Asianet News TeluguAsianet News Telugu

కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో తొందరపాటు పనికి రాదు: బయోకాన్ ఎండీ

కరోనా వైరస్ వ్యాక్సిన్ ట్రయల్స్ పై  నిలిపివేతపై  బయోకాన్ చైర్‌ పర్సన్, ఎండీ కిరణ్ మజుందార్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాక్సిన్‌ను త్వరితంగా అభివృద్ధి చేయలేమని తేలిందని మజుందార్ షా తెలిపారు. 

coronavirus vaccine can't be developed in hurry: Kiran Mazumdar Shaw
Author
Hyderabad, First Published Sep 11, 2020, 1:01 PM IST

భారతదేశంతో పాటు ఇతర దేశాలలో ఆస్ట్రాజెనెకా కరోనా వైరస్ వ్యాక్సిన్ ట్రయల్స్ పై  నిలిపివేతపై  బయోకాన్ చైర్‌ పర్సన్, ఎండీ కిరణ్ మజుందార్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాక్సిన్‌ను త్వరితంగా అభివృద్ధి చేయలేమని తేలిందని మజుందార్ షా తెలిపారు. సురక్షితమైన వ్యాక్సిన్‌ను వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో మాత్రమే ఆమోదం లభించే అవకాశం ఉందని ఆమె తెలిపారు.

"వైద్య, శాస్త్రీయ ప్రపంచంలో ప్రతిఒక్కరూ మాట్లాడుతున్న విషయం ఇదే అని అన్నారు. టీకా పరీక్షలను జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ప్రజలు దీనిని అర్థం చేసుకోవాలి.

also read హైదరాబాద్ నుండి దుబాయ్‌కి డైరెక్ట్ ఫ్లయిట్స్ .. వారానికి మూడు విమాన సర్వీసులు.. ...

వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నప్పుడు ప్రతి తీవ్రమైన ప్రతికూలతను పరిశోధించాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది  ఆరోగ్యకర వ్యక్తులపై టీకాలు వేస్తారు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి "అని కిరణ్ మజుందార్ అన్నారు.

ఆస్ట్రాజెనెకా కరోనావైరస్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను కొన్ని సమస్యల కారణంగా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆస్ట్రాజెనెకా బుధవారం ప్రకటించింది. దీంతో దేశంలో పరీక్షలకు అనుమతి పొందిన సీరం సంస్థ  డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) తాజా ఆదేశాల మేరకు పరీక్షలను నిలిపివేసింది.

క్లినికల్ ట్రయల్స్ లో  సమస్యల కారణంగా బ్రిటన్, భారతదేశంతో పాటు ఇతర దేశాలలో అంతరాయం ఏర్పడిన కారణంగా కిరణ్ మజుందార్  ఈ వ్యాఖ్యలు చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios