Asianet News TeluguAsianet News Telugu

వజ్రాలకు కరోనా వైరస్...వేల కోట్ల నష్టం!!

చైనాలో కరోనా వైరస్ ప్రభావం పుణ్యమా? అని హాంకాంగ్ నుంచి వెళ్లే విమాన సర్వీసులు రద్దు చేశారు. దీని ప్రభావం సూరత్ వజ్రాల వ్యాపారులపైనే పడుతున్నది. హాంకాంగ్ బిజినెస్ అంతా బంగారం కేంద్రంగా సాగుతుంది. సాన బెట్టిన వజ్రాలను సూరత్ నుంచే ఇక్కడకు ఎగుమతి చేస్తారు. వచ్చేనెలలో నిర్వహించ తలపెట్టిన ఎగ్జిబిషన్.. కరోనా వల్ల రద్దయినట్లు సమాచారం. అదే జరిగితే వజ్రాల పరిశ్రమకు రూ.8000 కోట్లు నష్టం వాటిల్లినట్లేనంటున్నారు.
 

Coronavirus: Surat diamond industry stares at Rs 8,000 cr loss
Author
Hyderabad, First Published Feb 6, 2020, 10:13 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

సూరత్: సూరత్‌ వజ్రాల పరిశ్రమ రాబోయే రెండు నెలల్లో దాదాపు రూ.8,000 కోట్ల నష్టాలను ఎదుర్కొనే ప్రమాదం ఉందనిపిస్తున్నది. ఇందుకు కారణం కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో హాంకాంగ్‌లో ప్రకటించిన అత్యవసర పరిస్థితే. సూరత్‌ డైమండ్‌ ఇండస్ట్రీ నుంచి పెద్ద మొత్తంలో ఎగుమతులు జరిగేవి హాంకాంగ్‌కే మరి.

చైనాలో విజృంభించిన కరోనా వైరస్‌.. హాంకాంగ్‌కు వ్యాపించింది. ఈ వైరస్‌ కారణంగా హాంగ్‌కాంగ్‌లో అత్యవసర పరిస్థితి విధించారు. ప్రజలు బయటకు రాకపోవడం, అక్కడి సంస్థలు ఇంటి నుంచే పని చేయాలంటుండటంతో వీధులు బోసిపోతున్నాయి. ఫలితంగా అన్ని వ్యాపారాలపైనా ఈ ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. 

also read టాటా సన్స్’కు ఎయిరిండియా? సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి బిడ్?

మార్చి మొదటివారం వరకు స్కూళ్లు, కాలేజీలు మూసివేశారు అధికారులు. ప్రధానంగా ఇక్కడికి వచ్చే పర్యాటకులకు బ్రేక్‌ పడగా, వారి షాపింగ్‌ ఆదాయం దూరమైపోయింది. ఇప్పటికే మార్చి మొదటి వారం వరకు పాఠశాలలు, కళాశాలలకు హాంకాంగ్‌ సర్కారు సెలవులను ప్రకటించింది. దీంతో యువత సైతం ఇండ్లకే పరిమితం కావాల్సి వస్తున్నది. ఇది వాలెంటైన్స్‌ డే (ఫిబ్రవరి 14) అమ్మకాలను దెబ్బ తీస్తున్నది.

ఏటా హాంకాంగ్‌కు సూరత్‌ నుంచి సుమారు రూ.50వేల కోట్ల విలువైన సానబెట్టిన వజ్రాలు ఎగుమతి అవుతాయని రత్నాలు, ఆభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ప్రాంతీయ చైర్మన్‌ దినేశ్‌ నవదియా తెలిపారు. సూరత్‌ వజ్రాల పరిశ్రమ మొత్తం ఎగుమతుల్లో ఇది 37 శాతమని చెప్పారు. కరోనా వైరస్‌ వల్ల హాంకాంగ్‌లో నెల రోజులు సెలవులను ఇవ్వడంతోఅక్కడి గుజరాత్‌ ట్రేడర్ల కార్యాలయ సిబ్బందీ ఇప్పుడు భారత్‌కు వస్తున్నారన్నారు. 

ఈ విపత్కర పరిస్థితులు చక్కబడకపోతే సూరత్‌ డైమండ్‌ ఇండస్ట్రీకి చాలా పెద్ద ప్రమాదమని రత్నాలు, ఆభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ప్రాంతీయ చైర్మన్‌ దినేశ్‌ నవదియా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి, మార్చి నెలలకు గాను రూ.8,000 కోట్ల నష్టాలు వస్తాయని అంచనా వేశారు. 

Coronavirus: Surat diamond industry stares at Rs 8,000 cr loss

దేశంలోకి దిగుమతయ్యే ముడి వజ్రాల్లో 99 శాతం వజ్రాలను సూరత్‌లోని సంస్థలే సానబెడుతున్నాయి. హాంకాంగ్‌ మార్కెట్‌ మీదుగానే సూరత్‌ సానబెట్టిన వజ్రాలు ప్రపంచ మార్కెట్‌కు వెళ్తాయని, అందుకే ఇప్పుడా దేశ ఎమర్జన్సీ మమ్మల్నీ వణికిస్తోందని వజ్రాల వ్యాపారి ప్రవీణ్‌ నానావతీ అన్నారు.హాంకాంగ్‌లో మేజర్ బిజినెస్ అంతా బంగారం మీదే జరుగుతుంటుంది. ఆ బంగారం సూరత్  నుంచే ఎగుమతవుతుంది. మార్చి నెలలో సూరత్‌ వ్యాపారులు రూ.8000 కోట్లతో హాంకాంగ్‌లో జువెల్లరీ ఎగ్జిబిషన్ కోసం ఏర్పాట్లు చేశారు. 

ఆ ఎగ్జిబిషన్ రద్దయినట్లు తమకు సమాచారం అందిందని వ్యాపారులు అంటున్నారు. ప్రతి ఏటా రూ .50 వేల కోట్ల విలువైన వజ్రాలు సూరత్ నుండి హాంకాంగ్‌కు ఎగుమతి అవుతున్నాయి. హాంకాంగ్‌లో సూరత్ బంగారం బిజినెస్ 37శాతం జరుగుతుంది. పరిస్థితి మెరుగుపడకపోతే, ఇది సూరత్ వజ్రాల పరిశ్రమపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. 

“కరోనా వైరస్ భయం కారణంగా హాంకాంగ్‌లో అంతర్జాతీయ ప్రదర్శన నిలిపివేయబడుతుందని మాకు సమాచారం అందింది. మెగా ఈవెంట్‌లో మేము భారీ మొత్తంలో వజ్రాలను విక్రయించాలని ప్రణాళికలు వేసుకున్నాం’ అని గోల్డ్ బిజినెస్ ఎనలిస్ట్, వ్యాపారి నానావతి అన్నారు. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టకపోతే సూరత్ వజ్రాల వ్యాపారంలో నష్టాలు వేల కోట్లకు చేరుతాయని చెప్పారు. 

also read ఫేస్‌బుక్ సీఓఓ నిశ్చితార్థం.. ఐదేళ్ల విరామం తర్వాత నవ్య జీవితంలోకి..

సూరత్ నుంచి ఎగుమతి అయ్యే బంగారం ఆధారంగా హాంకాంగ్‌లో ఆర్డర్లు పెరుగుతుంటాయి. దీంతో ప్రతీఏడు వేలకోట్ల బంగారాన్ని తయారు చేసి హాంకాంగ్‌లో అమ్ముతుంటామని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే హాంగ్ కాంగ్ విమానాశ్రయం నుంచి చైనాకు బంగారం రవాణా అవుతుంది. కరోనా వైరస్ వల్ల అన్నీరకాల ఎగుమతుల్ని నిలిపివేసినట్లు నానావతి వెల్లడించారు.

మనదేశంలో 92శాతం బంగారం వ్యాపారం సూరత్ నుంచే జరుగుతుంది. 1608లలోబ్రిటీష్ వారు బంగారం వ్యాపార స్థావరాల్ని అక్కడే ఏర్పాటు చేసుకున్నారు. దీంతో సూరత్ బంగారానికి పెట్టింది పేరుగా నిలుస్తుంది. అంతేకాదు భారత్‌తో పాటు ఇతర దేశాలకు సూరత్ నుంచి బంగారు ఆభరణాలు ఎగుమతి అవుతుంటాయి.

Follow Us:
Download App:
  • android
  • ios