Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా, అయితే కార్డు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు గీకి పారేసి, లిమిట్ మొత్తం వాడేస్తున్నారా..అలా చేస్తే మొదటికే మోసం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ క్రెడిట్ లిమిట్ ను పూర్తిగా వాడేస్తే, ఏమవుతుందో తెలుసుకుందాం.
ఈ రోజుల్లో క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగిపోయింది. బ్యాంకులకు కూడా క్రెడిట్ కార్డుల ద్వారా మంచి బిజినెస్ కావడంతో అనేక రకాల క్రెడిట్ కార్డులు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్ల నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో 3 నెలల వరకు వడ్డీ రహిత క్రెడిట్‌ను అందించే అనేక కార్డ్‌లు నేడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
కొన్ని కార్డులతో మీరు ఉచితంగా కూడా షాపింగ్ చేయవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదే మీ క్రెడిట్ కార్డ్ (Credit Card Limit)లిమిట్ గుర్తుంచుకోవాలి. క్రెడిట్ లిమిట్ అనేది ఏదైనా బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ క్రెడిట్ కార్డ్ (Credit Card) వినియోగం కోసం నిర్ధారించే లిమిట్.
క్రెడిట్ లిమిట్ అనేది క్రెడిట్ కార్డ్ (Credit Card) హోల్డర్ కార్డ్‌పై గరిష్ట మొత్తాన్ని ఖర్చు చేయగల లిమిట్. క్రెడిట్ కార్డ్ (Credit Card)ప్రయోజనాలు, ఫీచర్ల ఆధారంగా క్రెడిట్ లిమిట్ నిర్ణయిస్తారు. క్రెడిట్ కార్డ్ క్రెడిట్ లిమిట్ ఎంత ఉపయోగించాలి. ఈ సమాచారాన్ని తెలుసుకునే ముందు, క్రెడిట్ లిమిట్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం ముఖ్యం.
లిమిట్‌ను నిర్ణయించే హక్కు బ్యాంక్‌కు ఉంటుంది. క్రెడిట్ లిమిట్ నిర్ణయించడానికి ఖచ్చితమైన మార్గం లేదు, కాబట్టి క్రెడిట్ కార్డ్ (Credit Card)పై అందించే క్రెడిట్ లిమిట్‌ని అంచనా వేయడం కొన్నిసార్లు కష్టం. అయినప్పటికీ, క్రెడిట్ కార్డ్ (Credit Card) లిమిట్ నిర్ధారించేందుకు బ్యాంక్ నిర్ణయించే అనేక ప్రమాణాలు ఉన్నాయి. మీ క్రెడిట్ లిమిట్ని నిర్ణయించే ముందు, బ్యాంక్ మీ నెలవారీ ఆదాయాలు, స్థిర ఖర్చులు, ఇతర లోన్స్ గురించి సమాచారాన్ని పొందుతుంది. మీ జీతం స్లిప్‌లు, టాక్స్ రిటర్న్స్, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, ఇతర క్రెడిట్ నివేదికల ద్వారా బ్యాంక్ మీ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుంటుంది.
క్రెడిట్ లిమిట్‌ను పూర్తిగా ఉపయోగించవద్దు
ఎంత క్రెడిట్ లిమిట్ ఉపయోగించాలి. ఇది చాలా మందికి కొంత వింతగా అనిపించవచ్చు, ఒక కార్డు మీ చేతిలో ఉన్నప్పుడే లిమిట్ నిర్ణయించబడి ఉంటుది. కాబట్టి మళ్లీ లిమిట్ పూర్తిగా ఉపయోగించకూడదా అనే సందేహం రావచ్చు. అయితే క్రెడిట్ కార్డ్ (Credit Card) హోల్డర్లు తమ క్రెడిట్ లిమిట్ ను పూర్తిగా ఉపయోగించవద్దని నిపుణులు ఎప్పుడూ సలహా ఇస్తుంటారు. క్రెడిట్ లిమిట్ ను పూర్తిగా ఉపయోగించినప్పుడు, క్రెడిట్ వినియోగ నిష్పత్తి పెరుగుతుంది, ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తుంది.
క్రెడిట్ స్కోర్, క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో
క్రెడిట్ స్కోర్ ఎంత ముఖ్యమో ప్రతీ ఒక్కరి తెలిసి ఉండవచ్చు, ఇది మీరు రుణం తీసుకున్న చరిత్ర, తిరిగి చెల్లింపు ఆధారంగా లెక్కిస్తారు. సాధారణంగా క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటే మీకు భవిష్యత్తులో బ్యాంకు రుణాలు లభించే అవకాశాలు తగ్గిపోతాయి. ఒక వేళ క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే ఈ సందర్భంలో బ్యాంక్ లేదా ఇతర ఆర్థిక సంస్థలు మీ రుణాన్ని సులభంగా, వేగంగా ఆమోదిస్తారు.
క్యాష్ లిమిట్ కూడా క్రెడిట్ లిమిట్‌లో భాగం
క్రెడిట్ లిమిట్ మీరు క్రెడిట్ కార్డ్ (Credit Card)తో ఎంత ఖర్చు చేయవచ్చో అదే విధంగా, క్రెడిట్ కార్డ్ (Credit Card) ద్వారా మీరు ఎంత నగదును విత్‌డ్రా చేయవచ్చో నగదు లిమిట్ చెబుతుంది. క్రెడిట్ కార్డ్ (Credit Card) నగదు ఉపసంహరణ ఫీచర్‌ను కూడా అందిస్తుంది, దీని ద్వారా నిర్దిష్ట లిమిట్ వరకు నగదు ఉపసంహరించుకునే హక్కు కార్డ్ హోల్డర్‌కు ఉంటుంది.
