భారతీయులకు ఆహారం, పానీయలు అంటే చాలా ఇష్టం. భారతీయుల ఆహారం, పానీయాల ఖర్చులను న్యూయార్క్‌తో పోల్చితే ఆశ్చర్యకరమైన ఫలితాలను ఇచ్చింది. సగటు భారతీయులు రోజువారీ ఆదాయంలో 3.5 శాతం ప్రతిరోజూ ఫుడ్ పై ఖర్చు చేస్తారు.

మరోవైపు న్యూయార్క్ పౌరులు తమ రోజువారీ ఆదాయంలో 0.6 శాతం మాత్రమే ఫుడ్ కోసం ఖర్చు చేస్తారు, ఇది భారతీయుల కంటే చాలా తక్కువ. ఐక్యరాజ్యసమితి (యుఎన్) ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎఫ్‌పి) శుక్రవారం విడుదల చేసిన ఒక నివేదికలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. 

నివేదిక ప్రకారం అత్యంత ఖరీదైన ఫుడ్ దక్షిణ సూడాన్‌లో ఉంది, ఇక్కడ ప్రజలు తమ రోజువారీ ఆదాయంలో 186 శాతం నిత్యావసర పదార్థాల కోసం ఖర్చు చేస్తారు. ఆహార ఖర్చుల విషయంలో ప్రపంచంలోని 36 దేశాల జాబితాలో భారత్ 28వ స్థానంలో ఉంది. 

మొదటి 20 స్థానాల్లో ఆఫ్రికా 17వ స్థానంలో ఉందని నివేదిక వెల్లడించింది. ఈ దేశాలలో చాలా ఆహార పదార్థాలు బయటి నుండి దిగుమతి అవుతున్నాయని, ఇది ప్రపంచంలో ఆర్థికంగా బలహీనంగా ఉందని పేర్కొంది. ఈ కారణంగా ఈ దేశాలలో ఆకలి వంటి సమస్యలు పెరుగుతున్నాయి. కార్మికులు రెండుసార్లు భోజనం చేయడం కూడా కష్టమవుతుంది. 

also read ఎటిఎంలో నకిలీ నోట్ వచ్చిందా? అయితే వెంటనే ఏం చేయాలో తెలుసుకోండి.. ...

వాతావరణ మార్పులు ఇబ్బందులను పెంచుతుంది: 
అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలలో నివసించే ప్రజలు తమ రోజువారీ ఆదాయాన్ని ఆహారం కోసం ఎలా ఖర్చు చేస్తారు అనే దానిపై భారీ అసమానతలు ఉన్నాయని నివేదిక పేర్కొంది.  

ప్రజలు జీవనోపాధి కోసం వ్యవసాయం మీద ఆధారపడిన దేశాలలో వాతావరణ మార్పుల వల్ల దిగుబడి తగ్గుతోంది. అదే సమయంలో ప్రజలు కుటుంబాన్ని పోషించడానికి ధాన్యాలు, ఇతర ఆహార పదార్థాలను కొనలేక పోతున్నారు.

ఇప్పుడు కరోనా వైరస్ వల్ల పెరుగుతున్న నిరుద్యోగం, ఆర్థిక మందగమనం, వ్యాపారాల స్తబ్దత కారణంగా ప్రజలు పోషకమైన ఆహారాన్ని పొందడం కష్టమవుతుంది అని వెల్లడించారు.