ఇండిగో ఎయిర్ లైన్స్ చిక్కులో పడింది. సెప్టెంబర్ 9న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రయాణించిన విమానంలో ప్రోటోకాల్స్ ఉల్లంఘన ఆరోపణలతో ఏవియేషన్ రెగ్యులేటర్ డిజిసిఎ ఇండిగో విమానయాన సంస్థకు నోటీసులు జారీ చేసింది.

ఏవియేషన్ రెగ్యులేటర్ వర్గాలు ఎయిర్ లైన్స్ నోటీసును ధృవీకరించాయి. ముంబైలోని కంగనా రనౌత్ బంగ్లాను కూల్చివేస్తున్నారంటూ సమాచారంతో ఇండిగో ఎయిర్ లైన్స్ విమానంలో కంగన రనౌత్ ముంబైకు బయలు దేరిన సంగతి మీకు తెలిసిందే.

చండీఘడ్ నుండి ముంబైకి టీవీ ఛానెళ్ల సభ్యులతో వెళ్లిన ఈ విమానంలో నటిని అనుసరిస్తూ గొడవ జరిగింది. ముంబై లోని శివసేన నియంత్రణలో ఉన్న బంద్రా మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి)లో కంగనా రనౌత్ కు చెందిన ఆఫీసు అక్రమ నిర్మాణమని  ఆరోపిస్తూ  అధికారులు కూల్చివేసారు.

 "2020 సెప్టెంబర్ 9న చండీఘడ్ నుండి ముంబైకి వెళ్ళిన 6ఇ264 ఫ్లైట్ విషయానికి సంబంధించి మేము డిజిసిఎకు మా స్టేట్మెంట్ ఇచ్చాము" అని ఇండిగో తెలిపింది.

also read కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో తొందరపాటు పనికి రాదు: బయోకాన్ ఎండీ ...

మా క్యాబిన్ సిబ్బంది, అలాగే కెప్టెన్ ఫోటోగ్రఫీని పరిమితం చేసే కెప్టెన్  ప్రకటనలతో సహ సామాజిక దూరం అనుసరించడం, భద్రత వంటి అన్ని అవసరమైన ప్రోటోకాల్‌లను అనుసరించామాని తెలిపింది.

జర్నలిస్ట్ జస్కిరత్ సింగ్ ట్విట్టర్లో షేర్ చేసిన వీడియోలో నటిని పలు టీవీ ఛానెళ్ళకు చెందిన మీడియా వ్యక్తులు దగ్గరగా అనుసరిస్తు సామాజిక దూరం పాటించక పోవడాన్ని, బోర్డులో ఉన్న చాలామంది మాస్క్ ధరించక పోవడాన్ని అని ఎత్తి చూపింది.

టీవీ ఛానెళ్ల సభ్యులతో మాట్లాడుతున్న ఒక వీడియోను  ట్విటర్ యూజర్ షేర్ చేస్తూ ఫేస్ మాస్క్, సామాజిక దూరం పాటించకపోవడం  పై ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై స్పందించిన డీజీసీఐ ఇండిగోకు నోటీసులు జారీ చేసింది.