Asianet News TeluguAsianet News Telugu

వరుసగా మూడు రోజు కూడా పెరిగిన డీజిల్ ధరలు

ఢిల్లీ, కోల్‌కతాలో డీజిల్ ధర లీటరుకు 20 పైసలు పెరగగా, ముంబై, చెన్నైలలో శనివారం లీటరుకు 21 పైసలు పెరిగాయి.అయితే ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలలో పెట్రోల్ ధరలు వరుసగా లీటరుకు రూ .74.63, రూ .77.29, రూ .80.29, రూ .77.58 గా మారాయి.

diesel price hiked continue on third day
Author
Hyderabad, First Published Dec 22, 2019, 3:58 PM IST

న్యూ ఢిల్లీ:పెట్రోల్ ధరలు వరుసగా నాలుగవ రోజులు స్థిరంగా ఉండటంతో డీజిల్ ధరలు వరుసగా మూడో రోజు కూడా పెరిగాయి. . చమురు మార్కెటింగ్ కంపెనీలు వరుసగా మూడు రోజుల్లో భారతదేశంలో లీటరుకు 50 పైసలకు పైగా డీజిల్ ధరలను పెంచడంతో డీజిల్ ధర ఈ రోజు లీటరుకు రూ .66.54 గా ఉంది.

also read ఉల్లి తరువాత, ఇప్పుడు వంట నూనె ధరలకు రెక్కలు...

ఢిల్లీ, కోల్‌కతాలో డీజిల్ ధర లీటరుకు 20 పైసలు పెరగగా, ముంబై, చెన్నైలలో శనివారం లీటరుకు 21 పైసలు పెరిగాయి.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసిఎల్) వెబ్‌సైట్‌లో లభించే ధరల జాబితా ప్రకారం ఢిల్లీలో డీజిల్ ధర లీటరుకు రూ .66.54 . కోల్‌కతాలో రూ.68.95, ముంబైలో లీటరుకు 69.80, చెన్నైలో 70.34 రూపాయలు.

diesel price hiked continue on third day


అయితే ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలలో పెట్రోల్ ధరలు వరుసగా లీటరుకు రూ .74.63, రూ .77.29, రూ .80.29, రూ .77.58 గా మారాయి.ఈ నెలలో ముడిచమురు ధరలు గణనీయంగా పెరిగినందున ఇంధన ధరల పెరుగుదల నుండి వినియోగదారులకు ఉపశమనం లభించే అవకాశం లేదు.

also read కంపెనీ డైరెక్టర్‌ను చంపేస్తానని బెదిరించిన నీరవ్ మోడీ...కారణం ?


బెంచ్ మార్క్ క్రూడ్, బ్రెంట్ డిసెంబరులో ఇప్పటివరకు దాదాపు ఆరు డాలర్ల ఎక్కువ ఖరీదైంది, అయితే బ్రెంట్ క్రూడ్  ఒప్పందం ద్వారా శుక్రవారం ఒక బ్యారెల్కు 66.04 డాలర్ల వద్ద ముగిసింది, ఇదీ అంతకుముందు సెషన్ కంటే 0.75 శాతం తక్కువ. ధరలు ఇప్పటికీ దాదాపు మూడు నెలల గరిష్టాన్ని చేరింది. ప్రపంచంలోని ప్రధాన చమురు కంపెనీలలో ఒకటైన సౌదీ అరాంకో సౌకర్యాలపై డ్రోన్ దాడుల తరువాత  సెప్టెంబర్ 16 న ముడిచమురు ధర బ్యారెల్కు. 71.95 కు పెరిగింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios