హైదరాబాద్, అక్టోబర్ 7, 2020:   నేషనల్ అవార్డు గెలుచుకున్న టెక్స్‌టైల్ అండ్ ఫ్యాషన్ డిజైనర్ గౌరాంగ్ షా ఇ-స్టోర్(ఆన్ లైన్ స్టోర్) ప్రారంభించినట్లు ప్రకటించారు. ఇ-స్టోర్ లో చేతితో నేసిన వస్త్రాలు పురుషులు, పిల్లల కోసం అందుబాటులో ఉన్నాయి.

పురుషుల కోసం www.men.gaurang.co, పిల్లల కోసం www. little.gaurang.co ఇ-స్టోర్ పోర్టల్ అందుబాటులో ఉంది. తన బ్రాండ్ ఈ ప్లాట్‌ఫామ్‌లో ప్రీమియం దుస్తులను అందిస్తుంది, ఇందుకోసం 800పైగా హస్తకళాకారుల చేనేత బృందం పని చేస్తుంది. లేటెస్ట్ , క్యాజువల్, ప్రత్యేక సందర్భాల దుస్తుల కోసం సింగిల్ -స్టాప్ ఫ్యాషన్ గమ్యస్థానంగా ఇ-స్టోర్ నిలుస్తుంది.

గౌరాంగ్ షా ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే కరోన మహమ్మారి కారణంగా గత కొన్ని నెలలుగా ఆన్‌లైన్‌ పై దృష్టి పెరిగింది. తమ అభిమాన డిజైనర్ దుస్తులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాటనికి ఆన్‌లైన్‌ ద్వారా అక్సెస్ చేయవచ్చు.

ఇ-స్టోర్‌లో అందించే పురుషుల కేటలాగ్ డిజైనర్ చేతితో నేసిన బండి జాకెట్లు, కుర్తాస్, షెర్వానీ కలెక్షన్స్, నవ తరం పురుషుల కోసం సాంప్రదాయ అల్లికల కలయిక దుస్తులను జాబితా చేస్తుంది. పురుషుల దుస్తులను విస్తరించడానికి ఇ-స్టోర్ ద్వారా వాటిని ప్రారంభించడానికి ఇది సరైన వేదిక అని నేను అనుకున్నాను అని గౌరాంగ్  అన్నారు.

also read ఎస్‌బి‌ఐ బ్యాంక్ నుండి నెలకు రూ.1 లక్ష సంపాదించే అవకాశం.. వెంటనే దరఖాస్తు చేసుకోండీ..

అలాగే  పురుషుల దుస్తులు విస్తృతమైన వస్త్ర కళలను, భారతీయ సంస్కృతిని కూడా ప్రతిబింబిస్తుంది. ప్రతి ఒక్క వస్త్రాలను చాలా నెలల పాటు జమ్దానీ చేనేత పద్ధతిని ఉపయోగించి వాటిని వారసత్వపుగా మారుస్తుంది. ఖాదీ, ముగా సిల్క్, టుస్సార్ సిల్క్, ఆర్గాన్జా, సిల్క్ వంటి నూలులను కలుపుతూ వివిధ అల్లికలు సృష్టించబడతాయి.

పిల్లలా కోసం లిటిల్ గౌరాంగ్ ద్వారా డిజైనర్ ఖాదీ, చేతితో నేసిన బట్టలు, 0-12 సంవత్సరాల పిల్లలకు బట్టల ప్రింట్లలో సహజ రంగుల శ్రేయస్సును అనుసంధానించే చేతితో నేసిన ఫ్యాషన్ లైన్‌ను పరిచయం చేస్తున్నారు. కేటలాగ్‌లోని ప్రతి డిజైన్ పిల్లల సౌలభ్యం, ఆరోగ్యాన్ని నొక్కి చెప్పే సున్నితమైన డిజైన్లతో మరింత ప్రాచుర్యం పొందింది.

జీవితం బాల్యంలోనే ప్రారంభమవుతుందని మేము నమ్ముతున్నాము. మా కలెక్షన్ భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి స్థానికంగా లభించే పదార్థాలతో తయారు చేయబడింది అని  ఆయన అన్నారు. ప్రతి వస్త్రం మా డిజైన్ సేకరణలో చేనేత రంగులు వేయడం, ముద్రణను చేర్చడానికి దేశవ్యాప్తంగా ఉన్న చేతివృత్తుల సహకారంతో చేతితో తయారు చేయబడింది.

“శిశువు చర్మాన్ని తాకిన ఏదైనా ఫాబ్రిక్ ముఖ్యమైనదని మేము హృదయపూర్వకంగా నమ్ముతున్నాము, ఎందుకంటే వారి చర్మం చాలా సున్నితమైనది. అందువల్ల, మా ఉత్పత్తులన్నీ హానికరమైన రసాయనాలు లేకుండా సహజ రంగులు, చేతితో నేసినవి ”  అని గౌరంగ్ హామీ ఇస్తున్నారు.

గౌరాంగ్ గురించి: గౌరాంగ్ షా ని చేనేత మాస్టర్ అని పిలుస్తారు, గౌరంగ్ సున్నితమైన హస్తకళాను రూపొందించడానికి కృషి చేస్తాడు. గౌరంగ్ అభిరుచి ఈ రోజు దేశవ్యాప్తంగా 800పైగా చేనేత కార్మికులు అతనితో కలిసి పనిచేయడానికి దారితీసింది.

కంజీవరం, ఖాదీ, ఉప్పడ, పైథాని, పటాన్ పటోలా, బనారసి, కోటా, మహేశ్వరి, బెంగాల్ చేనేత వంటి భారతీయ వస్త్ర కళలను పరిరక్షించాలన్న తన అభిరుచిని కొనసాగిస్తూ వాటిని దుస్తులలో ద్వారా తీసుకొస్తున్నారు.