బ్యాంక్‌ అకౌంట్‌ ఉంటే చాలు.. రూ. 2 లక్షల బీమా. ఈ పథకం గురించి చాలా మందికి తెలియదు

దేశంలో ఉన్న పేదలకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తుంటాయి. అయితే చాలా మందికి వాటిపై సరైన అవగాహన లేక పథకాలను వినియోగించుకోలేకపోతున్నారు. అలాంటి రెండు పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Do you know banks offering RS 2 lakh life insurance for having savings account VNR

ప్రస్తుతం చాలా మందికి ఆర్థిక క్రమ శిక్షణ పెరుగుతోంది. ఖర్చు చేసిన తర్వాత మిగిలిన మొత్తాన్ని పొదుపు చేయడం ఒకప్పటి మాట, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పొదుపు చేసిన తర్వాత మిగిలిన దాన్నే ఖర్చు చేస్తున్నారు. మారిన ఆర్థిక అవసరాలు, ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో పొదుపుతో పాటు జీవిత బీమా పథకాలకు పెద్ద ఎత్తున మొగ్గు చూపిస్తున్నారు. అయితే ప్రభుత్వాలు అందిస్తున్న కొన్ని బీమా పథకాల గురించి చాలా మంది అవగాహన లేదు. 

Do you know banks offering RS 2 lakh life insurance for having savings account VNR

బ్యాంక్‌ అకౌంట్‌ ఉంటే చాలు.. 

దేశంలో ప్రతీ ఒక్కరికీ బ్యాంక్‌ ఖాతా ఉండాలన్న దిశగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో బ్యాంకు ఖాతాలు పెద్ద ఎత్తున అందుబాటులోకి వస్తున్నాయి. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి అందిస్తున్నారు.

అయితే మీకు సేవింగ్ ఖాతా ఉంటే చాలు రెండు జీవిత బీమా పథకాలు వర్తిసాయనే విషయం మీలో ఎంత మందికి తెలుసు.? ఏదైనా జాతీయ బ్యాంకులో సేవింగ్స్‌ అకౌంట్‌ ఉంటే చాలు రూ. 4 లక్షల జీవితా బీమా ఉన్నట్లే. 

Do you know banks offering RS 2 lakh life insurance for having savings account VNR

పీఎం సురక్ష బీమా యోజన.. 

పేద ప్రజలకు జీవితా బీమా అందించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం పీఎం సురక్ష బీమా యోజన పేరుతో పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా కేవలం రూ. 20 ప్రీమియంతో రూ. 2 లక్షల విలువైన జీవితబీమాను అందిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగి ఖాతాదారుడు మరణిస్తే బ్యాంకులు రూ. 2 లక్షల జీవిత బీమా పరిహారం చెల్లిస్తాయి.

ఇందుకోసం ఏడాదికి రూ. 20 చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఏటా తన ఖాతా నుంచి రూ. 20ని అకౌంట్ హోల్డర్‌ బ్యాంకుకు రాతపూర్వకంగా సంతకం చేసి విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతీ ఏంటా లేఖను అందించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రీమియం చెల్లించకపోతే బీమా నిలిచిపోతుంది. అందుకే ఆటో డెబిట్‌ సెట్‌ చేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. 

Do you know banks offering RS 2 lakh life insurance for having savings account VNR

జీవనజ్యోతి పథకం.. 

ఇక కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న మరో పథకం పేరు పీఎం జీవనజ్యోతి బీమా యోజన. ఖాతాదారు సహజంగా లేదా అనారోగ్యం, ప్రమాద కారణాలతో మరణిస్తే 2 లక్షల రూపాయలు పరిహారంగా అందిస్తారు. అయితే ఈ పథకం కోసం బ్యాంకుల ఆధారంగా ప్రతీ ఏటా రూ. 450 నుంచి రూ. 500 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇంత తక్కువ మొత్తం చెల్లించడం ద్వారా ఇలాంటి బీమా పథకం ప్రైవేట్‌ సంస్థలేవీ అందించకపోవడం గమనార్హం. 

Do you know banks offering RS 2 lakh life insurance for having savings account VNR

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios