రిసెషన్ ఎఫెక్ట్ : కుదుపుల మధ్య డైమండ్స్, జెమ్స్ జ్యువెలరీ ఇండస్ట్రీ

ఆర్థిక మాంద్యం ప్రభావం సూరత్ నగర పరిధిలోని వజ్రాల పరిశ్రమపై గణనీయంగా పడుతోంది.భారత ఆర్థిక వ్యవస్థకు కీలక రంగమైన జెమ్స్ అండ్ జ్యూయల్లరీ ఇండస్ట్రీ తీవ్ర కుదుపులకు లోనవుతోంది. లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. 

Crisis in diamond industry deepens

సూరత్: తళుక్కుమనే వజ్రాలు మెరవడం మానేశాయి. జెమ్స్ అండ్ జ్యూయల్లరీ కళ తప్పాయి. ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్ పాలిషింగ్ హబ్ అయిన సూరత్‌‌లో లక్షల మంది కార్మికులు రోడ్డున పడుతున్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు కీలక రంగమైన జెమ్స్ అండ్ జ్యూయల్లరీ ఇండస్ట్రీ తీవ్ర కుదుపులకు లోనవుతోంది.

డైమండ్ మొఘల్‌‌గా పేరు పొందిన నీరవ్‌ మోదీ రూ.14 వేల కోట్ల స్కామ్ తర్వాత ఈ ఇండస్ట్రీ పూర్తిగా పడి పోయింది. ఇక అప్పుడు మొదలైన పతనం, స్లోడౌన్ ఎఫెక్ట్‌‌తో మరింత కుదేలైంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి, తొలి ఏడు నెలల్లో భారతదేశానికి దిగుమతవుతున్న ముడి వజ్రాలు 22 శాతం వరకు తగ్గిపోయాయి.

also read ఎయిర్ ఇండియాపై కేంద్రం షాకింగ్ నిర్ణయం

పాలిష్డ్‌ డైమండ్ ఎగుమతులు 18 శాతం వరకు తగ్గినట్టు జెమ్స్ అండ్ జ్యూయల్లరీ ఎక్స్‌‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ డేటా పేర్కొంది. సూరత్‌‌లో ఆభరణాల పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులు తగ్గిపోయారు. ప్రతిభావంతులైన కళాకారులకూ ఆదాయాలు 70 శాతానికి పైగా తగ్గిపోయాయని లోకల్ ఇండస్ట్రీ ఛాంబర్స్ ప్రకటించాయి. 

40 ఏళ్లకు పైగా తన కెరీర్‌‌‌‌లో డైమండ్ ఇండస్ట్రీలో ఇలాంటి మందగమనాలను తాను చాలా చూశానని సూరత్ డైమండ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాబుభాయ్ కథిరియా చెప్పారు. 2008లో కూడా తీవ్ర సంక్షోభం నెలకొందని, కానీ రెండు నెలల్లోనే పరిస్థితులన్నీ సాధారణమయ్యాయని చెప్పారు. ఈసారి మాత్రం మందగమనం ఏడు నుంచి ఎనిమిది నెలలు అవుతున్నా, ఇంకా కొనసాగుతూనే ఉందని తెలిపారు. ఇదే తమ వ్యాపారాలను దెబ్బకొడుతోందని పేర్కొ న్నారు.

Crisis in diamond industry deepens

ఇండియన్ జెమ్స్ అండ్ జ్యూ యల్లరీ ఇండస్ట్రీలో 50 లక్షల మంది వర్కర్లు పని చేస్తున్నారు. ఇండియా జీడీపీలో ఏడు శాతం ఈ రంగానిదే. 15 శాతం ఎగుమతులు జెమ్స్ అండ్ జ్యూయల్లరీకి చెందినవే. ప్రస్తుత మందగమనం ప్రభావం‌తో కార్ల తయారీదారుల నుంచి రిటైలర్ల వరకు ఎవరికీ ఫండ్స్ దొరకడం లేదు. 

జెమ్స్ అండ్ జ్యూయల్లరీ పరిస్థితి అయితే మరీ ఘోరం. నీరవ్ మోడీ పీఎన్‌బీని రూ.14 వేల కోట్లకు ముంచి, విదేశాలకు చెక్కేసిన తర్వాత, చాలా బ్యాంక్‌‌లు జ్యూయల్లర్స్‌‌కు డబ్బులు ఇవ్వడం మానేశాయి. ఈ రంగానికి దొరికే అప్పులు 2018 మార్చి నుంచి అక్టోబర్ వరకు 18 శాతం మేర పడిపోయాయి. డైమండ్ ఇండస్ట్రీకి తాము రుణాలివ్వమని చాలా బ్యాంక్‌‌లు కూడా తేల్చి చెబుతున్నాయని బీ. విరానీ అండ్ కో సెకండ్ జనరేషన్ డైరెక్టర్ చిరాగ్ విరానీ చెప్పారు. 

also read ద్విచక్ర వాహన తయారీలోకి ప్రవేశించడం పొరపాటే: ఆనంద్ మహీంద్రా

ప్రపంచంలో గనుల నుంచి వెలికితీసిన ప్రతి 15 ముడి వజ్రాల్లో 14 వజ్రాలకు సూరత్ పరిశ్రమే సాన పెడుతోంది. ప్రముఖ ప్రొడ్యూసర్లుగా పేరు ఉన్న డీ బీర్స్, అల్రోసా పీజేఎస్‌ సీ వంటి సంస్థలు కూడా ఇక్కడే సాన పెట్టుకుంటున్నాయి. వాణిజ్య నగరంగా పేరున్న ముంబై నుంచి మూడున్నర గంటల సమయంలోనే సూరత్‌ చేరుకోవచ్చు. సూరత్‌ జెమ్స్ అండ్ జ్యూయల్లరీకే కాక, టెక్స్‌‌టైల్, రియల్ ఎస్టేట్ రంగాలకూ పేరొందింది. 

సూరత్ నగరంలోని జెమ్స్ అండ్ జ్యూయల్లరీ రంగంలో 10 లక్షల నుంచి 15 లక్షల మంది పనిచేస్తున్నారు. చాలా మంది వర్కర్లు ఈ నగరానికి తరలి వెళ్లి, జెమ్స్ అండ్ జ్యూయల్లరీ ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉంటారు. చాలా మంది స్కిల్డ్ ఆర్టిజన్స్ (నైపుణ్య వంతులైన కళాకారులు) ఇక్కడ ఉన్నారు. చిన్న, పెద్ద యూనిట్లను కలుపుకుంటే మొత్తంగా ఐదు వేల మంది వరకు ఇక్కడ ఉంటాయి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios