Asianet News TeluguAsianet News Telugu

7 నెలల కనిష్ట స్థాయికి క్రూడాయిల్.. ఇక్కడ లీటర్ పెట్రోల్ కేవలం రూ. 84కే..

గత కొన్ని రోజులుగా క్రూడాయిల్ ధర స్థిరంగా క్షీణిస్తోంది,  ఇంకా 7 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. మరోవైపు క్రూడాయిల్ ధర తగ్గడంతో దేశీయ మార్కెట్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలన్న డిమాండ్‌ పెరిగింది.

Crude oil reached 7 months  low level where did petrol and diesel rate reach after falling?
Author
First Published Sep 9, 2022, 8:48 AM IST

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలో మార్పుల మధ్య భారతీయ చమురు కంపెనీలు శుక్రవారం పెట్రోల్ -డీజిల్ కొత్త ధరలను విడుదల చేశాయి. అయితే చమురు ధరలు చాలా కాలంగా స్థిరంగా ఉన్నాయి, నేటికీ ఎటువంటి మార్పు లేదు. దీంతో శుక్రవారం ఉదయం కూడా చమురు ధరలపై ప్రజలకు ఊరట లభించింది.

గత కొన్ని రోజులుగా క్రూడాయిల్ ధర స్థిరంగా క్షీణిస్తోంది,  ఇంకా 7 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. మరోవైపు క్రూడాయిల్ ధర తగ్గడంతో దేశీయ మార్కెట్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలన్న డిమాండ్‌ పెరిగింది. రానున్న కాలంలో చమురు కంపెనీలు ఇంధన ధరలను తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అంతకుముందు మే నెలలో  ప్రభుత్వం పెట్రోల్ - డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో సామాన్యులకు ఇంధన ధరలో ఊరట లభించింది. మూడున్నర నెలల క్రితం పెట్రోల్ డీజిల్ ధరలో ఈ మార్పు జరిగింది. ఆ తర్వాత మహారాష్ట్ర, మేఘాలయలో కూడా చమురు ధర మారింది. మహారాష్ట్రలో షిండే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యాట్‌ని తగ్గించడం వల్ల పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింది.

క్రూడ్ ఆయిల్ తాజా రేటు
క్రూడ్ ఆయిల్ ధర పతనం కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు 82.91 డాలర్లకు చేరుకుంది.   బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $ 88.62 వద్ద కనిపించింది. క్రూడాయిల్ ప్రస్తుతం 7 నెలల కనిష్ట స్థాయి వద్ద నడుస్తోంది.

నగరం & చమురు ధర (సెప్టెంబర్ 8న పెట్రోలు-డీజిల్ ధర)
–ఢిల్లీ పెట్రోలు ధర రూ. 96.72 & డీజిల్ ధర రూ. 89.62 లీటర్‌కు
–ముంబై పెట్రోల్ ధర రూ. 111.35 & డీజిల్ ధర రూ. 97.28 లీటర్‌కు
–చెన్నై పెట్రోలు ధర రూ. 102.63 & డీజిల్ ధర రూ. 94.24  
- కోల్ కత్తా పెట్రోలు లీటరుకు రూ.106.03, డీజిల్ ధర రూ.92.76

- నోయిడాలో పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.96
-లక్నోలో పెట్రోల్  ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76
-జైపూర్‌లో పెట్రోల్ ధర రూ.108.48, డీజిల్ ధర రూ.93.72
-తిరువనంతపురంలో పెట్రోల్ ధర రూ.107.71, డీజిల్ ధర రూ.96.72 లీటరుకు 
-పాట్నాలో పెట్రోల్ ధర రూ. 107.24, డీజిల్ ధర రూ. 94.04
- గురుగ్రామ్‌లో పెట్రోల్ ధర రూ. 97.18, డీజిల్ ధర  రూ. 90.05
- బెంగళూరులో పెట్రోల్‌ ధర రూ.101.94, డీజిల్‌ ధర  రూ.87.89
-భువనేశ్వర్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.103.19, డీజిల్‌ ధర  రూ.94.76
-చండీగఢ్‌లో పెట్రోల్‌ ధర రూ.96.20, డీజిల్‌  ధర రూ.84.26
-హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.109.66, డీజిల్‌ ధర రూ.97.82
  - పోర్ట్‌ బ్లెయిర్ లో పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర రూ.79.74

మీ నగరంలోని నేటి ఇంధన ధరలను ఎలా చెక్ చేయాలంటే ?
పెట్రోల్  డీజిల్  తాజా ధరలను చెక్ చేయడానికి, చమురు కంపెనీలు ఎస్‌ఎం‌ఎస్ ద్వారా తెలుసుకునే సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ధరలను చెక్ చేయడానికి, ఇండియన్ ఆయిల్ (IOC) కస్టమర్లు RSP<డీలర్ కోడ్> అని టాప్ చేసి 9224992249కి, HPCL కస్టమర్లు HPPRICE <డీలర్ కోడ్> అని  టైప్ చేసి 9222201122కి, BPCL కస్టమర్లు RSP<డీలర్ కోడ్> అని టైప్ చేసి 9223112222కి SMS చేయండి.

Follow Us:
Download App:
  • android
  • ios