భారతదేశపు కొత్త బిలియనీర్.. ఎవరు ఈ దీపిందర్ గోయల్ ? అతని ఆస్తి విలువ ఎంతంటే ?
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో షేర్లు తాజాగా 4% పెరిగాయి. దీంతో జొమాటో మార్కెట్ క్యాప్ రూ. 1.9 లక్షల కోట్లు దాటింది. అలాగే దీపిందర్ గోయల్ ఆస్తి విలువ రూ. 8,000 కోట్లు దాటింది.
Zomato వ్యవస్థాపకుడు & CEO దీపిందర్ గోయల్ తాజాగా ఇండియాలోని అత్యంత సంపన్నులలో ఒకరిగా నిలిచారు. జొమాటో స్టాక్ గత సంవత్సరంలో భారీగా పెరిగిన తర్వాత ఆయన బిలియనీర్ల లిస్టులో చేరారు.
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో షేర్లు తాజాగా 4% పెరిగాయి. దీంతో జొమాటో మార్కెట్ క్యాప్ రూ. 1.9 లక్షల కోట్లు దాటింది. అలాగే దీపిందర్ గోయల్ ఆస్తి విలువ రూ. 8,000 కోట్లు దాటి.. 41 సంవత్సరాల వయస్సులో భారతదేశపు అత్యంత సంపన్న ప్రొఫెషనల్ మేనేజర్‌గా నిలిచారు. జొమాటోలో అతనికి 4.24% వాటా ఉంది. దాని విలువ 36.95 కోట్లు.
జొమాటో షేర్ ధర పెరగడానికి కంపెనీ బ్లింకిట్ డెలివరీ ప్లాట్‌ఫాం బలమైన పర్ఫార్మెన్స్ కారణంగా చెప్పవచ్చు. Blinkit స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ & జెప్టో వంటి ప్రత్యర్థులను అధిగమిస్తోంది ఇంకా ఊహించిన దాని కంటే ముందుగానే లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. Zomato ఫుడ్ డెలివరీ వ్యాపారం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని కూడా పెంచింది.
దీపింద గోయల్ ఎవరు?
దీపిందర్ గోయల్ పంజాబ్‌లోని ముక్త్‌సర్‌లో ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు. చండీగఢ్‌లోని DAV కాలేజ్ నుండి స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసారు. తరువాత 2001లో ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరారు. 2005లో మ్యాథ్స్ & కంప్యూటర్లలో బీటెక్ పట్టభద్రుడయ్యారు.
దీపిందర్ తన ఆలోచనతో ఇండియాలో ఫుడ్ డెలివరీ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చారు. రెస్టారెంట్లలో ఫుడ్ ఆర్డర్ చేయడానికి సహోద్యోగి కష్టపడడాన్ని చూసిన తర్వాత ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించాలనే ఆలోచనకు వచ్చారు. రెస్టారెంట్ల గురించి పూర్తి సమాచారంతో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ ప్రాముఖ్యతని గ్రహించి, తన సహోద్యోగి పంకజ్ చద్దాతో కలిసి 2008లో మొదటిసారి Foodiebay.comని ప్రారంభించారు. 2010లో Foodiebay.com Zomato.comగా రీబ్రాండ్ అయింది. తరువాత Zomato కంపెనీ దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. జోమాటో షేర్లు గణనీయంగా పెరగడంతో దీపిందర్ గోయల్ భారతదేశపు కొత్త బిలియనీర్‌లలో ఒకరిగా మారారు.