మహీంద్రా కంపెనీ ద్విచక్ర వాహనాల తయారీలో దశాబ్దం క్రితం మహీంద్రా బైక్స్ ప్రవేశపెట్టడం పొరపాటు అని భారత ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారులలో ఒకరైన మహీంద్రా & మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అంగీకరించారు. 2008లో కైనెటిక్ మోటార్ కంపెనీని కొనుగోలు చేసిన తరువాత మహీంద్రా గ్రూప్ ద్విచక్ర వాహన సెగ్మెంట్ లోకి ప్రవేశించింది.

మహీంద్రా కంపెనీ టూ వీలర్స్ బైక్స్ పోర్ట్‌ఫోలియోలో మహీంద్రా సెంచూరో, మహీంద్రా పాంటెరో, మహీంద్రా స్టాలియో వంటి కొన్ని మంచి ఉత్పత్తులు ఉన్నాయి. ద్విచక్ర వాహన విభాగంలో అగ్రగామిగా  హీరో మోటోకార్ప్, హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా, అలాగే బజాజ్ ఆటో ఆధిపత్యం దెబ్బకు కంపెనీ విఫలమైంది.  

also read సమన్వయకర్త.. సంస్కరణల అభిలాషి.. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

2018-19 ఆర్థిక సంవత్సరంలో మహీంద్రా బైక్స్ కేవలం 4,000 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇది ఏడాది క్రితంతో పోల్చితే 73 శాతం క్షీణించింది. అదే ఆర్థిక సంవత్సరంలో (2018-19) సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారులు (సియామ్) విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశీయ ద్విచక్ర వాహనాల మార్కెట్ 2.12 కోట్లకు పైగా ఉంది.


"మా కల ఏంటో మాకు తెలుసు కాని అది ఎలా నెరవేర్చుకోవాలి అనే దగ్గర ఫైల్ అయ్యం. బైక్ విక్రయాల వైపుకు వెళ్ళకుండ ఉండాల్సింది, బిజినెస్ అనేది ఒక సాహసం లాంటిది" అని ఆనంద్ మహీంద్రా బ్రిటిష్ ఎయిర్లైన్స్ వర్జిన్ అట్లాంటిక్  నిర్వహించిన కార్యక్రమంలో అన్నారు. "

also read కోట్లకు పైగా జీతాలు తిసుకుంటున్న వారు ఎవరో తెలుసా...?


మహీంద్రా టూ వీలర్స్ ప్రస్తుతం సెంచూరో , కమ్యూటర్ మోటార్ సైకిల్ విభాగం వేరియంట్లను కలిగి ఉంది. అలాగే 300 సిసి  ప్రీమియం బైక్స్ విభాగంలో మహీంద్రా మోజో ఉంది. కొత్త జావా బైక్స్ మూడు మోడళ్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు మంచి పోటీదారిగా ఉంది. ఈ బైక్స్ నెలవారీ అమ్మకాలు 65,000-70,000 మధ్య ఉంటుంది.

జావా బైక్‌లపై స్పందన చాలా ఉత్సాహంగా ఉన్నప్పటికీ సంస్థ ఇంకా ఉత్పత్తి, అమ్మకాలను వెల్లడించలేదు. జావా బ్రాండ్ తిరిగి ప్రారంభించిన ఒక సంవత్సరం తరువాత కూడా కొత్త జావా బైకులను వినియోగదారులకు డెలివరీ చేయడానికి నెలల సమయం పడుతుంది. క్లాసిక్ లెజెండ్స్ పోర్ట్‌ఫోలియో కింద మరో ఐకానిక్ బ్రిటిష్ బైక్ ను తిరిగి ప్రవేశపెట్టాలని కంపెనీ ఆలోచిస్తుందని అన్నారు.