one plus tv: వన్ ప్లస్ టీవీలపై ఆఫర్.. ఆ బ్యాంక్ కార్డు ఉంటే రూ.7000 క్యాష్‌బ్యాక్

రిలయన్స్ డిజిటల్ మరోసారి చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం వన్‌ప్లస్‌తో జత కట్టింది. వన్ ప్లస్ అందిస్తున్న టీవీలు వన్‌ప్లస్‌ టీవీలు ఎక్స్‌క్లూజివ్‌గా రిలయన్స్‌ డిజిటల్‌ షోరూమ్‌ల్లో ప్రత్యేకంగా లభిస్తాయి. వినియోగదారులు హెచ్‌డీఎఫ్‌సీ కార్డులపై రూ.7000 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.

Discover the OnePlus TV experience exclusively at Reliance Digital

ముంబై: చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం వన్‌ప్లస్‌ దేశీయ నెంబర్‌ వన్‌ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ రిలయన్స్‌ డిజిటల్‌‌తో మరోసారి కీలక భాగస్వామ్యం కుదుర్చుకున్నది. వేగంగా అభివృద్ధి చెందుతున్న టీవీ మార్కెట్‌పై కన్నేసిన వన్‌ప్లస్‌ స్మార్ట్‌టీవీలను రూపొందించింది. 

ఈ మేరకు వన్‌ ప్లస్‌ టీవీలను శనివారం రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో ఆవిష్కరించింది. వన్‌ప్లస్ టీవీ 55 క్యూ 1, వన్‌ప్లస్ టీవీ 55 క్యూ 1 ప్రో టీవీలు రెండింటినీ ప్రత్యేకంగా విక్రయిస్తుంది.  

వన్‌ప్లస్‌ టీవీలను కొనుగోలు చేసిన వినియోగదారులకు,హెచ్‌డీఎఫ్‌సీ కార్డులపై రూ .7వేల వరకు క్యాష్‌బ్యాక్ నో కాస్ట్‌ ఈఎంఐ, ఎక్స్‌టెండెడ్ వారంటీతోపాటు మల్టీబ్యాంక్ క్యాష్‌బ్యాక్ తదితర ప్రత్యేక ఆఫర్లను    రిలయన్స్ డిజిటల్ అందిస్తోంది.

గూగుల్‌కు తెల్ల జెండా ఊపేసిన మైక్రోసాఫ్ట్

వన్ ప్లస్ సస్థ సారథ్యంలోని రెండు వెర్షన్లతో కూడిన టీవీలు దేశవ్యాప్తంగా ఉన్న వందకు పైగా రిలయన్స్ డిజిటల్, జియో స్టోర్స్‌లో లభిస్తాయి. బాలీవుడ్ నటి తారా సుతారియా టీవీలను విపణిలోకి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లయన్స్ డిజిటల్ తన అభిమాన టెక్నాలజీ స్టోర్ అనీ, భారతదేశమంతా ఈ కొత్త తరం టీవీని అనుభవించే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. 

గత ఏడాది నవంబర్ నుంచి రిలయన్స్‌ డిజిటల్‌తో కలిసి పని చేస్తున్నామని, స్పందన అద్భుతంగా వుందని వన్‌ప్లస్‌ ఇండియా జనరల్ మేనేజర్ (జీఎం) వికాస్‌ అగర్వాల్‌ తెలిపారు. తాజాగా వన్‌ప్లస్‌ టీవీలతో తమ ఈ భాగస్వామ్యం మరింత బలపడిందన్నారు. 

అమెజాన్ దివాలీ సేల్‌.. 60 శాతం డిస్కౌంట్‌

రిలయన్స్ డిజిటల్ సీఈఓ బ్రియాన్ బాడే మాట్లాడుతూ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రారంభించిన నెంబర్‌ వన్‌ సంస్థగా తమ ట్రాక్ రికార్డ్‌ను దృష్టిలో ఉంచుకుని, రిలయన్స్ డిజిటల్ కుటుంబానికి వన్‌ప్లస్ టీవీని స్వాగతిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. 

భారత వినియోగదారునికి, ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన తాజా టెక్నాలజీ బ్రాండ్ల మధ్య వారధిగా కొనసాగుతామని రిలయన్స్ డిజిటల్ సీఈఓ బ్రియాన్ బాడే వ్యాఖ్యానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రిలయన్స్ డిజిటల్, ఈవిపి అండ్‌ సిఎంఓ కౌశల్ నెవ్రేకర్, వన్‌ప్లస్‌ ఇండియా జనరల్ మేనేజర్ వికాస్ అగర్వాల్‌ పాల్గొన్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios