ఉచిత వై-ఫై పొందడానికి మీరు ఏం చేస్తారు..?  ఒక జంట 18 సంవత్సరాల పాటు ఉచిత వైఫై పొందడానికి వారి కుమార్తెకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ పేరునే నామకరణం చేసి పెట్టారు. దీంతో వారికి ఉచిత వై-ఫై కనెక్షన్ లభించింది. ఈ సంఘటన స్విట్జర్లాండ్ లో చోటు చేసుకుంది. 

 సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో ట్విఫై అనే స్విస్ స్టార్ట్-అప్ సంస్థ ఒక ప్రకటన చేసింది, ఇందులో  కంపెనీ పేరు కలిసి వచ్చేలా  వారి కుమార్తెకు లేదా కూతురికి పేరు పెట్టిన ఎవరికైనా 18 సంవత్సరాల పాటు ఉచిత వై-ఫైని అందిస్తామంటూ తెలిపింది.

ఒకవేళ కుమార్తె అయితే ట్విఫియా, కుమారుడు అయితే ట్విఫియా పేర్లను కూడా సూచించింది. అమ్మాయి/అబ్బాయి ఫొటో, బర్త్ సర్టిఫికెట్ అప్‌లోడ్ చేస్తే నిర్ధారించుకున్న తర్వాత ఉచిత వై-ఫై కనెక్షన్ ఇస్తామని పేర్కొంది.

also read న్యూయార్క్ దేశంతో పోల్చితే భారతీయులు ఆహారం, పానీయాలపై ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా ? ...

ఈ సందర్భంగా ఆ పాప తల్లిదండ్రులు మాట్లాడుతూ వై-ఫై కోసం ఖర్చు చేసే డబ్బును తమ కుమార్తె కోసం బ్యాంకులో పొదుపు చేస్తామని  వారు చెప్పారు. ఆమె పెద్దయ్యాక ఆ డబ్బుతో  కారు కొనడానికి ఉపయోగీస్తామని లేదా ఆమె పెద్దయ్యాక మరో దానికి ఉపయోగించుకోవచ్చిన పేర్కొన్నారు.

"నేను దాని గురించి ఎక్కువసేపు ఆలోచించాను, నిజానికి కుమార్తెకు ట్విఫియా అని పేరు పెట్టడం మొదట కొంచెం ఇబ్బందిగానే అనిపించిందని, ఉచిత వై-ఫై కోసం పేరు పెట్టడం భవిష్యత్తులో వచ్చే ఆరోపణలు భరించడం కష్టమవుతుందని వారు చెప్పారు. 

"మన చుట్టూ ఉన్నవారికి మేము అనామకంగా ఉండాలని కోరుకుంటున్నాము, ఎందుకంటే మనల్ని మనం సమర్థించుకోవాలనుకోవడం లేదు. ఎందుకంటే మా పిల్లల పేరును వై-ఫై కోసం అమ్మినట్లు ఆరోపణలు ఎదురుకోవడం మాకు చాలా కష్టమవుతాయి. ఇందుకు మేము కొంచెం సిగ్గుపడుతున్నాము" అని వారు చెప్పారు.

ట్విఫి కంపెనీ సీఈవో ఫిలిప్ ఫోష్ మాట్లాడుతూ తమ కంపెనీ మూతపడినా చిన్నారి తల్లిదండ్రులకు మాత్రం ఉచితంగా ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తామని, అది గౌరవానికి సంబంధించిన విషయం అని అన్నారు. అయితే  కొత్త జంటలకు ఈ ఆఫర్ ఇంకా అందుబాటులోనే ఉందని ఫిలిప్ ఫోష్ పేర్కొన్నారు.