లాక్‌డౌన్ కారణంగా అన్ని రంగాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్ 20 నుంచి కొన్ని రంగాలకు మినహాయింపు ఇవ్వాలని ప్రధాని మోడీ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.

ఈ నేపథ్యంలో ఈ కామర్స్ సంస్థలు సైతం విక్రయాలు జరుపుకోవచ్చంటూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవడంతో ఆయా సంస్థలు షాక్‌కు గురయ్యాయి.

Also Read:64 శాతం తగ్గిన పెట్రోల్.. పెరిగిన వంటగ్యాస్ బుకింగ్స్

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి ఈ కామర్స్ సంస్థలు మొబైల్‌ ఫోన్లు, టీవీలు, ఫ్రీజ్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్టేషనరీ ఉత్పత్తుల విక్రయాలపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

లాక్‌డౌన్ కారణంగా నిత్యవసరాలు కాని వస్తువులను ఈ కామర్స్ కంపెనీలు విక్రయించడానికి లేదని వెల్లడించింది. ఈ కామర్స్ విక్రయదారులు ఉపయోగించే వాహనాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Also Read:కరోనాతో ఉక్కిరిబిక్కిరి.. మాస్ టెస్ట్‌లు బెస్టన్న జెఫ్ బెజోస్

మే 3 వరకు లాక్‌డౌన్‌ పొడిగించిన నేపథ్యంలో 20 తర్వాత సవరించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం వాణిజ్య, ప్రైవేట్ సంస్థలు కార్యకలాపాలను నిర్వహించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఆహారం, మందులు, ఔషధ పరికరాలను విక్రయించుకునేందుకు మాత్రమే కేంద్రం అనుమతి ఇచ్చింది. అనంతరం ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను సైతం విక్రయించుకునే సౌలభ్యం కల్పించగా.. అయితే కేంద్రం తాజాగా ఈ సదుపాయాన్ని కూడా నిలిపివేయడం గమనార్హం.