Asianet News TeluguAsianet News Telugu

మహిళలకు షాక్: పెరిగిన వంట గ్యాస్ ధర

సబ్సిడీ లేని వాణిజ్యపరమైన ఎల్పీజీ ధర మరింతగా పెరిగింది. 19 కిలోలో ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.22.5 పెంచారు. వాణిజ్యపరమైన ఎల్పీజీ సిలిండర్ ధర ఈ పెంపుతో రూ.730 అవుతుంది. 

Cooking gas price increase by Rs 6 per cylinder
Author
New Delhi, First Published May 1, 2019, 12:03 PM IST

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మహిళలకు షాక్ తగలింది. వంట గ్యాస్ ధర 6 రూపాయలు పెరిగింది. 14.2 కిలోల లిక్విఫైడ్ పెట్రోలియం (ఎల్పీజీ) గ్యాస్ సిలిండర్ ధరను రూ.6 పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మంగళవారం నిర్ణయం తీసుకున్నాయి. 

సబ్సిడీ లేని వాణిజ్యపరమైన ఎల్పీజీ ధర మరింతగా పెరిగింది. 19 కిలోలో ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.22.5 పెంచారు. వాణిజ్యపరమైన ఎల్పీజీ సిలిండర్ ధర ఈ పెంపుతో రూ.730 అవుతుంది. 

ధరల పెంపు బుధవారం నుంచి, అంటే మే 1వ తేదీ నుంచే అమలులోకి వచ్చింది. సబ్సిడి మీద అందించే గృహ వినియోగ ఎల్పీజీ సిలిందర్ ధర ఢిల్లీలో 502 రూపాయలకు పెరిగింది. 

పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 5 చొప్పున పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.73.13 కాగా, డీజీలి ధర రూ.66.71. 

Follow Us:
Download App:
  • android
  • ios