గూగుల్‌కు తెల్ల జెండా ఊపేసిన మైక్రోసాఫ్ట్
ఆపిల్ డివైజ్‌ల్లో వాడే ఆపరేటింగ్ సిస్టమ్.. ఐఓఎస్. గూగుల్ డివైజ్‌ల్లో వాడే ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్. మరి మైక్రోసాఫ్ట్ డివైజ్‌ల్లో వాడే ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ కదా.. కాదు కాదు ఆండ్రాయిడే. విండోస్ కేవలం కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లకు మాత్రమే పనికొస్తుంది. మొబైల్స్ కు ఆండ్రాయిడే బెస్ట్. ఈ సంగతి స్వయంగా మైక్రోసాఫ్ట్ డివైజేస్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పనోస్ పనాయ్ చెప్పారు. త్వరలో మైక్రోసాఫ్ట్ విడుదల చేసే సర్ఫేస్ డ్యూ ఫోన్ లో గూగుల్ ఆండ్రాయిడ్ ఐఓఎస్ సేవలను వినియోగించనున్నది.
న్యూఢిల్లీ: ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ త్వరలో విపణిలోకి విడుదల చేయనున్న సర్‌ఫేస్ డ్యూ ఫోన్‌లో గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్ ఆప్స్ అప్ లోడ్ చేసింది. అవును ఇది నిజం. ఇప్పటి వరకు మొబైల్ ప్రపంచంలో ఆండ్రాయిడ్‌కీ, ఐఓఎస్‌కీ పోటీగా మూడో ప్రత్యామ్నాయంగా నిలబడాలనుకున్న మైక్రోసాఫ్ట్ ఇప్పుడు జెండా ఎత్తేసింది.
మైక్రోసాఫ్ట్ డివైజెస్ గ్రూప్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పనోస్ పనాయ్ మాట్లాడుతూ సర్ఫేస్ డ్యూ ఫోన్‌లో గూగుల్ ఆండ్రాయిడ్ ఐఓఎస్ యాప్స్ వాడుతున్నట్లు అంగీకరించారు. ఉత్తమ ఓఎస్ సేవలకు ఆండ్రాయిడ్ సరైందని పేర్కొన్నారు.
Swiggy Jobs:: స్విగ్గి లో మూడు లక్షల ఉద్యోగాలు
ఇటీవలి కాలం వరకు గూగుల్, మైక్రోసాఫ్ట్ మోబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ప్రత్యర్థులు. కానీ చేతులెత్తేసింది మైక్రోసాఫ్ట్. గూగుల్ కు తెల్ల జెండా ఊపేసింది. "ఆండ్రాయిడ్‌తో పోరాడగలిగినంత కాలం పోరాడాం. ఇక సంధి ప్రకటించి లొంగిపోవడమే బెటర్! " అనుకుంది.
ఆధునిక కాలంలో యుద్ధాలు జరిగేది దేశాల మధ్య కాదు.. డిజిటల్ ప్రపంచాల మధ్య. ఆండ్రాయిడ్ వర్సెస్ విండోస్ యుద్ధంలో ఓడిపోయిన మైక్రోసాఫ్ట్ ఆండ్రాయిడ్‌తో సంధి చేసుకోబోతోంది. మరి ఈ సంధియుగం నుంచి విడుదలయ్యే విండోస్ మొబైల్ డివైజ్‌ల్లో ఆండ్రాయిడే ప్రధానపాత్ర వహించబోతోంది.
మైక్రోసాఫ్ట్ నుంచి తాజాగా వస్తున్న రెండు స్క్రీన్ల టాబ్లెట్ 'సర్‌ఫేస్ ట్యాబ్ డ్యుయో' లో ఉన్నది మైక్రోసాఫ్ట్ వారి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. గూగుల్ వారి ఆండ్రాయిడ్. అదేంటి? ప్రపంచం మొత్తం పాపులర్ అయిన విండోస్ లాంటి సొంత ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది.
కానీ విండోస్ అనేది పీసీల్లో హిట్ ఆపరేటింగ్ సిస్టమే గానీ. మొబైల్స్‌కి వచ్చేసరికి ఆండ్రాయిడ్‌దే పై చేయి. ప్రపంచంలో దాదాపు 80 శాతం డివైజ్‌లను ఆండ్రాయిడ్ ఆక్రమించింది. దాన్ని ఢీకొట్టడం మైక్రోసాఫ్ట్ తరం కాలేదు.
కొంతకాలం మొబైల్ రంగంలోని మరో ఫెయిల్యూర్ సంస్థ నోకియాతో కలిసి విండోస్ ఫోన్లు తేవాలని ప్రయత్నించింది. కానీ మైక్రోసాఫ్ట్ కంటే ముందే నోకియా ఆండ్రాయిడ్‌కి లొంగిపోయి, ఆండ్రాయిడ్ ఫోన్లు రిలీజ్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా గూగుల్ మొబైల్ ఆధిపత్యానికి అంగీకారం తెలపాల్సిన పరిస్థితి వచ్చేసింది.
ఇంతకాలంగా మైక్రోసాఫ్ట్ కూడా గూగుల్ ప్లే స్టోర్ మాదిరే 'విండోస్ యాప్ స్టోర్' పేరుతో ఒక యాప్ స్టోర్ నడుపుతూ వచ్చింది. త్వరలో మైక్రోసాఫ్ట్ దాన్ని కూడా మూసేయబోతోంది. తన యాప్స్ అన్నిటినీ - అయితే అటు ఆపిల్ ఫోన్లకీ, కాదంటే ఆడ్రాయిడ్ ఫోన్లకు కంపాటిబుల్‌గా ఉండేలా ప్లాట్ ఫాం మార్చేయబోతోంది.