Asianet News TeluguAsianet News Telugu

దివాలా తీసిన ఒకప్పటికి మిలియనీర్ వ్యాపారవేత్త.. కోట్ల అప్పును తీర్చేందుకు ఇలా వాటిని అమ్ముకుంటున్నాడు..

అతను మీల్స్ రెడీ చేసేందుకు ఇంకా కస్టమర్లకు అందించడానికి సొంతంగా పనిచేస్తున్నాడు. అతని జీవిత కథ, వ్యాపారం చైనాలో ముఖ్యాంశాలుగా  నిలుస్తున్నాయి ఇంకా అతని కస్టమర్ సర్వీస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

Chinese Businessman In Bankruptcy Sells Sausages To Pay Off A Debt Of 52 Crore
Author
First Published Nov 24, 2022, 12:48 PM IST

చైనాకు చెందిన ఒక మిలియనీర్ వ్యాపారవేత్త డబ్బును కూడబెట్టేందుకు రోడ్‌సైడ్ స్టాండ్‌లో గ్రిల్ సాసేజ్‌ అమ్ముతున్నాడు.  ఎందుకు అనుకుంటున్నారా.. అతనికి మొత్తం 52 కోట్ల కంటే పైగా లోన్  ఉందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. ఈ లోన్ డబ్బు మొత్తం తిరిగి చెల్లించెందుకు  అతను రోడ్డు పక్కన ఒక దుకాణాన్ని కూడా నిర్మించాడు. 

అతను మీల్స్ రెడీ చేసేందుకు ఇంకా కస్టమర్లకు అందించడానికి సొంతంగా పనిచేస్తున్నాడు. అతని జీవిత కథ, వ్యాపారం చైనాలో ముఖ్యాంశాలుగా  నిలుస్తున్నాయి ఇంకా అతని కస్టమర్ సర్వీస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం 52 ఏళ్ల టాంగ్ జియాన్  తన రూ.52 కోట్ల భారీ లోన్ డబ్బు తిరిగి చెల్లించడానికి ఈస్టేర్న్ చైనా నగరమైన హాంగ్‌జౌలో  స్ట్రీట్  స్టాల్ ఏర్పాటు చేసుకొని  డబ్బును కూడబెట్టుకుంటూ, చైనా ప్రజల నుండి ప్రశంసలు పొందుతున్నాడు. 

ది కియాన్‌జియాంగ్ ఈవినింగ్ న్యూస్‌ ప్రకారం న్యూస్ అవుట్‌లెట్ మాట్లాడుతూ, టాంగ్ జియాన్  ఒక విజయవంతమైన వ్యాపారవేత్త అతనికి  ఎన్నో రెస్టారెంట్లు  ఉన్నాయి, 36 సంవత్సరాల వయస్సులోనే అతను గణనీయమైన సంపదను సంపాదించుకున్నాడని పేర్కొంది.

అయితే, 2005లో అతను ల్యాండ్‌స్కేప్ ఇంజనీరింగ్ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు దీంతో అతని అదృష్టం మారిపోయింది. వెంచర్‌లో అతను ఎంత ఎక్కువ పెట్టాడో అంతకంటే ఎక్కువగా నష్టపోయాడు.

చివరికి, అతను తన రెస్టారెంట్లు, ఇళ్ళు, కార్లను కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. అయితే $6.4 మిలియన్ల (రూ. 52 కోట్లు) అప్పులు మిగిలిపోయాయి. దీంతో అప్పుడే అతను సాసేజ్‌లను విక్రయించే ప్లాన్ రూపొందించాడు.

ప్రతి సాసేజ్ స్వచ్చమైన మాంసంతో నిండి ఉంటుంది, అందులో పిండి పదార్ధం ఉండదు. పార్కులు లేదా మార్కెట్లలో అమ్మే వాటితో పోల్చితే మాది మీకు సురక్షితమైన అనుభూతిని కలిగిస్తుంది" అని టాంగ్ జియాన్  పేర్కొన్నట్లు న్యూస్ ఔట్‌లెట్ పేర్కొంది.

"మనలో ప్రతి ఒక్కరూ సవాలుతో కూడిన జీవితాన్ని గడుపుతారు ఇంకా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు, అయితే మనం ఎప్పుడూ ఓడిపోకూడదనే స్ఫూర్తి ఉండాలి" అని టాంగ్  జియాన్  చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios