Asianet News TeluguAsianet News Telugu

టెక్కీలకు షాక్: సీనియర్లను ఇంటికి పంపుతున్న కాగ్నిజెంట్

టెక్ దిగ్గజం కాగ్నిజెంట్  సీనియర్లకు చెక్ పెడుతోంది. సీనియర్ ఉద్యోగులను ఇంటికి పంపుతోంది. సీనియర్ల స్థానాల్లో  జూనియర్లను  తీసుకొంటుంది.రెండో క్వార్టర్ ఫలితాల్లో  కాగ్నిజెంట్ మార్కెట్  విశ్లేషకుల అంచనాలను చేరుకోలేకపోయింది

Cognizant to trim top deck to make room for juniors

న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం కాగ్నిజెంట్  సీనియర్లకు చెక్ పెడుతోంది. సీనియర్ ఉద్యోగులను ఇంటికి పంపుతోంది. సీనియర్ల స్థానాల్లో  జూనియర్లను  తీసుకొంటుంది.రెండో క్వార్టర్ ఫలితాల్లో  కాగ్నిజెంట్ మార్కెట్  విశ్లేషకుల అంచనాలను చేరుకోలేకపోయింది. దీంతో  సీనియర్లను వదిలించుకోవాలని ఆ సంస్థ నిర్ణయం తీసుకొంది.

అమెరికాలోని న్యూజెర్సీలో ప్రధాన కార్యాలయంగా ఉన్న కాగ్నిజెంట్  సంస్థ ఈ రెండో క్వార్టర్ లో అట్రిక్షన్ రేటు 22 శాతానికి  పైగా ఉందని వెల్లడైంది. 2017లో 4000 వేల మంది ఉద్యోగులను కాగ్నిజెంట్‌ ఇంటికి పంపేసిందని, అంతేకాక 400 మంది సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లకు కూడా వాలంటరీ రిటైర్‌మెంట్‌ స్కీమ్‌ను ఆఫర్‌ చేసినట్టు పేర్కొంది.

సీనియర్లను కాగ్నిజెంట్‌ నుండి బయటకు పంపిస్తున్నట్టు కంపెనీ వర్గాలు ప్రకటించాయి. ఎంతమందిని తొలగించాలని నిర్ణయం తీసుకొంటున్నారనే విషయమై ఆ సంస్థ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.  సీనియర్లను తొలగిస్తూనే వారి స్థానాల్లో జూనియర్లను తీసుకొంటుంది.   రెండో క్వార్టర్‌లో 7500 మంది జూనియర్‌ స్థాయి ఉద్యోగులను తీసుకుని ఉద్యోగుల సంఖ్యను 2,68,900కు చేర్చుకుంది.

 మూడో క్వార్టర్‌లో జూనియర్‌ స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లను, వేతన పెంపును చేపట్టనున్నామని ఫలితాల ప్రకటన తర్వాత కాన్ఫరెన్స్‌లో కాగ్నిజెంట్‌ సీఎఫ్‌ఓ కరెన్‌ మెక్లాగ్లిన్‌ తెలిపారు. సీనియర్‌ స్థాయి ఉద్యోగులకు ఈ ప్రమోషన్లు నాలుగో క్వార్టర్‌లో ఉంటాయని ఆ సంస్థ ప్రకటించింది. .

 

Follow Us:
Download App:
  • android
  • ios