డాక్టరు రీసెర్చ్ ఫెలోషిప్ కోసం పిహెచ్‌డి పూర్తి చేసిన వారి నుండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఎంపికైన సభ్యులకు స్టైఫండ్‌గా ప్రతి నెలా వారికి లక్ష రూపాయలు ఇస్తుంది.

ఫెలోషిప్ ప్రోగ్రాం చివరిలో పనితీరును అంచనా వేస్తారు, దాని ఆధారంగా వారికి 2 నుండి 5 లక్షల రూపాయల మొత్తం ఇవ్వబడుతుంది. ఎస్‌బిఐ ఈ ఫెలోషిప్ కార్యక్రమానికి ఆన్‌లైన్ ఎంట్రీ చివరి తేదీ అక్టోబర్ 8.

ఆన్‌లైన్ దరఖాస్తు హార్డ్ కాపీని 2020 అక్టోబర్ 15 లోగా ముంబైలోని కార్పొరేట్ కేంద్రనికి పంపించాలి. జూలై 31, 2020 నాటికి దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 40 సంవత్సరాలకు మించకూడదు. అభ్యర్థులు ఈ కార్యక్రమం కింద రెండేళ్ల ఒప్పందంలో ఉంటారు.

ఇందులో ఐదు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికలు జరుగుతాయి. ఇంటర్వ్యూ పూర్తి చేసిన వారికి కాల్ లెటర్ ఇమెయిల్ ద్వారా పంపబడుతుంది. అంతే కాకుండా ఎస్‌బి‌ఐ వెబ్‌సైట్‌లో కూడా అప్‌లోడ్ చేయబడుతుంది.

also read ఉద్యోగం మానేసార.. మీ పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తున్నారా.. అయితే ఎలా చేయండి.. ...

ఎంపికైన దరఖాస్తుదారులని కోల్‌కతాలోని స్టేట్ బ్యాంక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లీడర్‌షిప్‌కు పంపుతారు. అయితే అభ్యర్థికి బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటి, ఎకనామిక్స్ లేదా ఏదైనా సంబంధిత సబ్జెక్టులో పిహెచ్‌డి ఉండాలి.

అభ్యర్థికి మంచి విద్యా రికార్డు ఉండాలి. అభ్యర్థులు ఐఐఎం, ఐఐటి, ఐఎస్‌బి, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ లేదా వారి సమానమైన ఇనిస్టిట్యూషన్ లేదా కన్సల్టెన్సీలో బోధన / పరిశోధన పనులలో కనీసం 3 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి.

ఎలా దరఖాస్తు చేయాలి? 
అంతర్జాతీయ, జాతీయ సమావేశాలకు హాజరయ్యే ఖర్చులను ఎస్‌బిఐ భరిస్తుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి https://bank.sbi/careers లేదా https://www.sbi.co.in/careers లో రిజిస్టర్ చేసుకోవాలి.

దీని తరువాత, ఫోటో, సంతకాన్ని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. జనన ధృవీకరణ సర్టిఫికెట్, విద్యా అర్హత సర్టిఫికెట్, అనుభవ సర్టిఫికెట్, ఐడి ప్రూఫ్ వంటి పత్రాల కాపీని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేటప్పుడు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకి ఎంపికైనప్పుడు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకెళ్లాలి. అప్లికేషన్ ప్రింటౌట్‌తో పాటు అవసరమైన అన్ని సర్టిఫికెట్స్ స్వీయ ధృవీకృత కాపీని ఎస్‌బి‌ఐ ముంబై కార్పొరేట్ కార్యాలయానికి పంపాలి.