ప్రపంచంలో అతిపెద్ద,  పాపులర్ క్రిప్టో కరెన్సీ అయిన  బిట్‌కాయిన్ ధర 64,600 డాలర్లకు చేరుకుంది. అంటే భారత రూపాయి ప్రకారం బిట్‌కాయిన్ ధర సుమారు రూ .48.5 లక్షలు, ఇది ఇప్పటివరకు ఉన్న అత్యధిక స్థాయి. జనవరి 4 న బిట్‌కాయిన్ ధర 27,734డాలర్లుగా ఉండగా,  ఫిబ్రవరి 9న బిట్‌కాయిన్ ధర 44,141 డాలర్ల వద్దకు చేరుకుంది.

మార్చి 17 న బిట్‌కాయిన్ ధర 55,927.77డాలర్లకు, ఏప్రిల్ 1న 60 వేల డాలర్లకు పైగా దాటింది. పెద్ద పెట్టుబడిదారులు, రిటైల్ పెట్టుబడిదారులు బిట్‌కాయిన్‌కు మారడం వల్ల దాని ధరల పెరుగుదలకు దారితీసింది. బ్లూమ్‌బెర్గ్ బిట్‌కాయిన్ (బిటిసి) నిపుణులు దీని ధర నాలుగు లక్షల డాలర్లకు చేరుకోగలదని, అంటే సుమారు రూ.2,98,64,140 అంచనా వేసింది.

బిట్‌కాయిన్ అంటే ఏమిటి?
బిట్‌కాయిన్  అనేది వర్చువల్ కరెన్సీ. ఇది 2009 సంవత్సరంలో ప్రారంభమైంది, ఇప్పుడు క్రమంగా బాగా ప్రాచుర్యం పొందింది. ఒక బిట్‌కాయిన్ ధర లక్షల రూపాయలకు సమానం. చెల్లింపుల కోసం క్రిప్టోగ్రఫీని ఉపయోగిస్తున్నందున దీనిని క్రిప్టోకరెన్సీ అని కూడా పిలుస్తారు. అంటే ఇప్పుడు ఈ కరెన్సీని ఫ్యూచర్ కరెన్సీ అని కూడా పిలుస్తారు.

also read కరోనా కాలంలో ఆర్థిక ఇబ్బందుల.. అయితే ఈ 3 మార్గాల్లో డబ్బు సంపాదించవచ్చు.. ...

లావాదేవీ ఎలా జరుగుతుంది?
బిట్‌కాయిన్ లావాదేవీల కోసం వినియోగదారుడు ప్రైవేట్ కీతో అనుసంధానించిన డిజిటల్ మార్గాల ద్వారా పేమెంట్ మెసేజ్ పంపాలి, ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కేంద్రీకృత నెట్‌వర్క్ ద్వారా ధృవీకరించబడుతుంది. దీని ద్వారా చేసే చెల్లింపులు  డెబిట్ లేదా క్రెడిట్ కార్డు  చెల్లింపులకు భిన్నంగా ఉంటుంది. బిట్‌కాయిన్ అనేది వర్చువల్ కరెన్సీ, దీనిని ఆన్‌లైన్ లావాదేవీలకు మాత్రమే ఉపయోగించబడుతుంది. 

 2018లో ఆర్‌బి‌ఐ నిషేధం 
 2018 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఒక సర్క్యులర్ జారీ చేస్తూ క్రిప్టోకరెన్సీని ఇండియాలో  నిషేధించింది. కానీ మార్చి 2020లో క్రిప్టోకరెన్సీ అని కూడా పిలువబడే ఈ వర్చువల్ కరెన్సీ ద్వారా వాణిజ్యాన్ని సుప్రీంకోర్టు ఆమోదించింది. కోర్టు ఉత్తర్వులను అనుసరించి లావాదేవీలు బిట్‌కాయిన్ వంటి వర్చువల్ కరెన్సీలలో చట్టబద్ధంగా చేయవచ్చు.

 2019లో భారతదేశంలో క్రిప్టోకరెన్సీల కొనుగోలు, విక్రయించే వారికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించాలని ప్రతిపాదించింది. ఒక ముసాయిదా ప్రకారం క్రిప్టోకరెన్సీని సృష్టించడం, విక్రయించడం, క్రిప్టోకరెన్సీని దాచడం, ఎవరికైనా పంపడం లేదా క్రిప్టోకరెన్సీలో ఏదైనా ఒప్పందం చేసుకునే వారందరూ  ఈ కేసుల్లో దోషులుగా తేలితే వారికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష  ఉంటుంది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ నిషేధాన్ని ఎత్తివేసింది.