గత ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బ తిన్న సంగతి మీకు తెలిసిందే. అయితే ఒకవైపు చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించగా, మరోవైపు ఉద్యోగుల జీతాలలో కోతలు  కూడా విధించాయి.

ప్రస్తుతం ప్రభుత్వం చేసిన కఠినమైన నియమాలను పాటిస్తూ సామాజిక దూరం, మస్కూలు ధరించడం తప్పనిసరిగా మారింది. సాధారణ ఉద్యోగుల ఆదాయం ప్రభావితమైన వారిలో చాలా మంది ఉన్నారు.

ఇలాంటి పరిస్థితిలో ప్రజలు వారి ఖర్చులను కూడా తగ్గించుకోవాల్సి వచ్చింది. అయితే అత్యవసర పరిస్థితులలో మీకు డబ్బు అవసరమైతే   వాటిని పొందడానికి కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి. 

మీరు ముద్రా లోన్‌ ద్వారా సులభంగా డబ్బు పొందవచ్చు. ఎలా అంటే మీరు ఏదైనా పని ప్రారంభించాలనుకుంటే ఇందుకు ముద్ర లోన్ తీసుకోవచ్చు. ఈ పథకం కింద రుణగ్రహీతలను మూడు తరగతులుగా విభజించారు. వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారు అలాగే భవిష్యత్తులో తదుపరి  స్థాయికి వెళ్లాలనుకునే వారిని ఇందులో విభజించారు. ఈ మూడు విభాగాల అవసరాలను తీర్చడానికి ముద్రా బ్యాంక్ మూడు రుణలను ప్రవేశపెట్టింది.  

షిషు : దీని ద్వారా 50 వేల రూపాయల వరకు రుణాలను పొందవచ్చు
కిషోర్  : దీని ద్వారా 50 వేల నుండి ఐదు లక్షల రూపాయల వరకు రుణాలను పొందవచ్చు
తరుణ్ : దీని ద్వారా 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు రుణాలను పొందవచ్చు

also read ఇన్ఫోసిస్ లాభాల జోరు.. డిమాండ్‌కు అనుగుణంగా కొత్తగా 26వేల నియామకాలు.. ...

పిఎఫ్ ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవచ్చు,
మీరు ఏదైన ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి అయితే మీ పిఎఫ్ ఖాతా డబ్బుతో  మీ అవసరాన్ని తీర్చుకొవచ్చు.  మీరు  ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే మీరు పిఎఫ్ ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవచ్చు. మీకు అతవసరం ఉన్నప్పుడూ మాత్రమే పిఎఫ్ డబ్బును తీసుకోవచ్చు. అయితే  దీని కింద మీరు మీ పిఎఫ్ ఖాతా నుండి 75 శాతం డబ్బును మాత్రమే ఉపసంహరించుకోవచ్చు.

బంగారు రుణాలు
భారతదేశంలోని  అధిక జనాభా ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురుకొంటుంది. ఈ కారణంగా బంగారు రుణాల డిమాండ్ కూడా పెరిగింది. బంగారు ఆభరణాలను బ్యాంకులో ఉంచడం ద్వారా వాటి విలువలో 90 శాతం వరకు రుణం తీసుకోవచ్చు. అయితే ఇంతకుముందు 75 శాతం వరకు మాత్రమే రుణాలు అందించేది. లోన్ తీసుకోవడానికి బంగారు రుణం సురక్షితమైన మార్గం, ఎందుకంటే మీరు  సురక్షితంగా పెట్టిన బంగారు ఆభరణాలకు బదులుగా ఈ రుణం పొందుతారు.

వ్యక్తిగత  రుణం 
మీ క్రెడిట్ స్కోరు బాగుంటే, మీరు కూడా వ్యక్తిగత రుణం పొందవచ్చు. ఈ వ్యక్తిగత  రుణం మీరు క్రెడిట్ కార్డుపై తీసుకోవచ్చు లేదా మీరు నేరుగా బ్యాంకు నుండి కూడా  రుణం తీసుకోవచ్చు. అయితే రుణం క్రెడిట్ కార్డుపై సులభంగా లభిస్తుంది.