Asianet News TeluguAsianet News Telugu

పండగకి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. మూడు నెలల పాటు ఉచిత రేషన్ ..

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జూలై మొదటి తేదీ నుంచి అమల్లోకి రానుంది. అంటే జూలై నెల నుండే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన జీతాలు అందుతాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన డీఏ బకాయిలు చెల్లించనున్నారు.

DA Hike: Center gift before festivals DA increased by four percent
Author
First Published Sep 28, 2022, 4:19 PM IST

నేడు బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో ఈ నిర్ణయాలను వెల్లడించారు. దసరా పండుగకు ముందే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ కానుకను అందించింది. జూలై 2022 నుండి పెరిగిన డియర్‌నెస్ అలవెన్స్‌ను నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆమోదించింది. డియర్‌నెస్ అలవెన్స్‌లో 4 శాతం పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇప్పుడు కేంద్ర ఉద్యోగుల డీఏ 32% నుంచి 38%కి పెరిగింది.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జూలై మొదటి తేదీ నుంచి అమల్లోకి రానుంది. అంటే జూలై నెల నుండే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన జీతాలు అందుతాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన డీఏ బకాయిలు చెల్లించనున్నారు.

మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఉద్యోగుల డీఏను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు 1 జనవరి 2022 నుండి అమలు చేసింది. ప్రభుత్వం ఏటా రెండుసార్లు డీఏ పెంచడం గమనార్హం. 

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కేంద్ర ఉద్యోగులతో పాటు పెన్షనర్లు కూడా ప్రయోజనం పొందనున్నారు. కేంద్ర ఉద్యోగుల లాగానే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కూడా డీఏ పెంపు ప్రయోజనం అందుతుంది.  ఇప్పుడు పెన్షనర్ల డీఏ కూడా 38 శాతానికి పెరిగింది. ఉద్యోగి పెన్షన్ రూ.20,000 అయితే, డీఏ నాలుగు శాతం పెరిగిన తర్వాత ఇప్పుడు నెలకు వచ్చే పెన్షన్ మొత్తం ఎనిమిది వందల రూపాయలు పెరుగుతుంది.

ఉచిత రేషన్ పథకం
దీనితో పాటు, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై) కింద ఉచిత రేషన్ పంపిణీ కాలాన్ని కూడా ప్రభుత్వం మూడు నెలల పాటు పొడిగించింది. ప్రస్తుతం దేశంలో అమలవుతున్న ఉచిత రేషన్ పథకం ద్వారా దాదాపు 80 కోట్ల మంది పేదలు లబ్ధి పొందుతున్నారు. కరోనా పీరియడ్‌లో లాక్‌డౌన్‌ వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దీని వల్ల పేద వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున లబ్ధి పొందుతున్నారు.  

అంతేకాకుండా, దేశంలో రైల్వేల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం కూడా పెద్ద నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు .  దేశంలోని మూడు ప్రధాన స్టేషన్లు న్యూఢిల్లీ, ముంబై సిఎస్‌టి స్టేషన్, అహ్మదాబాద్ స్టేషన్లలో ప్రాథమిక మార్పుల కోసం ప్రభుత్వం పది వేల కోట్ల రూపాయలను ఆమోదించింది. దీంతో పాటు దేశంలో 199 స్టేషన్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios