Asianet News TeluguAsianet News Telugu

చైనాలో మొదలైన 5G సేవలు: ఇంటర్నెట్ స్పీడ్ ఎంతో తెలుసా ?

చైనాలో 5G సర్వీసులు ప్రారంభించిన 3 టెల్కోలు. బీజింగ్, షాంఘైలతో పాటు మరో 50 నగరాల్లో తమ 5G సేవలు. వచ్చే ఏడాది నాటికి 5G వినియోగంలో 17 కోట్ల మంది యూజర్లతో  చైనా మొదటి స్థానంలో నిలుస్తుంది. 

china telecom networks started 5g serices
Author
Hyderabad, First Published Nov 1, 2019, 4:52 PM IST

బీజింగ్‌: ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగిన  దేశం చైనా. జనాభాలోనే కాదు టెక్నాలజీలో కూడా ముందే ఉంది. టెక్నాలజీ వినియోగంలో అమెరికాను అధిగమించే క్రమంలో చైనా తాజాగా 5జీ టెలికం సేవలు ప్రారంభించింది.

చైనా దేశానికి చెందిన మూడు దిగ్గజ టేలికో సంస్థలు  గురువారం ఈ  5G సర్వీసులను ప్రారంభించాయి. బీజింగ్, షాంఘైలతో పాటు మరో 50 నగరాల్లో తమ 5G సేవలు అందుబాటులో ఉంటాయని చైనాలోని ఒక మొబైల్‌ సంస్థ వెల్లడించింది.

also read అమేజింగ్ మిస్టేక్.. కుర్రాళ్లు కుమ్మేశారు!!

రీఛార్జ్  ప్యాకేజీలు నెలకు 128 యువాన్ల నుంచి (18 డాలర్లు) ప్రారంభమవుతాయని పేర్కొంది. ఇక పోటీ సంస్థలైన చైనా టెలికం, చైనా యూనికామ్‌ కూడా అదే స్థాయి రీఛార్జ్ టారిఫ్‌లతో సర్వీసులు అందిస్తున్నట్లు ప్రకటించాయి.

china telecom networks started 5g serices

ప్రస్తుతం ఉన్న 4జీ నెట్‌వర్క్‌లతో పోలిస్తే 100 రెట్లు వేగంగా ఉండే  5G సేవలతో సెకన్ల వ్యవధిలోనే పూర్తి నిడివి సినిమాను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డ్రైవర్‌రహిత కార్లు, ఫ్యాక్టరీలల్లో ఆటోమేషన్‌ వంటి వాటికి ఇవి చాల ఉపయోగపడనున్నాయి.

also read 300 విమానాలను ఆర్డర్ చేసిన ఇండిగో...

వచ్చే ఏడాది నాటికి 5G వినియోగంలో 17 కోట్ల మంది యూజర్లతో  చైనా మొదటి స్థానంలో నిలుస్తుందని, సుమారు 75వేల  మంది యూజర్లతో దక్షిణ కొరియా రెండో స్థానంలో ఉండగా .. 10వేల మంది వినియోగదారులతో అమెరికా మూడో స్థానంలో ఉండొచ్చని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. 5G  డివైజస్  ఉత్పత్తిలో అగ్రగామీలైన చైనా సంస్థలు హువావే, జెడ్‌టీఈలపై అమెరికా ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios