పుడు ఆమె పేరు మారుమోగిపోయింది. విద్యాబాలన్, సారా అలీఖాన్, అనన్య పాండే, భూమి పెడ్నేకర్, ఫాతిమా సనా షేక్, మృణాల్ ఠాకూర్, మాళవిక మోహనన్, చిత్రాంగద సింగ్, అమీ జాక్సన్ వంటి ప్రముఖులకు పర్సనల్ మేకప్ ఉమెన్ గా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రస్తుతం ముంబైలో నివాసముంటున్న నిషి… ఢిల్లీలో ఏడేళ్లు, అమెరికాలో ఆరు నెలలు మేకప్‌లో శిక్షణ పొందింది. మేకప్‌తో పాటు, గుడ్డు రంగీలా , యే లాల్ రంగ్ వంటి డజన్ల కొద్దీ హిట్ చిత్రాలలో ఆమె మేకప్, హెయిర్ స్టైలింగ్ కూడా చేసింది. ధడక్‌లో శ్రీదేవి కూతురు జాన్వీ. ఇషాన్ ఖట్టర్‌ల మేకప్ , హెయిర్ స్టైలింగ్ కూడా చేశారు. చాలా మంది సెలబ్రిటీలకు మేకప్ చేసినప్పటికీ నీతా అంబానీతో కలిసి పనిచేయడం ఒక ప్రత్యేకమైన అనుభూతి అని నిషి అన్నారు.
నీతా చాలా సరదా మనిషి. ఆమెకు మేకప్ వేయాలనేది చాలా ఏళ్లుగా నా కోరిక. ఇది NMACC కార్యక్రమంలో నా కల సాకారమైంది . నీతా శిక్షణ పొందిన శాస్త్రీయ నృత్యకారిణి , కళాకారిణి కాబట్టి, నేను ఆమె ప్రతి కదలికను ఆరాధిస్తాను.తనకు మేకప్ చేసిన తర్వాత దాన్ని మెచ్చుకుంటూ నా జీవితంలో ఇది మరిచిపోలేని అనుభూతి అని ఆమె నాతో అన్నారు.
నీతా అంబానీ హై ప్రొఫైల్ వెడ్డింగ్‌లో ధరించిన ఆకుపచ్చ చీర ఇటీవల ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీరగా వార్తల్లో నిలిచింది. ఖరీదైన డిజైనర్ దుస్తులను ధరించిన నీతా, 2015లో మాజీ రాజ్యసభ ఎంపీ పరిమత్ నత్వానీ కుమారుడి వివాహ వేడుకలో పచ్చలు, ఇతర క్రిస్టల్స్‌తో నిండిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గులాబీ రంగు చీరను ధరించారు. పింక్ చీర నిజమైన ముత్యాలు, పచ్చలు, కెంపులు , ఇతర రత్నాలతో చేతితో ఎంబ్రాయిడరీ చేయబడింది. ఈ చీరలో కళ్లు చెదిరే ఫీచర్ బ్లౌజ్. అందులో కృష్ణుడి బొమ్మను డిజైన్ చేశారు. ఈ ఖరీదైన చీరను కాంచీపురంకు చెందిన 35 మంది మహిళా కళాకారులు రూపొందించారు. దీని ధర 40 లక్షలకు పైగా ఉండవచ్చని అంచనా.